Take a fresh look at your lifestyle.

బ్రిటిష్‌ ‌వారి కర్కశత్వానికి ప్రతీక జలియన్‌ ‌వాలాబాగ్‌ ‌దుర్ఘటన

‘‘‌జలియన్‌వాలాబాగ్‌ ‌దురంతం భారత స్వాతంత్య్ర సంగ్రామ సమయంలో జరిగిన అత్యంత దురదృష్టమైన సంఘటన. జలియన్‌ ‌వాలాబాగ్‌ అనేది ఉత్తర భారతదేశంలోని అమృత్‌సర్‌ ‌పట్టణంలో ఒక తోట.ఏప్రిల్‌ 13, 1919 ‌న బ్రిటీష్‌ ‌సైనికులు జనరల్‌ ‌డయ్యర్‌ ‌సారథ్యంలో ఈ తోటలో సమావేశమైన నిరాయుధులైన స్త్రీ, పురుషులు, పిల్లలపైన విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పులు పది నిమిషాలపాటు కొనసాగాయి. 1650 రౌండ్లు కాల్పులు జరిగాయి. అప్పటి ఆంగ్ల ప్రభుత్వ లెక్కల ప్రకారం 379 మంది మరణించారు. కానీ ఇతర గణాంకాల ప్రకారం అక్కడ 1000 కి పైగా మరణించారు. 2000 మందికి పైగా గాయపడ్డారు.’’

జలియన్‌వాలాబాగ్‌ ‌దురంతం భారత స్వాతంత్య్ర సంగ్రామ సమయంలో జరిగిన అత్యంత దురదృష్టమైన సంఘటన. జలియన్‌ ‌వాలాబాగ్‌ అనేది ఉత్తర భారతదేశంలోని అమృత్‌సర్‌ ‌పట్టణంలో ఒక తోట.ఏప్రిల్‌ 13, 1919 ‌న బ్రిటీష్‌ ‌సైనికులు జనరల్‌ ‌డయ్యర్‌ ‌సారథ్యంలో ఈ తోటలో సమావేశమైన నిరాయుధులైన స్త్రీ, పురుషులు, పిల్లలపైన విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పులు పది నిమిషాలపాటు కొనసాగాయి. 1650 రౌండ్లు కాల్పులు జరిగాయి. అప్పటి ఆంగ్ల ప్రభుత్వ లెక్కల ప్రకారం 379 మంది మరణించారు. కానీ ఇతర గణాంకాల ప్రకారం అక్కడ 1000 కి పైగా మరణించారు. 2000 మందికి పైగా గాయపడ్డారు.
బావిలోనే 120 మృతదేహాలు..! ప్రాణాలు కాపాదుకుందమని దూకేసారు..!!
image.png
కాల్పుల నుంచి తప్పించుకునేందుకు ప్రజలు ప్రవేశమార్గాల వద్దకు వెళ్లారు. మొత్తం ఐదు ప్రవేశమార్గాలు ఉండగా ఒకటి మాత్రమే పెద్దది. అయితే దీన్ని బ్రిటిషుసైనికులు మూసివేయడంతో ప్రజలకు తప్పించుకునేందుకు వీలులేకుండా పోయింది. తప్పించుకునే క్రమంలో పార్క్‌లోని బావిలో ప్రజలు దూకేశారు. ఇక్కడ నుంచే 120 మృతదేహాలను వెలికితీశారు.  సామ్రాజ్యవాదులు తమ రాజ్యాధికారం నిలబెట్టుకోవటానికి.. విప్లవభావాలను మొగ్గ దశలోనే అణచివేయటం కోసం ప్రజల ప్రాణాలను ఎంత సునాయాసంగా తీయగలరో చెప్తుంది ఈ ‘జలియన్‌ ‌వాలాబాగ్‌ ‌మారణకాండ’.
జలియన్‌ ‌వాలాబాగ్‌  ‌ఘోర సంఘటనకు పూర్వం
అంతకు ముందే ముగిసిన మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటీష్‌ ‌వారికనుకూలంగా.. మన దేశం తరపున సైన్య సహాయాన్ని పంపాలి అనే గాంధీ నిర్ణయానికి కట్టుబడి భారత్‌ ‌తరపున సైన్యం, యుద్ధానికి కావలసిన ఆయుధసామగ్రి కోసం డబ్బు పంపిణీ.. ఈ విధంగా మనకు చాలానే నష్టం జరిగింది. ఇంత సహాయం చేసినా గాంధీ ఊహించినట్లు.. బ్రిటీష్‌ ‌వాళ్ళు మనకు స్వాతంత్య్రం ఇవ్వలేదు. యుద్ధం తర్వాత స్వాతంత్య్రం రాలేదు సరికదా ద్రవ్యోల్బణం పెరిగింది. పన్నులు పెరిగాయి. ఈ సంఘటనలతో ప్రజల్లో పెరిగిన విప్లవాన్ని అణచటానికి బ్రిటీష్‌ ‌ప్రభుత్వం ‘రౌలత్‌ ‌చట్టం’ చేసింది. ఈ చట్ట ప్రకారం విచారణ లేకుండా రాజకీయ నాయకులను నిర్బంధించవచ్చు. అలాగే తిరుగుబాటుదారులుగా అనుమానితులైన వ్యక్తులను వారంటు లేకుండా అరెస్టు చేయవచ్చు! ఈ చట్టం పై దేశంలో సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి.
ఆంగ్లేయ పాలకుల నిర్బంధానికి నిరసనగా జలియన్‌ ‌వాలాబాగ్‌లో వేలాదిమంది సమావేశం అయ్యారు.పైగా ఆరోజు పంజాబీ ప్రజల నూతన సంవత్సర పండుగ ‘‘వైషాఖి’’ కావటంతో ప్రజలు ఎక్కువ సంఖ్యలో హాజరయ్యారు.డయ్యర్‌ అమానుష కాల్పుల వల్ల ,వందలాది మంది బలయ్యారు. వేలాది మంది క్షతగాత్రులయ్యారు.
ప్రతి చర్య
భారతదేశంలో ,జలియన్‌ ‌వాలా బాగ్‌ ‌ఘటనకు ప్రతిగా తీవ్రమైన ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. పంజాబ్‌ ‌లో జరుగుతున్న స్వాతంత్య్రోద్యమానికి మరింత ఆజ్యం పోసింది. 1920 లో గాంధీజీ ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా సహాయ నిరాకరణోద్యమం ప్రారంభించడానికి నాంది పలికింది. భగత్‌ ‌సింగ్‌ ‌విప్లవకారుడిగా మారడానికి కూడా ఈ సంఘటనే కారణం. విశ్వకవి రవీంద్రనాథ్‌ ‌టాగూర్‌, ‌బ్రిటీష్‌ ‌ప్రభుత్వం తనకిచ్చిన సర్‌ ‌బిరుదును ఇంగ్లండు ప్రభువుకు తిరిగి ఇచ్చివేశాడు. మొత్తమ్మీద ఈ సంఘటన స్వాతంత్య్రోద్యమానికి మరింత స్ఫూర్తినిచ్చి వేగవంతం చేసిందని చెప్పవచ్చు.
భరతజాతి ముద్దుబిడ్డ… డయ్యర్‌ ‌ను చంపిన ఉద్ధం సింగ్‌
‌నిజమైన దేశభక్తి అంటే ఏంటో నిరూపించిన మహా వీరుడు..జలియన్‌ ‌వాలా బాగ్‌ ఊచకోత లో వేల మంది అమాయకులను కాల్చి చంపిన జనరల్‌ ‌డయ్యర్‌ ‌ను 21 ఏళ్ళ తర్వాత వాళ్ళ దేశం వెళ్ళి మరీ కాల్చి చంపిన ఉద్ధం సింగ్‌. 1919, ఏ‌ప్రిల్‌ 13‌న జలియన్‌ ‌వాలాబాగ్‌లో సమావేశమైన ప్రజలకు మంచి నీళ్ళు ఇవ్వటానికి వాలెంటీర్‌గా వచ్చాడు. తన కళ్ళ ముందే నిరాయుధులైన సాటి భారతీయులను చంపటం చూసి ఆ బాధలో ‘ఇంత మంది భారతీయులను చంపిన డయ్యర్‌ను చంపకపోతే.. నేను భారతీయుడినే కాదు’ అని శపధం చేసుకున్నాడు. ఆ తర్వాత.. గద్దర్‌ ‌పార్టీలో చేరి అక్కడ గూఢచర్యం, గన్‌ ‌షూటింగ్‌ ‌నేర్చుకున్నాడు. ఈ లోగా బ్రిటీష్‌ ‌ప్రభుత్వం డయ్యర్‌ని బ్రిటన్‌ ‌పంపేసింది. అతన్ని చంపటం కోసం ఉద్ధం సింగ్‌ ‌కూలిపనుల నెపంతో జర్మనీ వెళ్లాడు. అక్కడి నుండి రహస్యంగా లండన్‌ ‌చేరాడు. అక్కడ ఉంటూనే.. ఒక ప్రణాళికను రచించాడు. దాని ప్రకారం డయ్యర్‌ ‌మార్చ్ 13‌న ఈస్ట్ ఇం‌డియా కంపెనీ తరపున మీటింగ్‌కు వెళ్తున్నాడని తెలుసుకుని.. అక్కడికి ముందుగానే చేరుకున్నాడు. డయ్యర్‌ ‌తనకు కనిపించగానే.. గన్‌తో కాల్చి చంపేసాడు. ‘నా భారతీయుల ప్రాణాలకు నీకు ఇదే శిక్షరా..’’ అన్నాడు.
1940, జులై 31న ఉద్ధం సింగ్‌ను ఉరితీసి చంపారు. ఆ శిక్ష విధించబోయే ముందు కోర్ట్‌లో ‘‘నేనే  చేశాను ఈ హత్య. అతని మీద నాకు పగ. నేను అతనిని చంపేటంత తప్పు చేసాడు, నా దేశ ప్రజలను చంపాడు. అందుకనే వాడిని చంపేసాను. అందుకోసం 21 సంవత్సరాలు వేచి చూసాను.  నేను ఈ పని చేసినందుకు సంతోషంగా ఉన్నాను. నేను మరణశిక్షకు భయపడటం లేదు. నేను నా దేశం కోసం మరణిస్తున్నాను. అది నా బాధ్యత. నా మాతృభూమి కోసం మరణం కన్నా.. నాకు ఎక్కువ గౌరవం ఇవ్వబడుతుంది?’’ అన్నాడు. ఉద్ధం సింగ్‌ ‌డయ్యర్‌ని వెతకటంలో భాగంగా కొన్ని రోజులు తిండి లేక కేవలం మంచి నీళ్ళు తాగి బతికాడు. అతని పట్టుదల, త్యాగనిరతి, సాహసం ఎంత గొప్పవో అర్ధం చేసుకోవటానికి మరో ఉదాహరణ ఈ సంఘటన. భారతదేశ స్వాతంత్య్ర ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా జలియన్‌ ‌వాలా బాగ్‌  ‌ఘటన స్ఫూర్తినిచ్చింది.– పిన్నింటి బాలాజీ రావు
 హనుమకొండ.

Leave a Reply