Take a fresh look at your lifestyle.

జై కిసాన్‌ ‌నినాదాన్ని నిజం చేసిన ఘనత కేసీఆర్‌ ‌దే

  • ఆ నినాదాన్ని మా విధానంగా మార్చుకున్నాం
  • సాలనా సౌలభ్యం కోసమే జిల్లాలు, మండలాల పునర్వ్యవస్థీకరణ
  • ధూళిమిట్ట మండలం ప్రారంభ కార్యక్రమంలో మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు

దేశ వెన్నెముక, అన్నదాత అంటూ రైతులను కీర్తించడం తప్ప రైతుకు వెన్నుదన్నుగా నిలవడంలో గత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు పేర్కొన్నారు. జై కిసాన్‌ అనే నినాదాన్ని నిజం చేసిన ఘనత ఒక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకే దక్కుతుందని మంత్రి అన్నారు. గురువారం డప్పు చప్పుళ్ళు, మంగళ వాయిద్యాల మధ్య పండుగ వాతావరణంలో నూతన ధూళిమిట్ట మండలంను స్థానిక శాసన సభ్యులు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌ ‌వంటే రు ప్రతాప్‌ ‌రెడ్డిలతో కలిసి హరీష్‌ ‌రావు ప్రారంభించారు.

- Advertisement -

మొదట ధూళిమిట్ట సెక్షన్‌ ‌సహాయ ఇంజనీర్‌(ఆపరేషన్‌) ‌కార్యాలయాన్ని మంత్రి ప్రారంభించి నూతన సహాయ ఇంజనీర్‌(ఆపరేషన్‌) ‌బాధ్యతలు చేపట్టిన ఎల్‌ ‌శ్రీనివాస్‌ను అభినందించారు. అనంతరం తహశీల్దార్‌ ‌కార్యాలయాన్ని హరీష్‌ ‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ధూళిమిట్ట గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మండల ప్రజలను ఉద్దేశించి మంత్రి సుదీర్ఘ ప్రసంగం చేశారు. దేశంలో తెలంగాణ మినహా మరెక్కడా ఏడాదికి 15 వేల కోట్లు ఖర్చు పెట్టే ఒక కార్యక్రమం లేదని మంత్రి తెలిపారు. తెలంగాణలో రైతుల సంక్షేమాన్ని కాంక్షించి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏడాది పంట పెట్టుబడి కింద రైతులకు పదిహేను వేల కోట్ల రూపాయలను క్రమం తప్పకుండా సహాయంగా అందిస్తుందని మంత్రి తెలిపారు.

Leave a Reply