Take a fresh look at your lifestyle.

దళితులు, మైనార్టీలను నట్టేట ముంచారు వైసిపి పాలనకు వ్యతిరేకంగా ధర్నా

విజయవాడ, జూలై 31 : దళితులు, మైనార్టీలను ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి నట్టేట ముంచారని  జై భీమ్‌ ‌యాక్సిస్‌ ‌వ్యవస్థపాకులు, సీనియర్‌ ‌న్యాయవాది శ్రావణ్‌ ‌కుమార్‌ అన్నారు. రెండున్నరేళ్ల వైసీపీ పాలనలో దళితులు, మైనార్టీలను పొట్టన పెట్టుకున్నారని మండిపడ్డారు. వారికి రావాల్సిన అనేక పథకాలను రద్దు చేయడమే కాక, నిధులు దారి మళ్లించారని ధ్వజమెత్తారు. శనివారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును నిరసిస్తూ ఇండియన్‌ ‌యూనియన్‌ ‌ముస్లింలీగ్‌ ‌ధర్నా చేపట్టింది. ఈ ఆందోళనకు శ్రావణ్‌ ‌కుమార్‌ ‌మద్దతు పలికారు. ఈసందర్భంగా ఆయన డియాతో మాట్లాడుతూ… ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్లలో ఒక్క రూపాయి కూడా లేకుండా చేశారన్నారు.ఇప్పుడు జగన్మోహన్‌రెడ్డి మైనార్టీలను మాయ మాటలతో మోసం చేస్తున్నారన్నారు. జగన్‌ ‌మాటలను నమ్మి అందరూ ఓట్లేసి గెలిపిస్తే.. ఇప్పుడు జగన్‌ ‌నట్టేట ముంచారన్నారు. దళితులు, మైనార్టీలను అప్పుల పాలు చేశారన్నారు. నంద్యాలలో ఓ ముస్లిం కుటుంబానికి అన్యాయం చేసి.. వారిని బలి చేశారన్నారు. ఒక ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి.. ముస్లిం సమాజానికి మొత్తం చేశామని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు.

బషీర్‌ అహ్మద్‌ ‌చేస్తున్న పోరాటానికి తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందన్నారు. జగన్‌ ‌తన పని తీరు మార్చుకోకపోతే.. తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. దుల్హన్‌ ‌పథకం కింద లక్ష, విదేశీ విద్య కోసం పదిహేను లక్షలు ఇస్తామని జగన్మోహన్‌రెడ్డి ఎన్నికల సమయంలో చెప్పారని ఇండియన్‌ ‌యూనియన్‌ ‌ముస్లిం లీగ్‌ ‌నేత బషీర్‌ అహ్మద్‌ అన్నారు. శనివారం ఆయన డియాతో మాట్లాడుతూ..జగన్‌ ‌మాటలు నమ్మి ముస్లింలు జగన్‌కు ఓట్లు వేసి గెలిపించారన్నారు. సీఎం అయ్యాక.. ముస్లింలను ఆర్థికంగా రాజకీయంగా తొక్కేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హాలను అమలు చేసి. జగన్‌ ‌మాట నిలబెట్టుకోవాలన్నారు.

Leave a Reply