Take a fresh look at your lifestyle.

దళిత అభ్యున్నతికి జగ్జీవన్ రామ్ ఎనలేని కృషి

  • ఎస్సీ ఎంపవర్మెంట్ స్కీమ్ కై బడ్జెట్ లో వెయ్యి కోట్లు
  • రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ హరీశ్ రావు
స్వాతంత్య్ర సమరయోధుడు, భారత మాజీ ఉప ప్రధాన మంత్రి, భారతరత్న డాక్టర్‌ బాబూ జగ్జీవన్‌రామ్‌ జయంతి సందర్భంగా సోమవారం ఉదయం సిద్ధిపేటలోని ఆయన విగ్రహానికి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ హరీశ్ రావు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసం నిరంతరం పోరాడిన గొప్ప వ్యక్తి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అని, దేశానికి ఆయన చేసిన సేవలు ఆదర్శనీయమని పేర్కొన్నారు.
దళితుల అభ్యున్నతికి బాబు జగ్జీవన్ రామ్ ఎనలేని కృషి చేశారని గుర్తు చేసి, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎస్సీ ఎంపవర్మెంట్ స్కీమ్ కింద బడ్జెట్ లో వెయ్యి కోట్లు  కేటాయించారని మంత్రి వెల్లడించారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి రోజా రాధాకృష్ణ శర్మ, పార్లమెంట్ సభ్యులు శ్రీ కొత్త ప్రభాకర్ రెడ్డి, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply