Take a fresh look at your lifestyle.

జగ్గారెడ్డి సొంత ఎజెండా? కాంగ్రెస్‌లో జగ్గారెడ్డి రూటే సెపరేటా?

బర్త్‌డే తర్వాత భవిష్యత్‌ను అనౌన్స్ ‌చేయనున్న జగ్గారెడ్డి?
కాంగ్రెస్‌ ‌పార్టీ సీనియర్‌ ‌నాయకుడు, సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్‌రెడ్డి అలియాస్‌ ‌జగ్గారెడ్డి సొంత ఎజెండాతో వెళ్తున్నారా? అంటే, ఆయన తాజాగా చేపట్టిన సైకిల్‌ ‌యాత్ర ఔననే చెబుతుంది. పిసిసి చీఫ్‌గా రేవంత్‌రెడ్డిని మొదటి నుంచి జగ్గారెడ్డి వ్యతిరేకిస్తున్నాడు. ఇదే విషయమై ఈ నెల 3న ‘ప్రజాతంత్ర’ తెలంగాణ దినపత్రిలో ఉత్తర, దక్షిణ ధృవాలుగా ఉన్న రేవంత్‌రెడ్డి, జగ్గారెడ్డి కలిసి పని చేస్తారా? అనే విషయమై ప్రముఖంగా వార్తను ప్రచురించింది. ‘ప్రజాతంత్ర’ వార్తను ప్రచురించినట్లుగానే పిసిసి చీఫ్‌గా నియమితులైన రేవంత్‌రెడ్డిని పార్టీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంటుగా నియమితులైన జగ్గారెడ్డి దూర దూరంగానే ఉంటున్నారు. పిసిసి చీఫ్‌గా నియమితులైన రేవంత్‌రెడ్డి పార్టీలోని నేతలను ఆయన కలవడమో, ఆయనను పార్టీ నేతలు కలవడమో ప్రతి నిత్యమూ జరుగుతుంది. కానీ, రేవంత్‌రెడ్డిని గ్గారెడ్డి కానీ, జగ్గారెడ్డిని రేవంత్‌రెడ్డి కానీ కలుసుకోలేదు. పైగా, ఎవరికీ చెప్పా పెట్టకుండా పెరిగిన పెట్రోలు, డీజిల్‌ ‌ధరలను నిరసిస్తూ జగ్గారెడ్డి మాదాపూర్‌ ‌నుంచి గాంధీభవన్‌ ‌వరకు సడన్‌గా సైకిల్‌ ‌తొక్కుతూ శుక్రవారం నిరసన చేపట్టడం ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశంగా మారింది.

పెట్రోలు, డీజిల్‌ ‌ధరలు రోజు రోజుకూ పెరుగుతున్నయి. అయితే, పెరుగుతున్న పెట్రోలు, డీజిల్‌ ‌ధరలపై జాయతీ కాంగ్రెస్‌ ‌పార్టీ, రాష్ట్ర కాంగ్రెస్‌ ‌పార్టీ ఎలాంటి నిరసనలకు పిలుపునివ్వలేదు. కానీ, జగ్గారెడ్డి మాత్రం పెరుగుతున్న పెట్రోలు, డీజిల్‌ ‌ధరలను నిరసిస్తూ ఒక్కడే సైకిల్‌ ‌తొక్కుతూ నిరసన తెలపడం చూస్తుంటే తన సొంత ఎజెండాతోనే ముందుకు పోవాలన్న ఆలోచనలో ఉన్నట్లు కనబడుతుంది. టిపిసిసి చీఫ్‌గా తాను అనుకున్న వారిని నియమిస్తే రాష్ట్రమంతటా తిరిగి పని చేస్తాననీ, అలా జరగని పక్షంలో సంగారెడ్డి నియోజకవర్గంకే పరిమితమవుతాననీ ఇప్పటికే ప్రకటించిన జగ్గారెడ్డి…రేవంత్‌రెడ్డిని పార్టీ అధిష్టానం పిసిసి చీఫ్‌గా నియమించడంతో జగ్గారెడ్డి తను ఎంచుకున్న దారిలోనే వెళ్లేందుకు సిద్ధమయ్యే ఎవరికీ చెప్పాపెట్టకుండా ఆకస్మాతుగా సైకిల్‌ ‌యాత్రను చేపట్టారనీ ప్రచారం జరుగుతుంది.

ఇదిలా ఉంటే, ఈ నెల 7న జగ్గారెడ్డి బర్త్‌డే. అదే రోజున టిపిసిసి చీఫ్‌గా నియమితులైన రేవంత్‌రెడ్డి కూడా పదవీ బాధ్యతలను చేపట్టనున్నారు. అయితే, సొంత ఎజెండాతో ముందుకు వెళ్లాలా? పార్టీ చెప్పినట్లుగా రేవంత్‌రెడ్డితో కలిసి వెళ్లాలా? లేదంటే నియోజకవర్గానికే పరిమితం కావాలా? అన్నదానిపై తన బర్త్‌డే అనంతరం జగ్గారెడ్డి అనౌన్స్ ‌చేసే అవకాశం ఉందనీ, ఇదే విషయమై తన సన్నిహితుల వద్ద జగ్గారెడ్డి చెబుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. అయితే, కాంగ్రెస్‌లో జగ్గారెడ్డి రూటే సెపరేట్‌ అం‌టున్న వారూ లేకపోలేదు. ఏది ఏమైనా, అందరూ ఏకతాటిపైకి వచ్చిన వేళ…జగ్గారెడ్డి సైకిల్‌ ‌యాత్ర పార్టీలో కొత్త చర్చకు దారితీసిందనీ పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Leave a Reply