Take a fresh look at your lifestyle.

మరణించిన రైతులకు నివాళులు

సంగారెడ్డి లో కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొన్న జగ్గారెడ్డి
హైదరాబాద్‌, ‌నవంబర్‌ 20 (‌ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి): సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆధ్వర్యంలో ఢిల్లీ రైతు ఉద్యమం లో మరణించిన రైతులకు శనివారం రాత్రి నివాళులర్పించారు. అనంతరం వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవడాన్ని హర్షిస్తూ బాణాసంచా పేల్చి సంబరాలు నిర్వహించారు.రైతు చట్టాలు వెనక్కి తీసుకున్నందుకు రోడ్డు పై ప్రజలకు స్వీట్లు పంచారు.

ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ..వ్యవసాయ చట్టాలు తెచ్చినప్పుడే వాటికి వ్యతిరేకంగా రాహుల్‌ ‌గాంధీ, సోనియాగాంధీ లు పార్లమెంట్‌ ‌లో ఉద్యమించారనీ, వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పార్టీలకతీతంగా రైతులంతా ఏకమై సుదీర్ఘ నిరసనలు చేపట్టడం చరిత్రలో మొదటిసారి అన్నారు.ఢిల్లీ లో చలికి వణుకుతూ, వానకు తడుస్తూ రైతులు సాహసోపేతంగా ఉద్యమం చేశారు.ఈ ఉద్యమ కాలంలో ఎంతో మంది రైతులు చనిపోయారు, కొంతమంది చంప బడ్డారన్నారుదేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ ‌పార్టీ రైతు ఉద్యమానికి మద్దతు పలికింది. వారు ఏ పిలుపిచ్చిన కాంగ్రెస్‌ ‌శ్రేణులు పాల్గొన్నాయన్నారు. ఏఐసిసి ఈ రైతు ఉద్యమ కాలంలో చనిపోయిన 700 మంది రైతు కుటుంబాలకు కాంగ్రెస్‌ ‌పార్టీ తరుపున నివాళులు అర్పిస్తున్నామన్నారు. చనిపోయిన రైతు కుటుంబాలను కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని కాంగ్రెస్‌ ‌పార్టీ తరపున డిమాండ్‌ ‌చేస్తున్నామనీ జగ్గారెడ్డి అన్నారు. ఆయనతో పాటు నిర్మలా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply