Take a fresh look at your lifestyle.

జగ్గారెడ్డి ఫ్యామిలీ అరెస్టు.. కొండాపూర్‌ ‌పోలీస్‌స్టేషన్‌కు తరలింపు

కాంగ్రెస్‌ ‌విద్యార్థి, నిరుద్యోగ గర్జనపై హై టెన్షన్‌ ‌నెలకొంది. ఎక్కడికక్కడ విద్యార్థులు, కాంగ్రెస్‌ ‌నేతలను పోలీసులు అరెస్ట్ ‌చేశారు. ఈ క్రమంలోనే టిపిసిసి వర్కింగ్‌ ‌ప్రెసిడెంటు, సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్‌రెడ్డి అలియాస్‌ ‌జగ్గారెడ్డి ఫ్యామిలీని పోలీసులు అదుపులోకి తీసుకుని కొండాపూర్‌ ‌పోలీస్‌ ‌స్టేషన్‌కు తరలించారు.

శనివారం తెలంగాణ కాంగ్రెస్‌ ‌పార్టీ ఆధ్వర్యంలో దిల్‌సుఖ్‌నగర్‌లో నిర్వహించతలపెట్టిన విద్యార్థి, నిరుద్యోగ జంగ్‌ ‌సైరన్‌లో పాల్గొనేందుకు జగ్గారెడ్డి ఆయన సతీమణి, సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్‌ ‌పార్టీ అధ్యక్షురాలు తూర్పు నిర్మలా జగ్గారెడ్డి, కూతురు జయారెడ్డి అలియాస్‌ ‌కూచి వెళ్తున్న క్రమంలో పోలీసులు అరెస్టు చేసి కొండాపూర్‌ ‌పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

Leave a Reply