Take a fresh look at your lifestyle.

ఇం‌ద్రవెల్లి సభపై ఆదిలాబాద్‌ ‌నేతలతో చర్చించిన జగ్గారెడ్డి

హైదరాబాద్‌, ఆగస్టు 3 (ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి): ఆదిలాబాద్‌ ‌జిల్లా ఇంద్రవెల్లిలో ఈ నెల 9న లక్షమందితో  నిర్వహించనున్న సభకు సంబంధించిన ఏర్పాట్లపై మంగళవారమిక్కడ టిపిసిసి మాజీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌జెట్టి కుసుమ కుమార్‌ ‌నివాసంలో టిపిసిసి వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌జగ్గారెడ్డితో ఆదిలాబాద్‌ ‌జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌రావు, టిపిసిసి నాయకుడు వేం నరేందర్‌రెడ్డి, మాజీ విప్‌ ఎరవత్రి అనిల్‌  ‌తదితరులు చర్చించారు.  తెలంగాణ రాష్ట్రం  వచ్చిన తర్వాత  ఆదిలాబాద్‌ ‌జిల్లాలో 7 సంవత్సరాల తర్వాత ఇప్పటి వరకు ఏ పార్టీ ఇంత పెద్ద సభ నిర్వహించలేదనీ ప్రేమ్‌సాగర్‌రావు తెలిపారు. టిపిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి లక్ష మందితో సభ నిర్వహిస్తామనీ, చెప్పిన మాట వాస్తవ రూపం దాల్చే విధంగా ఈ సభ ఉంటుందని ప్రేమ్‌సాగర్‌రావు అన్నారు. ఈ సమావేశంలో సభ ఏర్పాట్లకు సంబంధించి చర్చించారు.  ఇంద్రవెల్లిలో 18 ఎకరాల స్థలం లీజుకు తీసుకుని సభాస్థలి ఏర్పాటు చేయనున్నారు.  ఆదిలాబాద్‌ ‌నియోజకవర్గం నుండి 15 వేల మందికి పైగా బోథ్‌ ‌నియోజకర్గం నుండి 18 వేల మంది, అసిఫాబాద్‌ ‌నుండి 15 వేలమంది, ఇంద్రవెల్లి, సిరికొండ, ఉట్నూర్‌ ‌నుండి 20 వేలకుపైగా జనం, ఖానాపూర్‌, ‌కడెం, జిన్నారం తదితర మండలాల నుంచి 6 వేల మంది, సిర్పూర్‌ ‌నియోజకవర్గం నుండి 1000 మంది, బెల్లంపల్లి, చెన్నూరు, నిర్మల్‌ ఒక్కో నియోజకవర్గం నుంచి 3వేల మంది చొప్పున 9వేల మంది, మంచిర్యాల నుండి 9 వేల మంది కార్యకర్తలు, నాయకులు తరలించనున్నారు.

ఈ నియోజకవర్గాలతో పాటు బాల్కొండ, ఆర్మూర్‌, ‌జగిత్యాల, ధర్మపురి, కోరుట్ల, రామగుండం, బోధన్‌, ‌నిజామాబాద్‌, ‌కరీంనగర్‌ ‌జిల్లాలో నుండి పెద్ద ఎత్తున నాయకులు,కార్యకర్తలు హాజరవుతారనీ జగ్గారెడ్డి, ప్రేమ్‌సాగర్‌ ‌తెలిపారు. ప్రదేశ్‌ ‌కాంగ్రెస్‌  ‌కమిటీ నుండి జన సమీకరణకై  టిపిసిసి సీనియర్‌ ‌నాయకులను నియోజకవర్గాల వారీగా సమన్వయకర్తలను నియమించారు. ఇదిలా ఉంటే, ఈ నెల 7న టిపిసిసి వర్కింగ్‌ ‌ప్రెసిడెంటు జగ్గారెడ్డి, మాజీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంటు కుసుమకుమార్‌, ‌మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌రావు లు, ప్రస్తుత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, మాజీ మంత్రులు, మాజీ  ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, ఆదిలాబాద్‌ ‌జిల్లాకు చెందిన నాయకులు, టిపిసిసి  తరుపున నియమించిన సమన్వయకర్తలు, జిల్లా ప్రెసిడెంట్లు, జిల్లా బాధ్యులు, మండల ప్రెసిడెంట్లు, ప్రజా ప్రతినిధులు ఇంద్రవెల్లిలో నిర్వహించే సభాస్థలిని సందర్శించనున్నారు.

Leave a Reply