Take a fresh look at your lifestyle.

కాంగ్రెస్‌కు ఆక్సిజన్‌గా జగ్గా(సంగా)రెడ్డి

అప్పుడు రాహుల్‌ ‌గర్జన…ఇప్పుడు టాగూర్‌ ‌రైతు దీక్ష
భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు, రైతులు పార్టీలో  నూతనొత్తేజం
 కాంగ్రెస్‌ ‌పార్టీకి చెందిన సంగారెడ్డి శాసనసభ్యుడు తూర్పు జయప్రకాష్‌రెడ్డి అలియాస్‌ ‌జగ్గారెడ్డి కాంగ్రెస్‌ ‌పార్టీగా ఆక్సిజన్‌గా మారాడు. పార్టీ తరపున నిర్వహించే భారీ బహిరంగ సభలకు, కార్యక్రమాలకు జగ్గా(సంగా)రెడ్డి కేరాఫ్‌ అయ్యాడు. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు ప్రజల్లోకి వెళ్లేందుకు ఓ భారీ బహిరంగ సభ నిర్వహించాలంటే పార్టీ అగ్రనేతలందరికీ ఠక్కున గుర్తుకు వచ్చే పే(ఊ)రు జగ్గా(సంగా)రెడ్డి. గత మూడేండ్ల కిందట (జూన్‌, 1, 2017)‌కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో నిర్వహించిన కాంగ్రెస్‌ ‌ప్రజాగర్జనకు అనూహ్యమైన స్పందన లభించింది. ముఖ్యంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిఆర్‌ఎస్‌ ‌పార్టీ అనుసరిస్తున్న ప్రజా,రైతు, నిరుద్యోగ వ్యతిరేక విధానలను ఎండగట్టేందుకు కాంగ్రెస్‌ ‌పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీతో నిర్వహించిన జగ్గారెడ్డి అన్నీ తానై నిర్వహించి  సంగారెడ్డి సభలో కాంగ్రెస్‌ ‌నేతలు గర్జించారు. రాహుల్‌గాంధీకి బేగంపేట ఏయిర్‌పోర్టు నుంచి సంగారెడ్డి దారిపోడవునా ప్రజలు, కార్యకర్తలు అడుగడుగునా ఘన స్వాగతం పలికారు. బేగంపేట నుంచి సంగారెడ్డికి 50కిలో మీటర్లు చేరుకోవడానికి రాహుల్‌కు సుమారుగా మూడు గంటల సమయం పట్టింది. మార్గమధ్యలో సోమాజిగూడలో రాజీవ్‌గాంధీ, అంబేడ్కర్‌ ‌విగ్రహాలకు పూలమాలలు వేస్తూ నివాళులర్పించారు. అంతేకాకుండా సోమాజిగూడ, ఎర్రగడ్డ, కూకట్‌పల్లి, మియాపూర్‌, ‌పటాన్‌చెరు, బిహెచ్‌ఈఎల్‌ ‌వద్ద భారీగా తరలివచ్చిన ప్రజలు, కార్యకర్తలు, నేతలు రాహుల్‌కు ఘనస్వాగతం పలికారు. రాహుల్‌ ‌కూడా ప్రజలతో అంతేస్థాయిలో మమేకమయ్యారు. స్వాగతం పలికన చోటల్లా రాహుల్‌ ‌ప్రజల్ని, కార్యకర్తలకు కరాచలనం చేస్తూ…పలకరిస్తూ ముందుకు సాగారు. రాష్ట్ర ఆవిర్భావానికి ముందుగా ఒక రోజు సంగారెడ్డికి వచ్చిన రాహుల్‌కు ఘనస్వాగతం పలకడమే కాకుండా…సంగారెడ్డి సభకు ఇసుకేస్తే రాలనంతగా జనం తరలిరావడంతో…కాంగ్రెస్‌ ‌పార్టీ శ్రేణుల్లో నూతనొత్తేజం నెలకొంది. బేగంపేట నుంచి సంగారెడ్డి వరకు సాగిన ర్యాలీలో మధ్య మధ్యలో ఆగిన రాహుల్‌ ‌ప్రజల్ని, కార్యకర్తల్ని పలుకరించి వారిలో ఉత్సాహాన్ని నింపారు. రైతులు, నిరుద్యోగులు, నిర్వాసితులతో ప్రత్యేకంగా సమావేశమైన రాహుల్‌ ‌వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సంగారెడ్డిలో  రాహుల్‌గాంధీతో ప్రజాగర్జనను ఏర్పాటు చేయడానికి  కారణం…1980వ దశకంలో కాంగ్రెస్‌ ‌పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు భారత మాజీ ప్రధానమంత్రి, దివంగత ఇందిరాగాంధీతో భారీ సభను ఏర్పాటు చేశారు. ఆ సభ తర్వాతనే కాంగ్రెస్‌ ‌పార్టీ దేశవ్యాప్తంగా విజయదుదుంబిని మోగించింది. అదే, సెంటిమెంటుతో ఇప్పుడు మూడేండ్ల కిందట రాహుల్‌తో సంగారెడ్డి  జగ్గారెడ్డితో రాష్ట్ర కాంగ్రెస్‌ ‌పార్టీ నేతలు భారీ బహిరంగ సభను పెట్టించారు. ఈ సభ  సక్సెస్‌ అయింది.

రాహుల్‌ ‌గాంధీ సభ మాదిరిగానే…తాజాగా…కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పాల్పడుతున్న రైతు వ్యతిరేక విధానాలు ముఖ్యంగా పార్లమెంటులో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులను నిరసిస్తూ కాంగ్రెస్‌ ‌పార్టీ నాయకత్వం మరోసారి ప్రజల్లోకి వెళ్లేందుకు నిశ్చయించుకుని…గాంధీ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా దీక్షలు, రైతుల చేత సంతకాలు సేకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా జిల్లా కేంద్రమైన సంగారెడ్డి జగ్గారెడ్డి ఆధ్వర్యంలో గాంధీ జయంతిని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లును తక్షణమే రద్దు చేయాలంటూ..మహాత్మ గాంధీ సాక్షిగా కాంగ్రెస్‌ ‌పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షకు రాష్ట్ర కాంగ్రెస్‌ ‌పార్టీ వ్యవహారాల ఇంఛార్జిగా ఇటీవలనే బాధ్యతలను చేపట్టిన మణికం టాగూర్‌, ‌మరో పరిశీలకుడు బోసురాజు తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమం కూడా ఊహించని విధంగా సక్సెస్‌ అయింది. కాంగ్రెస్‌ ‌పార్టీ చేపట్టిన దీక్షకు వేలాది మందిగా పార్టీ శ్రేణులు, రైతులు హాజరయ్యారు. రైతులు, పార్టీ శ్రేణులు ఊహించినదానికంటే ఎక్కువగా రావడంతో పార్టీ శ్రేణుల్లో పట్టరాని సంతోషం వ్యక్తమవుతుండగా….టాగూర్‌ ‌దీక్షకు అన్నీ తానై శ్రమించిన జగ్గారెడ్డి కృషి ఫలించిందని కాంగ్రెస్‌ ‌శ్రేణులంటున్నారు. కోట్ల రూపాయల్లో అప్పులు ఉన్నట్లు పదే పదే చెప్పుకునే జగ్గారెడ్డి…కాంగ్రెస్‌ ‌పార్టీకి కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ భారీ బహిరంగ సభలను నిర్వహిస్తున్న తీరు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే, ఈ సభకు హాజరైన కాంగ్రెస్‌ ‌పార్టీ నేతలందరూ మూకుమ్మడిగా రాష్ట్రంలోని అధికార టిఆర్‌ఎస్‌ ‌పార్టీ ప్రభుత్వ పాలనపై ముఖ్యంగా కేసీఆర్‌ ‌కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని మాటల తూటాల్ని పేల్చారు. మొత్తానికి సంగారెడ్డిలో కాంగ్రెస్‌ ‌పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు దీక్షపై  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై గర్జించింది. సభ సక్సెస్‌ ‌కావడంతో కాంగ్రెస్‌ ‌శ్రేణుల్లో నూతనొత్తేజం వ్యక్తమవుతుంది. భవిష్యత్‌ అం‌తా తమదేనని ధీమాను వ్యక్తం చేశాయి. మొత్తంగా కాంగ్రెస్‌ ‌పార్టీ కష్టాల్లో, క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడల్లా సంగారెడ్డిలో సభలు, దీక్షలు నిర్వహించడం సక్సెస్‌ ‌కావడంతో…కాంగ్రెస్‌ ‌పార్టీకి జగ్గా(సంగా)రెడ్డి కలిసొస్తుందనీ కాంగ్రెస్‌ ‌శ్రేణులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply