Take a fresh look at your lifestyle.

విద్యావ్యవస్థలో ‘జగనన్న విద్యాదీవెన’ పథకం నవశకం

ఆం‌ధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై ఎస్‌ ‌జగన్‌ ‌మోహన్‌ ‌రెడ్డి జగనన్న విద్యాదీవేన పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇందులో ఫీజు రీయింబర్సుమెంట్‌ ‌ను నేరుగా విద్యార్థుల తల్లి ఖాతాకు పంపనుండడంతో విద్యార్థుల తల్లిదండ్రులు కళాశాలకు వెళ్లి అక్కడి సౌకర్యాలను ప్రత్యక్షంగా పరిశీలించే ఆస్కారం ఉండడంతో జవాబుదారీతనం ఉండబోతుంది. పేద విద్యార్థుల్ని కూడా పెద్ద చదువులు చదివించాలన్న సమున్నత లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌మోహన్‌రెడ్డి రూపకల్పన చేసిన ‘జగనన్న విద్యాదీవెన’ పథకం కింద వివిధ విద్యాసంస్థల్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ప్రతి విద్యా సంవత్సరంలో నాలుగు విడతలుగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

బీద కుటుంబంలో జన్మించిన విద్యార్థులు కేవలం పాఠశాల విద్యకే పరిమితమైన రోజులవి. చదివిద్దామంటే లక్షల్లో అప్పులు చేయాల్సిన పరిస్థితి తలిదండ్రులది. దీనితో పేద పిల్లల ఉన్నత ఆశలు మరియు ఆశయాలు మధ్యలోనే చిదిమివేయబడేవి. ఆ పరిస్థితిని రూపు మార్పేందుకు, ప్రతి విద్యార్ధి ఉన్నత చదువులకు నోచుకోవాలనే ఉద్దేశ్యంతో అప్పటి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌ ‌రాష్ట్ర ముఖ్యమంత్రి దివంగత వై ఎస్‌ ‌రాజశేఖర రెడ్డి ఫీజు రీయింబర్సుమెంట్‌ ‌పథకాన్ని ప్రవేశపెట్టారు. దీనితో ప్రతి బీద విద్యార్థి డిగ్రీ ,ఇంజనీరింగ్‌, ఎం‌బీఏ, ఫార్మసీ, మెడిసిన్‌ ‌చదువులవైపు అడుగులు వేయడం జరిగింది. అయితే, విద్యార్ధి తరపున ప్రభుత్వమే పూర్తి ఫీజు కట్టడం వల్ల లాభాపేక్ష ఉద్దేశ్యంతో విద్యాసంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి.

పథకం వచ్చిన తొలినాళ్ళలో అంతా సవ్యంగా ఉన్నప్పటికీ క్రమక్రమంగా ఫీజు రీయింబర్సుమెంట్‌ ‌స్కీం విద్యాసంస్థల యాజమాన్యాలకు వరంలా మారిందే తప్ప నాణ్యమైన విద్యను అందివ్వలేదనే చెప్పాలి. ఫీజు ఇస్తుంది ప్రభుత్వమే కదా అని అటు యాజమాన్యంలో ఇటు విద్యార్థులలో నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతుంది. ఉన్నత విద్యాసంస్థలలో చాలావరకు నాణ్యమైన మరియు అర్హులైన భోదన సిబ్బంది, లాబ్స్ ఇతర మౌళిక సదుపాయాలు లేవనే చెప్పాలి. ఇంకో వైపు విద్యార్థులు కళాశాలలకు హాజరు కాకపోవడం కేవలం పరీక్షలు రాయడంతో వారిలో విషయ పరిజ్ఞానం, సాఫ్ట్ ‌స్కిల్స్, ‌టెక్నికల్‌ ‌స్కిల్స్ ‌లోపించడంతో కార్పొరేట్‌ ‌స్థాయి ఉద్యోగాలు పొందలేకపోతున్నారు. ఫీజు ప్రభుత్వమే చెల్లిస్తుంది కదా అని తల్లిదండ్రులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. ఇలా వై.ఎస్‌.ఆర్‌ ‌తెచ్చిన పథకం ఒకరికి వరం మరొకరికి శాపంలా మారింది.

ఇప్పుడు జవాబు దారితనం ఉండేలా ఇప్పటి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై ఎస్‌ ‌జగన్‌ ‌మోహన్‌ ‌రెడ్డి జగనన్న విద్యాదీవేన పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇందులో ఫీజు రీయింబర్సుమెంట్‌ ‌ను నేరుగా విద్యార్థుల తల్లి ఖాతాకు పంపనుండడంతో విద్యార్థుల తల్లిదండ్రులు కళాశాలకు వెళ్లి అక్కడి సౌకర్యాలను ప్రత్యక్షంగా పరిశీలించే ఆస్కారం ఉండడంతో జవాబుదారీతనం ఉండబోతుంది. పేద విద్యార్థుల్ని కూడా పెద్ద చదువులు చదివించాలన్న సమున్నత లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌మోహన్‌రెడ్డి రూపకల్పన చేసిన ‘జగనన్న విద్యాదీవెన’ పథకం కింద వివిధ విద్యాసంస్థల్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ప్రతి విద్యా సంవత్సరంలో నాలుగు విడతలుగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా 2020 -21 విద్యా సంవత్సరంలో మొదటి విడత ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇప్పుడు, రెండో విడత జగనన్న విద్యాదీవెన ఈ ఏడాది జూలైలో, మూడో విడత ఈ ఏడాది డిసెంబర్‌లో, నాలుగో విడత నిధులను వచ్చే ఏడాది ఫిబ్రవరిలో చెల్లించనున్నారు.

ఇంకో వైపు జగనన్న వసతి దీవెన పథకంతో విద్యార్థుల వసతి, భోజన, రవాణా ఖర్చులకు గాను మరో రూ. 1,147.41 కోట్లు విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో నేరుగా జమచేయనుంది. తద్వారా దేశంలో ఎక్కడా లేని విధంగా ఏటా రెండు వాయిదాలలో ఐటీఐ విద్యార్ధులకు రూ. 10 వేలు, పాలిటెక్నిక్‌ ‌విద్యార్ధులకు రూ. 15 వేలు, డిగ్రీ ఆపై కోర్సులు అభ్యసించే వారికి రూ. 20 వేల చొప్పున వసతి, భోజన, రవాణా ఖర్చులను జగన్‌ ‌ప్రభుత్వం అందించనుంది. జగనన్న వసతి దీవెన పథకం కింద ప్రభుత్వం ఇప్పటికే రూ. 1,220.99 కోట్లు చెల్లించగా, మొదటివిడతగా రూ. 1,147.41 కోట్లు బుధవారం రోజు నేరుగా తల్లుల ఖాతాల్లో జమ చేయనుంది. దీంతో ఇప్పటివరకు జగనన్న వసతి దీవెన పథకం కింద రూ. 2,368.40 కోట్లు చెల్లించినట్లు అవుతుంది.

అయితే, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని తెచ్చిన ఈ పథకాలు సత్ఫలితాలు ఇవ్వాలంటే ప్రభుత్వం నిరంతరం విద్యాసంస్థల తనిఖీలు చేపట్టాలి, అవసరమైతే ఇందుకోసం ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటుచేయాలి. తలిదండ్రులు కూడా ఫీజు రీయింబర్సుమెంట్‌ ‌డబ్బును ఇతర అవసరాలకు వాడుకోకుండా కొన్ని నిబంధనలను పెట్టాలి. కొన్ని చోట్ల బ్యాంకులు తలిదండ్రుల పేరు మీద ఉన్న అప్పును రీయింబర్సుమెంట్‌ ‌తో సర్దుతున్నట్లు వార్తలు వస్తున్న తరుణంలో ప్రభుత్వం బ్యాంకులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలి. ఏది ఏమైనప్పటికి జగన్‌ ‌ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యాదీవెన పథకం విద్యావ్యవస్థలో నవశకంగా పరిగణించవచ్చు.

md khaza
డా।। ఎండి ఖ్వాజా మొయినొద్దీన్‌
‌ప్రొఫెసర్‌, అకౌంటింగ్‌ అం‌డ్‌ ‌ఫైనాన్స్, 9492791387

Leave a Reply