Take a fresh look at your lifestyle.

జగనన్న కాలనీ నిర్మాణ పనులు ఆగకూడదు

  • మధ్యాహ్నం లోపల పనులు యధావిధిగా సాగాలి
  • ఇళ్ల నిర్మాణం ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇస్తుంది
  • ఇల్ల నిర్మాణంపై అధికారులతో సక్షలో సిఎం జగన్‌ ఆదేశాలు

కర్ఫ్యూ సమయంలోనూ జగనన్న కాలనీ పనులేవీ ఆగకూడదని సీఎం జగన్‌ ఆదేశించారు. నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు’పై సీఎం జగన్‌ ‌సక్షించారు. జగనన్న కాలనీలలో వసతుల కల్పన, టిడ్కో ఇళ్ల నిర్మాణంపై ఈ సక్షలో జగన్‌ ‌చర్చించారు. జగనన్న కాలనీల్లో జూన్‌ 1‌న పనులు ప్రారంభించాలని అధికారులకు జగన్‌ ‌సూచించారు. ఈ నెల 25 నాటికి అన్ని ఏర్పాట్లు పూర్తి కావాలన్నారు. మధ్యాహ్నం 12 గంటల వరకు యథావిథిగా కార్యకలాపాలు కొనసాగాలన్నారు. నీటి సదుపాయాలు, విద్యుత్‌ ‌సరఫరా వ్యవస్థ ఉండాలని, ఇళ్ల నిర్మాణ పనుల్లో ఎక్కడా జాప్యం ఉండకూడదని అధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు.  సక్షలో అధికారులకు సీఎం జగన్‌ ‌పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. కోవిడ్‌ ‌సమయంలో ఇళ్ల నిర్మాణం ఆర్థిక వ్యవస్థకు వృద్ధి అని జగన్‌ ‌తెలిపారు. కార్మికులకు పని దొరుకుతుంది. స్టీల్‌, ‌సిమెంట్‌, ఇతర మెటేరియల్‌ ‌కొనుగోలుతో వ్యాపార లావాదేవీలు జరుగుతాయన్నారు. ఇకపోతే ఇళ్ల నిర్మాణంలో లెవెలింగ్‌ అన్నది చాలా ముఖ్యం. భవిష్యత్తులో అంతా భూగర్భ కేబుల్‌ ‌వ్యవస్థనే. నీటి పైప్‌లు, విద్యుత్‌, ఇం‌టర్నెట్‌ ‌కేబుళ్లన్నీ భూగర్భంలోనే. డీపీఆర్‌ ‌సిద్ధం చేయండి. పనులన్నీ ఒకే ఏజెన్సీకి ఇవ్వండని అధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు. జూన్‌ 1 ‌నుంచి జగనన్న కాలనీల్లో పనులు ప్రారంభించాలని, ఇళ్ల నిర్మాణ పనుల్లో ఎక్కడా జాప్యం చేయకూడదని ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.

ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు యథావిథిగా కార్యకలాపాలు. ఇళ్ల నిర్మాణానికి నీరు, విద్యుత్‌ అవసరం కాబట్టి, వెంటనే ఆ వ్యవస్థలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ప్రతి లేఅవుట్‌లో తప్పనిసరిగా ఒక మోడల్‌ ‌హౌజ్‌ ‌నిర్మించాలన్నారు. నిజానికి స్టీల్‌ ‌ఫ్యాక్టరీలు తమ ఉత్పత్తిలో భాగంగానే, ఆక్సీజన్‌ను కూడా ఉత్పత్తి చేస్తున్నారు. కాబట్టి ఉత్పత్తి ఆగదు. మనకు 7.50 లక్షల టన్నుల స్టీల్‌ ‌కావాలి. కాబట్టి స్టీల్‌ ‌కంపెనీలతో ప్రత్యేకంగా మాట్లాడండి. ఎవరైనా సొంతంగా ఇల్లు నిర్మించుకుంటామంటే అస్సలు కాదనవద్దు. వారికి కావాల్సిన మెటీరియల్‌ ‌తప్పనిసరిగా అందించాలన్నారు. కోవిడ్‌ ‌సమయంలో ఈ ఇళ్ల నిర్మాణం ఆర్థిక వృద్ధికి దోహదం చేయనుందన్నారు.


ఉన్నత స్థాయిలో ఇళ్ల నిర్మాణం చేపడుతున్నాం కాబట్టి, కేంద్రం నుంచి అదనంగా నిధులు కోరుదాం. టిడ్కో ఇళ్ల నిర్మాణంలో కేంద్రం ఎలాగూ వాటా ఇస్తోంది. ప్రభుత్వం ఇంత పెద్ద స్థాయిలో ఇళ్లు నిర్మిస్తుంది కాబట్టి, అదనపు నిధుల కోసం కేంద్రానికి విజ్ఞప్తి చేద్దాం. ఇంకా, టిడ్కో ఇళ్లపై పెయింటింగ్స్ ‌తప్పనిసరిగా వేయాలి. వాటిని అన్ని వసతులతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలన్నారు. 

Leave a Reply