Take a fresh look at your lifestyle.

మాది మహిళా పక్షపాత ప్రభుత్వం

  • అక్కా,చెల్లెమ్మలు బాగుంటేనే కుటుంబం బాగుంటుంది
  • వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం నిధులను విడుదల చేసిన ఏపి సిఎం జగన్‌
  • ‌చంద్రబాబు ఏం మంచి పనులు చేశారో చెప్పాలని సవాల్‌

ఒం‌గోలు, ఏప్రిల్‌ 12 :  ‌తమది  మహిళా పక్షపాత ప్రభుత్వమని సిఎం జగన్‌ ‌స్పష్టం చేశారు. రెండేళ్ల కాలంలో పేద అక్కా, చెల్లెమ్మలకు వారి ఖాతాల్లోకి నగదు జమ చేశామన్నారు. దేశంలో ఎక్కడా, ఏ ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలు చేయటం లేదని సీఎం చెప్పారు. రాష్ట్రంలో అక్కా, చెల్లమ్మలు బాగుంటేనే కుటుంబాలు బాగుంటాయని ముఖ్యమంత్రి జగన్‌ ‌మోహన్‌ ‌రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా పర్యటలో భాగంగా మార్కాపురంలో వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం నిధులను సీఎం విడుదల చేశారు. అనంతరం జగన్‌ ‌మాట్లాడుతూ… ఈబీసీ నేస్తం అక్క, చెల్లెళ్ళకు లబ్ది చేకూర్చే కార్యక్రమమని అన్నారు. 4,39,068 మంది అక్క, చెల్లెళ్ళకు రూ.658.60 కోట్ల సాయం అందజేస్తున్నట్లు తెలిపారు. పుట్టిన బిడ్డ మొదలు వృద్ధురాలి వరకు ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ది చేకూరుతోందన్నారు. ప్రతీ మహిళను వారి కాళ్లపై వారిని నిలబెట్టేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. అమ్మఒడి దగ్గర నుంచి మొదలు పెడితే ప్రజలకు అనేక పథకాలు తీసుకువచ్చామన్నారు.
పేదరికానికి చికిత్స చేయాలని తాపత్రయంతోనే పనిచేస్తున్నామని అన్నారు. బటన్‌ ‌నొక్కి నేరుగా లబ్దిదారుల ఖాతాల్లోకే నగదు జమచేస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు 46 నెలల కాలంలో రూ.2.07 లక్షల కోట్ల నగదు లబ్దిదారుల ఖాతాల్లోకి జమ చేశామన్నారు.

బ్యాంకులకు నగదు కట్టలేక ఇబ్బందులు పడుతున్న మహిళలకు ఆసరా పథకం ద్వారా లబ్ది చేకూరుతుందని అన్నారు. వైఎస్సార్‌ ‌జగనన్న కాలనీల ద్వారా 30 లక్షల మందికి ఇల్లు నిర్మించామని, ప్రతీ మహిళ మొబైల్‌లోకి దిశ యాప్‌ ‌డౌన్‌లోడ్‌ ‌చేయించామన్నారు. ఏపీని ఆదర్శంగా తీసుకుని అనేక రాష్టాల్లో్ర పథకాలు ప్రవేశపెట్టారన్నారు. మహిళలు ఆర్దికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదగాలని ముఖ్యమంత్రి జగన్‌ ‌మోహన్‌ ‌రెడ్డి ఆకాంక్షించారు.  అలాగే వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. పేదరికానికి కులం, మతం ఉండదని.. పేదరికంలో ఉన్న ప్రతి ఒక్కరికీ తోడుగా ఉండాలన్నదే ఉద్దేశమన్నారు సీఎం వైఎస్‌ ‌జగన్‌. 45 -60 ఏళ్ల మధ్యనున్న అత్యంత బాధ్యతాయుతమైన మహిళలకు ఈ పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. ఓసీ కులాల్లోని పేద అక్క చె•-లలెమ్మలకోసం ఈబీసీ నేస్తం అమలు చేస్తున్నామని.. వీరంతా వారి కాళ్లద వాళ్లు నిలబడాలని తపన పడుతున్నామన్నారు. దేశంలో ఎక్కడా ఇలాంటి పథకం లేదని.. ఒక అన్నగా, తమ్ముడిగా చేస్తున్న మంచి పథకమన్నారు. అమ్మ ఒడి దగ్గర నుంచి 30 లక్షల ఇళ్లపట్టాల వరకూ చాలా కార్యక్రమాలు అమలు చేస్తున్నామని.. ఈ ప్రభుత్వం మహిళా పక్షపాత ప్రభుత్వమన్నారు. కేవలం 46 నెలల కాలంలోనే ఇప్పటికే రూ. 2.07లక్షల కోట్లు డీబీటీ ద్వారా ఇచ్చామన్నారు.

గత నాలుగేళ్ల ప్రభుత్వంలో ఎక్కడైనా కూడా లంచాలు లేకుండా, వివక్ష లేకుండా డీబీటీ ద్వారా పథకాలు అందాయా? లేదా అన్నారు. గత ప్రభుత్వంలో 2014-19 మధ్య అప్పట్లో కూడా ఒక ముఖ్యమంత్రి ఉండేవారని.. ఆ కాలంలో ఈ పథకాలు ఉండేవా అని ప్రశ్నించారు. ఆరోజు ఉన్నది దోచుకో? పంచుకో? తినుకో పద్ధతి అంటూ ధ్వజమెత్తారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంతమందికి బ్యాంకుల అకౌంట్లు ఉంటే.. ఎంతమందికి డీబీటీ ద్వారా ఖాతాల్లో వేశాడో గుర్తుకు తెచ్చుకోవాలన్నారు. చంద్రబాబు కట్టకుండా వదిలేసిన టిడ్కో ఇళ్ల దగ్గరకు వెళ్లి.. ఫొటోలు దిగుతారని.. సెల్ఫీ ఛాలెంజ్‌ అం‌టే నాలుగు ఫొటోలు కాదు అంటూ మండిపడ్డారు. ఈ రాష్ట్రంలో ఏ కుటుంబం,ఏ గ్రామం, ఏ జిల్లా తీసుకున్నా గత ప్రభుత్వంలో ఇంటింటికీ జరిగిన మంచి ఎంత.. ఈ ప్రభుత్వం హయాంలో జరిగిన మంచి ఎంత బేరీజు వేసుకోగల సత్తా చంద్రబాబుకు ఉందా అని ఛాలెంజ్‌ ‌విసిరారు. ఈ నిజాలు దాస్తున్నారు..

నిందలు, అబద్దాలతో ప్రచారాలకు దిగుతున్నారన్నారు. ఒకే అబద్దాన్ని పదేపదే ప్రచారం చేసి.. నిజాన్ని నమ్మించే ప్రయత్నంచేస్తున్నారన్నారు. ఈ అబద్దాల బ్యాచ్‌ను ఎక్కడికక్కడ ప్రశ్నించాలని.. గత ఐదేళ్ల హయాంలో ఒక్క ఇళ్ల స్థలమైనా ఎందుకు ఇవ్వలేకపోయారని ప్రశ్నించారు. అలాంటి ఇళ్ల స్థలాల ముందు సెల్ఫీ దిగే నైతికత ఉందా అన్నారు. ఈ రాష్ట్రంలో ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ప్రతి పేద ఇంటి ముందు నిలబడి.. ఈ ఇంటికి తమ ప్రభుత్వం వల్ల జరిగిన మంచి ఇదీ అని చంద్రబాబు చెప్పగలరా అన్నారు. ప్రతి పేద ఇంటికి వెళ్లినప్పుడు బాగా చేశావయ్యా అని అక్క చె•-లల్మెమ్మలు ఆశీర్వదించగలిగితే అది గొప్ప సెల్ఫీ అన్నారు. ఏ మంచి చేశావని ఇంటిముందు స్టిక్కర్‌ ‌వేస్తావు చంద్రబాబు అని అందరూ ప్రశ్నించాలన్నారు.

Leave a Reply