Take a fresh look at your lifestyle.

కరోనా కట్టడిలో జగన్‌ ‌సర్కార్‌ ‌విఫలం

మచిలీపట్టణం పర్యటనలో చంద్రబాబు

అమరావతి,జూలై 14 :  జగన్‌ ‌ప్రభుత్వం కరోనా కట్టడిలో పూర్తిగా విఫలమయ్యిందని టిడిపి అధినేత చంద్రబాబు అన్నారు. టిడిపి ప్రభుత్వం అధికారంలో ఉండవుంటే ఇలా జరిగేది కాదన్నారు. అలాగే రైతులకు నీరందించాలన్న సంకల్పంతో పట్టిసీమ నిర్మించామని అన్నారు. జగన్‌ ‌మాత్రం ప్రాజెక్టులను నిర్‌క్ష్యం చేస్తోందన్నారు. అందుకు పోలవం పరిస్థితి నిదర్శనమని అన్నారు. పెడన నియోజకవర్గం బంటుమిల్లి మండలం నాగేశ్వరరావు పేటలో పెడన ఇంచార్జి కాగిత కృష్ణ ప్రసాద్‌ ‌కుటుంబ సభ్యులను మాజీ సీఎం చంద్రబాబు పరామర్శినీచారు. ఇటీవలే మాజీ ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు మరణించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

సముద్రంలోకి నీరు పోతుంటే జగన్‌రెడ్డి ఎక్కడ గాడిదలు కాస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌కు ఫోన్‌ ‌చేసి మాట్లాడే ధైర్యం కూడా లేదా? అని ప్రశ్నించారు. తెలంగాణకు కావాల్సిన విద్యుత్‌ ఇస్తానని నీటి వృధాని అరికట్టలేడా? అన్నారు. జల్సాలు, అవినీతి తప్ప ఈ ముఖ్యమంత్రి ఏం తెలుసన్నారు. విద్యుత్‌, ఇసుక, మద్యం ధరలు విపరీతనీగా పెంచేశారని పేర్కొన్నారు. ప్రజలు భవిష్యత్తులో ఓటేసేందుకు భయపడే పరిస్థితి తెస్తున్నారని  చెప్పారు. రెండేళ్లలో రాష్ట్ర విధ్వంసం తప్ప ఏం చేశారని ప్రశ్నించారు. టీడీపీ అధినేత చంద్రబాబ నాయుడు బుధవారం  మచిలీపట్నం చేరుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు పార్టీ నేతలు, కార్యకర్తలు స్వాగతం పలికారు. అనంతరం మచిలీపట్నంలో టీడీపీ కార్యకర్తలు బైక్‌ ‌ర్యాలీ నిర్వహించారు. మాజీ మంత్రి నడికుదిటి నరసింహారావు చిత్ర పటానికి చంద్రబాబు పూలమాల వేసి నివాళర్పించారు. నరసింహారావుతో పాటు ఇటీవల కరోనాతో చనిపోయిన పార్టీ నేతలకు అధినేత నివాళులు అర్పించారు.  కొల్లు రవీంద్ర మామ, మాజీ మంత్రి నడికుదిటి నరసింహారావు ఇటీవలే అనారోగ్యంతో మరణించారు. ఈ క్రమంలోనే కొల్లు రవీంద్రను, కుటుంబ సభ్యులను చంద్రబాబు పరామర్శించారు.

Leave a Reply