Take a fresh look at your lifestyle.

రైతు భరోసా కేంద్రం ప్రారంభించిన జగన్‌

‌రాయదుర్గం,జూలై 8 : అనంతపురం జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌ ‌మోహన్‌రెడ్డి పర్యటిస్తుంచారు. ఉడేగోళం గ్రామంలో రైతు భరోసా కేంద్రాన్ని సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతు భరోసా కేంద్రంలో సీఎం జగన్‌ ‌మొక్కను నాటారు. అనంతరం రాయదుర్గం మార్కెట్‌ ‌యార్డులో వైఎస్సార్‌ ఇం‌టిగ్రెటెడ్‌ అ‌గ్రి ల్యాబ్‌ ‌ప్రారంభించారు. లబ్దిదారులతో మాట్లాడిన అనంతరం విద్యార్థి పాఠశాలలో ఏర్పాటు చేసిన వేదిక వద్ద పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసారు.

రైతు భరోసా కేంద్రంలో స్టాల్స్‌ను సందర్శించారు. అనంతరం మొక్కను నాటారు. రైతు భరోసా కేంద్రం ప్రారంభించిన అనంతరం సీఎం జగన్‌.. ‌కాసేపు రైతులతో ముచ్చటించారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక తాము ఆనందంగా ఉన్నామని రైతులు అన్నారు. నేరుగా లబ్దిదారుల ఖాతాలో డబ్బులు జమ అవుతున్నాయని ఆనందం వ్యక్తం చేశారు. ఆర్బీకే కేంద్రాల ద్వారా రైతులకు ఎంతో మేలు అన్నారు. పాడి పరిశ్రమకు ప్రభుత్వం ఎంతో చేయూతనిస్తోందని రైతులు తెలిపారు.

Leave a Reply