Take a fresh look at your lifestyle.

గవర్నర్‌ను అవమానించిన తీరు బాధాకరం

  • పెద్దవాడన్న గౌరవం కూడా ఇవ్వకుండా వ్యవహరించారు
  • గవర్నర్‌ ‌ప్రసంగం సందర్భంగా అవహేళన చేశారు
  • చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయంలో ఏం సాధించారు
  • వెన్నుపోటు రాజకీయాలు తప్ప మరోటి లేదు
  • వైసిపి ఇచ్చిన హాల మేరకు నడుచుకుంటోంది
  • అసెంబ్లీలో గవర్నర్‌ ‌ప్రసంగానికి ధన్యవాద తీర్మానంలో జగన్‌

అమరావతి, మార్చి 10 : అసెంబ్లీలో గవర్నర్‌ను టీడీపీ ఎమ్మెల్యేలు అవమానించారని సీఎం జగన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగ వ్యవస్థలంటే చంద్రబాబుకు కడుపుమంటన్నారు. చంద్రబాబు తన ఎమ్మెల్యేలను పురమాయించి గవర్నర్‌పైకి పంపారని ఆరోపించారు. ఆయన కొడుకు దగ్గరుండి ఈ పనిచేయించారని మండిపడ్డారు. చంద్రబాబు ఏపీకి ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని డిమాండ్‌ ‌చేశారు. చంద్రబాబు పేరు చెబితే గుర్తువచ్చే ఒక్క స్కీం ఉందా అని ప్రశ్నించారు. కేవలం వెన్నుపోటు అనే స్కీం తప్ప మరే లేదన్నారు. ఈ చర్చ చేయలేకే గవర్నర్‌ ‌ప్రసంగ పత్రాన్ని చించేశారని చెప్పారు. గవర్నర్‌ ‌ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జగన్‌ ‌సమాధానం ఇచ్చారు. చట్టసభలకు వ్యతిరేకంగా తీర్పు వస్తే చంద్రబాబు సంతోషపడతారని అన్నారు. కోర్టులో కేసులు వేయించి సంక్షేమ పథకాలను అడ్డుకుంటు న్నారని మండిపడ్డారు.

అగ్రిగోల్డ్‌ను చంద్రబాబే దోచుకున్నారని ఆరోపించారు. కుల, మత, ప్రాంతాల మధ్య చంద్రబాబు చిచ్చుపెడుతున్నారన సీఎం వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు కమ్యూనిస్టులు తానా తందాన అంటారని అన్నారు. చంద్రబాబు సభకు ఎందుకు రావడం లేదో ఆయనకే తెలియట్లేదన్నారు. గవర్నర్‌ ‌వయసుకు గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిదీ. గవర్నర్‌ ‌పట్ల ఇటువంటి ప్రవర్తనతో గతంలో ఎప్పుడూ చూడలేదన్నారు. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నడూ ఇలా చేయలేదు. రాజ్యాంగ వ్యవస్థలంటే చంద్రబాబుకు కడుపు మంట. చంద్రబాబు దిగజారుడు రాజకీయాలకు ఇది నిదర్శనం అంటూ విమర్శలు గగుప్పించారు. ఏ ఎన్నికలు జరిగినా వైఎస్సార్‌సీపీకే ప్రజలు పట్టం కట్టారు.

87 మున్సిపాలిటీలకు గానూ 84 గెలిచాం. 12 కార్పొరేషన్లనూ వైఎస్సార్‌సీపీ గెలుచుకుంది. స్థానిక ఎన్నికల్లో 98.6 శాతం వైఎస్సార్‌సీపీనే గెలిచిందని సీఎం వైఎస్‌ ‌జగన్‌ అన్నారు. చివరకు కుప్పంలోనూ వైసిపి గెలిచిందన్నారు. ప్రజలు వైఎస్సార్‌సీపీ పార్టీపై అభిమానం చూపించారు. మేం చేస్తున్న మంచిని ప్రజలు ఆశీర్వదించారు. కోవిడ్‌ ‌కష్ట సమయంలోనూ సంక్షేమ పాలన ఆగలేదు. జగన్‌ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని ప్రజలు నమ్మారు. చంద్రబాబు గత పాలనకు ఛీకొడుతూ ప్రజలు తీర్పునిచ్చారు. గత ప్రభుత్వ పాలనను, మా పాలనను పోల్చి చూడాలని ప్రజలను కోరుతున్నా. కుల, మత, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. లంచం లేకుండా చంద్రబాబు ఏ పథకాన్నైనా ఇచ్చారా? అవినీతికి తావులేకుండా పారదర్శక పాలన అందిస్తున్నాం. ఎన్నికలకు 2 నెలల ముందు వరకూ చంద్రబాబు ఇచ్చిన పెన్షన్లు ఎన్ని?. చంద్రబాబు 42 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక నెలకు 62 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాం.

గత ప్రభుత్వం వెయ్యి ఇస్తే.. మేం రూ.2500 ఇచ్చాం. పదవుల గురించే తప్ప ఏరోజూ ప్రజల గురించి చంద్రబాబు ఆలోచించలేదని సీఎం జగన్‌ ‌దుయ్యబట్టారు. రైతుల కోసం రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశాం. పాలనలో అనేక సంస్కర ణలు తీసుకొచ్చాం. 34 నెలల కాలంలో గ్రామ సచివాలయ వ్యవస్థతో మార్పులు తెచ్చాం. కొత్త జిల్లాలతో పరిపాలన వికేంద్రీకరణకు శ్రీకారం చుట్టాం. కుప్పం రెవెన్యూ డివిజన్‌ ‌కావాలని అడుగుతున్నారు. ఎవరికి ఎంత విజన్‌ ఉం‌దో ప్రజలే ఆలోచించాలి. ప్రజల భవిషత్తు చంద్రబాబుకు అవసరం లేదు. చంద్రబాబు ప్రైవేట్‌ ‌స్కూళ్ల కోసం పనిచేశారు. ప్రభుత్వ బడులను కార్పొరేట్‌ ‌స్థాయికి తీసుకొస్తున్నాం. అన్ని వర్గాల విద్యార్థులు ఇంగ్లీష్‌ ‌డియం చదవాలన్నదే మా ఆకాంక్ష. చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయానుభవం ఎవరికి ఉపయోగం?. వెన్నుపోటు రాజకీయాన్ని మాత్రమే బాబు కొనసాగిస్తు న్నారని సీఎం జగన్‌ ‌నిప్పులు చెరిగారు. టీడీపీ సభ్యులపై సీఎం జగన్‌ ‌తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము మేనిఫెస్టోలో చెప్పిన వాటిలో ఇప్పటివరకు 96శాతం వాగ్దానాలను నెరవేర్చామని జగన్‌ ‌చెప్పారు. పరిపాలనలో సంస్కరణలు తీసుకొచ్చామని పేర్కొన్నారు. కుల, మత, పార్టీలు, వర్గాలు అని చూడకుండా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. ఎవరి హయంలో పాలన బాగుందో ప్రజలంతా ఆలోచించా లన్న ఆయన.. గ్రామాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోందని, జగన్‌ ‌తెలిపారు.

Leave a Reply