- కొరోనా నియంత్రణకు కేంద్రం,డబ్ల్యుహెచ్వో సూచనలు పాటిస్తున్నాం
- నిజాముద్దీన్ ఘటన రాష్ట్రాన్ని అతలాకుతలం చేసింది
- జనతా కర్ఫ్యూ, లాక్‌డౌన్‌తో కొరోనా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది
- ప్రాణాలు లెక్కచేయకుండా సేవలందిస్తున్న వైద్యులకు పాదాభివందనం
- పాజిటివ్ వస్తే గాంధీలో ఉండాల్సిందే
- వైద్య సిబ్బందికి మూలవేతనంలో 10 శాతొస్త్రం అదనం
- పారిశుధ్మ కార్మికులకు సీఎం ప్రత్యేక ప్రోత్సాహక బహుమతి
- రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా దెబ్బతింటోంది
- కొరోనా, లాక్‌డౌన్‌పై సమీక్ష అనంతరం మీడియాతో కేసీఆర్
దేశంలో, రాష్ఠ్రంలో కొరోనా వైరస్‌ను నియంత్రించడానికి ఏప్రిల్ 14 తరువాత కూడా లాక్‌డౌన్‌ను పొడిగించడం మినహా గత్యంతరం లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. జూన్ 3 వరకూ లాక్‌డౌన్‌ను కొనసాగించాల్సిందేననే విషయాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి కూడా స్పష్టం చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 364 కొరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయనీ, దిల్లీ నిజాముద్దీన్ ఘటన రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిందని వ్యాఖ్యానించారు. తమ ప్రానాలను సైతం పణంగా పెట్టి కొరోనా రోగులకు చికిత్సలు అందిస్తున్న వైద్యులు, నర్సులు, ఫార్మాసిస్టులు, ఇతర సిబ్బందికి పాదాభివందనం చేస్తున్నట్లు తెలిపారు. అలాగే, వైరస్ మరింతగా ప్రబలకుండా నిరంతరం శ్రమిస్తున్న జీహెచ్ఎంపి పారిశుధ్య సిబ్బందికి సీఎం ప్రత్యేక ప్రోత్సాహం కింద రూ. 7500, మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీ సిబ్బందికి రూ. 5000 నగదును అందజేయనున్నట్లు తెలిపారు. సోమవారం ప్రగతి భవన్లో రాష్ట్రంలో కొరోనా విస్తరణ, లాక్డౌన్ నేపథ్యంలో పరిస్థితులపై ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన 25,937 మందిని క్వారంటైన్ చేశామనీ, అందులో కేవలం 50 మందికి మందికి మాత్రమే పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని చెప్పారు. ప్రస్తుతం సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో 308 బాధితులు చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. మర్కజ్ నుంచి రాష్ట్రానికి వచ్చిన 1089 మందిని గుర్తించామనీ, అనుమానితుల్లో 172 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని తెలిపారు. ఆ 172 మంది మరో 93 మందికి అంటించారనీ, నిజాముద్దీన్ ఘటన రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిందని చెప్పారు. జనతా కర్ఫ్యూ, లాక్డౌన్ వంటి ముందు జాగ్రత్త చర్యల కారణంగానే దేశంలో, రాష్ట్రంలో కొరోనా కేసులను తక్కువ సంఖ్యకు పరిమితం చేయగలిగామని చెప్పారు. ఈ కారణంగా భారత్ వంటి వందల కోట్ల జనాభా కలిగిన అతి పెద్ద దేశంలో కొరోనా కేసులను కేవలం 4319 మందికి పరిమితం చేయగలిగామని చెప్పారు. కొరోనా కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారైందనీ, ఈ నెల 6 తేదీ వరకూ రాష్ట్ర ప్రభుత్వానికి రూ. 2400 కోట్ట ఆదాయం రావాల్సి ఉండగా, కేవలం రూ. 6 కోట్లు మాత్రమే వచ్చిందనీ, అయినప్పటికీ ప్రజల ప్రాణాలను కాపాదాల్న ఉద్దేశ్యంతో లాక్‌డౌన్‌ను పొడిగింపుకు మద్దతు ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. ప్రపంచలోని 22 దేశాలు పూర్తిగా లాక్డౌన్లు అమలు చేశాయని చెప్పారు. ఈ జబ్బు మన దేశంలో పుట్టింది కాదు, కాబట్టి బయటి నుంచే దీనినే నియంత్రించాలన్న ఉద్దేశ్యంతోనే జనతా కర్ఫ్యూ, లాక్డౌన్ వంటి కఠిన నిర్ణయీలు తీసుకున్నట్లు చెప్పారు. అమెరికాలో పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయనీ, న్యూయార్క్ వంటి నగరంలో శవాలు గుట్టలుగా పడి ఉన్నటువంటి దారుణమైన పరిస్థితిని చూస్తున్నామని చెప్పారు. దిల్లీ నిజాముద్దీన్ నుంచి రాష్ట్రానికి వచ్చిన 1089 మందిని గుర్తించామనీ, వీరందరికీ పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు.
లాక్డౌన్ వల్ల ఆర్థికంగా నష్టపోక తప్పదు అని అన్నారు. మన రాష్టాన్రికి రోజుకు రూ. 400 నుంచి రూ. 430 కోట్ల ఆదాయం రావాల్సి ఉండగా లాక్డౌన్ మూలంగా కేవలం రూ. 6 కోట్లు మాత్రమే వచ్చాయన్నారు. ప్రజలను బతికించుకోవాలంటే లాక్డౌన్ తప్ప వేరే మార్గం లేదు. ఒక వేళ లాక్డౌన్ సడలిస్తే పరిస్థితి ఏంటి? అని సీఎం ప్రశ్నించారు. మళ్లీ గుంపులు గుంపులుగా రోడ్ల దకి వస్తే ఎవరు జవాబుదారీ అని సీఎం అడిగారు. లాక్డౌన్ సడలించడమంటే అంత ఆషామాషీ కాదు. ప్రధానితో రోజుకు రెండుసార్లు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయన్నారు. లాక్‌డౌన్‌ను కొనసాగించాల్సిందేనని ప్రధానికి చెప్పానని అన్నారు. ఇది ప్రపంచానికి వచ్చిన పీడ. ఒక్క కుటుంబానికో, జాతికో రాలేదు. 22 దేశాలు పూర్తిగా 100 శాతం లాక్డౌన్ చేశాయి. జపాన్, సింగపూర్, యూకే, ఫ్రాన్స్, జర్మనీ, కొలంబియా, అ•-జ్గ•ంటీనా, నేపాల్‌తో పాటు మరిన్ని దేశాలు మన పద్ధతిలోనే లాక్డౌన్ చేశాయి. మరో 90 దేశాలు పాక్షికంగా లాక్డౌన్ చేశారు. మన రాష్ట్రం మంచి నిర్ణయం తీసుకుంది. తెలంగాణ సమాజాన్ని బతికించు కున్నామంటే లాక్డౌన్, స్వీయ నియంత్రణ వల్లే అయిందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఇవాళ న్యూయార్క్‌ను చూస్తే శవాల గుట్టలే కనిపిస్తున్నాయి. అలాంటి దుఖం ఎవరికి సంభవించకూడదు. మనమైతే ఆగమయ్యేవాళ్లం. లాక్డౌన్ వల్లనే పరిస్థితిని కంట్రోల్ చేశాం అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
ఈ జబ్బు మన దేశంలో పుట్టింది కాదని, వేరే దేశంలో పుట్టిన జబ్బు ట్రాన్స్మిట్ అయింది. ఈ వైరస్‌ను అరికట్టేందుకు అన్నింటిని లాక్డౌన్ చేశారు. లాక్డౌన్ వల్ల మన దేశం, రాష్ట్రం అద్భుతమైన గణనీయమైన విజయం సాధించింది. ఈ విషయంలో సందేహం అవసరం లేదు అని సీఎం స్పష్టం చేశారు దేశంలో ఇప్పటి వరకు కరోనా సోకిన వారి సంఖ్య 4,314 కాగా, మరణించిన వారి సంఖ్య 122 అన్నారు. చాలా సేఫ్‌గా దేశం ముందుకెళ్తుంది. ఇది తాను చెప్పడం లేదు. ఇండియా మంచి పని చేసింది అని ఇంటర్నేషల్ జర్నల్స్ ప్రకటించాయి. ఐక్యతను ప్రదర్శించి ఇండియా మంచి పని చేసిందని ఇతర దేశాల అధినేతలు ప్రశంసించారు. లాక్డౌన్ విధించకపోతే భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొనే వాళ్లం. ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న దేశం మనదని చెప్పారు. ఈ సందర్భంగా వైరస్ విస్తరించకుండా నిరంతర శ్రమిస్తున్న పారిశుద్య కార్మికులకు సీఎం బొనాంజా ప్రకటించారు.కరోనా నియంత్రణ చర్యల్లో విశ్రాంతి లేకుండా పని చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు సీఎం కేసీఆర్ శుభవార్త వినిపించారు. ప్రగతి భవన్లో కరోనా ప్రభావం, . రాష్ట్ర వ్యాప్తంగా పారిశుద్ధ్య కార్మికులు 95,392 మంది వరకు ఉంటారు. పారిశుద్ధ్య కార్మికుల జీతంలో విధించిన కోతను ఉపసంహరించు కుంటున్నామని సీఎం తెలిపారు. సీఎం ప్రోత్సాహం కింద మున్సిపల్ మున్సిపల్, గ్రామపంచాయతీ పారిశుద్ద్య కార్మికులకు రూ. 5 వేలు ఇస్తాం. జీహెచ్ఎంసీ, హెచ్ఎండబ్ల్యూఎస్ కార్యకర్తలకు రూ. 7,500 ఇస్తాం. డాక్టర్లు, వైద్య సిబ్బందికి పదిశాతం జీతాలు పెంచి ఇస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. పారిశుద్ధ్య పనులు బాగా కొనసాగిస్తే జబ్బు వ్యాప్తిని నియంత్రించొచ్చు అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో మొదటి దశలో మొత్తం 50 మందికి కరోనా సోకితే ఇందులో 30 మంది విదేశాల నుంచి వచ్చిన వారు. మిగతా 20 మంది వారి కుటుంబ సభ్యులేనని సీఎం పేర్కొన్నారు. శరీరంలో వైరస్ అతి తక్కువ సోకిన వారు మాత్రం జీవిస్తున్నారనీ, ఎక్కువగా సోకిన వారు మరణిస్తున్నారనీ, అందువల్ల స్వీయ నియంత్రణ పాటించడమే మంచిదని ఈ సందర్భంగా కేసీఆర్ ప్రజలకు సూచించారు.