“నిన్న మొన్న చైనా గాల్వన్ దగ్గర చొరబడింది. అంతకు ముందెప్పుడో చైనా జార్ఖండ్ లో ఓ చిన్న ప్రాంతం గొడ్డాలో చొరబడింది.. ఇది భారత్ అంతర్భాగ ప్రాంతం. మరి ఇక్కడ చైనా చొరబడింది అని మనకి సోయి వుండిందా. ఇలా చైనా గొడ్డాలో చొరబడటానికి చైనాకి సహాయం చేసిన ద్రోహి అంటారో.. సైనికుడు అంటురో.. మీ ఇష్టం. ఇతను మరెవరో కాదు. ఆదానీ గ్రూప్ చైర్మన్, గౌతమ్ ఆదానీ. 23 ఏప్రిల్ 2018 సంవత్సరంలో ఆదానీ గ్రూప్ కి, చైనా కంపెనీ.. పవర్ కంస్ట్రక్షన్ కార్పొరేషన్ అఫ్ చైనాకి మధ్య ఓ ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం చైనా కంపెనీతో కలసి ఆదానీ గ్రూప్, గొడ్డాలో విద్యుత్ ఉత్పత్తి చేసి, బంగ్లా దేశ్ కి అమ్ముకుంటారు.”

మన దేశ ప్రధాని నోట వెలువడిన మాట చైనా భాషల్లో అనువాదం అయిపోయి.. చైనాలో మారుమోగుతున్నది. ఏమా మాట ..? “మన భూభాగంలో చైనా చొరబడలేదు”.. ఈ మాట మన గుండెల్లో శూలమై దిగబడింది. కొందరికి శ్రవాణానందం కలిగించింది.. చైనా చెవిలో తేనే పోసిన మాటగా మరీ చెలామణి అవుతున్నది.. ఈ పరిణామాలతో మనకి ఓ విషయం స్పష్టం అయ్యింది. ఈ నెల 15 న చైనా మన కల్నల్ సంతోష్ బాబు అతని టీం 19 మంది సిపాయిల గుండెల మీద నడుచుకుంటూ గాల్వన్ నది ఒడ్డు సరిహద్దు సొంతం చేసుకుంది. ఇప్పుడు మన గుండెల మీద కుంపటి చైనా అన్నట్టు మనం ఫీల్ అయిపోతున్నాం. మరేమో మన ప్రధాని మోడీ అర్ధం చేసుకుని సర్దుకుపోవాలని అంటున్నారు. అందుకే అయన “మన భూభాగంలో చైనా చొరబడలేదు”.. అని మన గుండెకి బర్నాల్ రాస్తున్నారు. 56 ఇంచిలా ఛాతి కలిగిన మా మోడీ.. ఇంటిలోకి చొరబడి చంపేసే (పాకిస్తాన్ సర్జికల్ స్ట్రైక్ అప్పుడు మోడీ స్వయంగా చెప్పారు.. ‘ఘర్ మే గుస్కర్ మారెంగే…’) మా మోడీ, మండుతున్న మా గుండెల కోసం ప్రతీకారం ఎందుకు తీర్చుకోటం లేదు..? అని మనం లబోదిబోమంటే ఎలా..? పాపం అనుకుని మనం మోడీని అర్ధం చేసుకోవాలి 56 ఇంచిలా గుండె మోడీకి వుంది. ఆ గుండెలో గౌతమ్ ఆదానీ కోసం అలాగే ఇతర కంపెనీల కోసం ప్రేమ వుంది. ఆ ప్రేమ కోసం ఎంతైనా చేయాలి..మనందరికీ తెలిసిందే గౌతమ్ ఆదానీ అనే ప్రేయసి గుజరాత్ ముఖ్య మంత్రి అయిన మోడీ దేశ్ కి పీఎం కావటానికి యెంత తోడ్పాటు అందించింది. పెళ్లి పెటాకులు చేసుకుంటే జశోదాబెన్ రామాయణ సీతలాగా భూమి అడుగుపొరల్లో నిక్షిప్తం అయిపోయింది. ప్రేయసి విషయంలో ఇది కుదరదుగా.. అందుకే మనం మన పీఎం మోడీ సర్ ని అర్ధం చేసుకోవాలి. సరిహద్దులో చైనా జొరబడింది అని బేజారు అయిపోతున్న మనం గమనించాల్సింది ఏమంటే కంటి ముందు కాకరకాయ పొతే ఏడుస్తున్నామని..మరెక్కడి నుంచో గుమ్మడికాయ పోతున్నా మనకి సోయలేదు అని గమనిస్తే మన బేజారు మనసుకి శాంతి దొరుకుతుంది.