Take a fresh look at your lifestyle.

ఇది కూడా దేశభక్తే ..!

“నిన్న మొన్న చైనా గాల్వన్‌ ‌దగ్గర చొరబడింది. అంతకు ముందెప్పుడో  చైనా జార్ఖండ్‌ ‌లో ఓ చిన్న ప్రాంతం గొడ్డాలో చొరబడింది.. ఇది భారత్‌ అం‌తర్భాగ ప్రాంతం. మరి ఇక్కడ చైనా చొరబడింది అని మనకి సోయి వుండిందా. ఇలా చైనా గొడ్డాలో  చొరబడటానికి చైనాకి సహాయం చేసిన ద్రోహి అంటారో.. సైనికుడు అంటురో.. మీ ఇష్టం. ఇతను మరెవరో కాదు. ఆదానీ గ్రూప్‌ ‌చైర్మన్‌, ‌గౌతమ్‌ ఆదానీ. 23 ఏప్రిల్‌ 2018  ‌సంవత్సరంలో ఆదానీ గ్రూప్‌కి, చైనా కంపెనీ.. పవర్‌ ‌కంస్ట్రక్షన్‌ ‌కార్పొరేషన్‌ అఫ్‌ ‌చైనాకి మధ్య ఓ ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం చైనా కంపెనీతో కలసి ఆదానీ గ్రూప్‌, ‌గొడ్డాలో విద్యుత్‌ ఉత్పత్తి చేసి, బంగ్లాదేశ్‌కి అమ్ముకుంటారు.

aruna
అరుణ ,జర్నలిస్టు ,న్యూ దిల్లీ

మన దేశ ప్రధాని నోట వెలువడిన మాట చైనా భాషల్లో అనువాదం అయిపోయి.. చైనాలో మారుమోగుతున్నది. ఏమా మాట ..? ‘‘మన భూభాగంలో చైనా చొరబడలేదు’’.. ఈ మాట మన గుండెల్లో శూలమై దిగబడింది. కొందరికి శ్రవాణానందం కలిగించింది.. చైనా చెవిలో తేనే పోసిన మాటగా మరీ చెలామణి అవుతున్నది.. ఈ పరిణామాలతో మనకి ఓ విషయం స్పష్టం అయ్యింది. ఈ నెల 15 న చైనా మన కల్నల్‌ ‌సంతోష్‌ ‌బాబు అతని టీం 19 మంది సిపాయిల గుండెల మీద నడుచుకుంటూ గాల్వన్‌ ‌నది ఒడ్డు సరిహద్దు సొంతం చేసుకుంది. ఇప్పుడు మన గుండెల మీద కుంపటి చైనా అన్నట్టు మనం ఫీల్‌ అయిపోతున్నాం. మరేమో మన ప్రధాని మోడీ అర్ధం చేసుకుని సర్దుకుపోవాలని అంటున్నారు. అందుకే అయన ‘‘మన భూభాగంలో చైనా చొరబడలేదు’’.. అని మన గుండెకి బర్నాల్‌ ‌రాస్తున్నారు. 56 ఇంచిలా ఛాతి కలిగిన మా మోడీ.. ఇంటిలోకి చొరబడి చంపేసే (పాకిస్తాన్‌ ‌సర్జికల్‌ ‌స్ట్రైక్‌ అప్పుడు మోడీ స్వయంగా చెప్పారు.. ‘ఘర్‌ ‌మే గుస్కర్‌ ‌మారెంగే…’) మా మోడీ, మండుతున్న మా గుండెల కోసం ప్రతీకారం ఎందుకు తీర్చుకోటం లేదు..? అని మనం లబోదిబోమంటే ఎలా..? పాపం అనుకుని మనం మోడీని అర్ధం చేసుకోవాలి 56 ఇంచిలా గుండె మోడీకి వుంది. ఆ గుండెలో గౌతమ్‌ ఆదానీ కోసం అలాగే ఇతర కంపెనీల కోసం ప్రేమ వుంది. ఆ ప్రేమ కోసం ఎంతైనా చేయాలి..మనందరికీ తెలిసిందే గౌతమ్‌ ఆదానీ అనే ప్రేయసి గుజరాత్‌ ‌ముఖ్య మంత్రి అయిన మోడీ దేశ్‌ ‌కి పీఎం కావటానికి యెంత తోడ్పాటు అందించింది. పెళ్లి పెటాకులు చేసుకుంటే జశోదాబెన్‌ ‌రామాయణ సీతలాగా భూమి అడుగుపొరల్లో నిక్షిప్తం అయిపోయింది. ప్రేయసి విషయంలో ఇది కుదరదుగా.. అందుకే మనం మన పీఎం మోడీ సర్‌ ‌ని అర్ధం చేసుకోవాలి. సరిహద్దులో చైనా జొరబడింది అని బేజారు అయిపోతున్న మనం గమనించాల్సింది ఏమంటే కంటి ముందు కాకరకాయ పొతే ఏడుస్తున్నామని..మరెక్కడి నుంచో గుమ్మడికాయ పోతున్నా మనకి సోయలేదు అని గమనిస్తే మన బేజారు మనసుకి శాంతి దొరుకుతుంది.

నిన్న మొన్న చైనా గాల్వన్‌ ‌దగ్గర చొరబడింది. అంతకు ముందెప్పుడో చైనా జార్ఖండ్‌ ‌లో ఓ చిన్న ప్రాంతం గొడ్డాలో చొరబడింది.. ఇది భారత్‌ అం‌తర్భాగ ప్రాంతం. మరి ఇక్కడ చైనా చొరబడింది అని మనకి సోయి వుండిందా. ఇలా చైనా గొడ్డాలో చొరబడటానికి చైనాకి సహాయం చేసిన ద్రోహి అంటారో.. సైనికుడు అంటురో.. మీ ఇష్టం. ఇతను మరెవరో కాదు. ఆదానీ గ్రూప్‌ ‌చైర్మన్‌, ‌గౌతమ్‌ ఆదానీ. 23 ఏప్రిల్‌ 2018 ‌సంవత్సరంలో ఆదానీ గ్రూప్‌ ‌కి, చైనా కంపెనీ.. పవర్‌ ‌కంస్ట్రక్షన్‌ ‌కార్పొరేషన్‌ అఫ్‌ ‌చైనాకి మధ్య ఓ ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం చైనా కంపెనీతో కలసి ఆదానీ గ్రూప్‌, ‌గొడ్డాలో విద్యుత్‌ ఉత్పత్తి చేసి, బంగ్లా దేశ్‌ ‌కి అమ్ముకుంటారు.ఇంతే కాదు ఎకనామిక్‌ ‌కారిడార్‌ ‌భారత్‌,‌చైనా, బంగ్లా దేశ్‌, ‌మైన్మార్‌ ‌ల మధ్య తయారు చేయాలి అన్న ప్రణాళిక నాలుగు దేశాలకి వున్నది. ఈ కారిడార్‌ ‌పేరు దీ•×వీ అని నాలుగు దేశాల పేర్లు వచ్చేట్టు పెట్టారు. దీనిపై ఇంకా భారత ప్రభుత్వం అనుమతి ఇవ్వాల్సి వుంది. భారత ప్రభుత్వం అనుమతించిన వెంటనే ఈ కారిడార్‌ ‌నిర్మాణం కాంట్రాక్టు ఆదానీ గ్రూప్‌ ‌కి అందటం ఖాయం దీనికి సంబంధించిన లాబీయింగ్‌ 2018 ‌లోనే గౌతమ్‌ ఆదానీ చైనాలో పూర్తి చేసారు.ఇంతేనా 20 జూన్‌ 2017 ‌లో బీజింగ్‌ ‌లో ఈస్ట్ ‌హాప్‌ ‌గ్రూప్‌ అనే చైనా కంపెనీకి ఆదానీ గ్రూప్‌ ‌కి మధ్య వ్యాపార ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం ముంద్రా పోర్ట్ ‌దగ్గరున్న స్పెషల్‌ ఎకనామిక్‌ ‌జోన్‌ ‌లో 300 మిలియన్‌ ‌డాలర్ల మేనిఫ్యాక్చరింగ్‌ ‌యూనిట్‌ ‌చైనా ఆదానీ గ్రూప్‌ ‌పెడతారు. ఈ ఒప్పందం జరుగుతున్నా సమయంలో డోక్లామ్‌ అం‌శం మీద భారతీయ సిపాయిలు 2017 జూన్‌ 16 ‌న చైనాతో అమీ తుమీ తేల్చుకుంటున్నారు.

ఇంతే కాదు ..డోక్లామ్‌ ‌గొడవ తర్వాత భారత్‌ ‌చైనాల మధ్య 22 మీటింగ్లు జరిగాయి. ఈ మీటింగ్లన్ని చైనా భారత్‌ ‌కంపెనీల లావాదేవీలకు సంబంధించినవే. 22 ఫిబ్రవరి 2019 లో జాయింట్‌ ‌వర్కింగ్‌ ‌గ్రూప్‌ ‌స్కిల్‌ ‌డెవలప్మెంట్‌ అనే పేరుతో ఓ సమావేశం జరిగింది. 2019 మే 7 న బీజింగ్లో మరో సమావేశం జరిగింది. గత సెప్టెంబర్‌ 7 ‌న ఢిల్లీలో వర్కింగ్‌ ‌గ్రూప్‌ ఆన్‌ ‌ఫార్మస్యూటికల్స్ ‌స్ట్రాటజిక్‌ ఎకనామిక్‌ ‌డైలాగ్‌ అనే పేరుతో మరో సమావేశం జరిగింది.18 నవంబర్‌ ‌లో జాయింట్‌ ‌వర్కింగ్‌ ‌గ్రూప్‌ ‌సమావేశం జరిగింది. ఇరు దేశాల సర్వీస్‌ ‌సెక్టార్‌ ‌కి సంబంధించిన అంశాల పై చర్చ కోసం జరిగిన సమావేశం ఇది. 29 నవంబర్‌ ‌లో వుహాన్‌ ‌లో నీతి ఆయోగ్‌ ‌చైనా రీసెర్చ్ ‌సెంటర్‌ ‌ఫర్‌ ‌డెవెలప్మెంట్‌ ‌తో సమావేశం అయ్యింది. గత డిసెంబర్‌ ‌లో 9 వ ఫైనాంషియల్‌ ‌డైలాగ్‌ అనే సమావేశం జరిగింది. ఈ సమావేశాల ముఖ్య ఉద్దేశం భారత్‌ ‌చైనా కంపెనీల మధ్య ఒప్పందాల లావాదేవీలే. డోక్లామ్‌ ‌టెన్షన్‌ ‌తర్వాత =దీ× బ్యాంకు అఫ్‌ ‌చైనాకి భారత్‌ ‌లో బ్యాంకు ఓపెన్‌ ‌చేయటానికి అనుమతి ఇచ్చింది. ఇంతే కాదు మన్మోహన్‌ ‌సింగ్‌ అనుమతించిన ఇండస్ట్రియల్‌ ‌కామర్స్ ‌బ్యాంకు అఫ్‌ ‌చైనా మరో బ్రాంచ్‌ ‌భారత్‌ ‌లో ఓపెన్‌ ‌చేయటానికి అనుమతి అడుగుతున్నది. అక్టోబర్‌ 2018‌లో ఆయిల్‌ అం‌డ్‌ ‌గ్యాస్‌ ‌సెక్టార్లో ఇరుదేశాలు ఒక ఒప్పందం చేసుకున్నాయి. దీని కోసం పెట్రోలియం సెక్రటరీ బీజింగ్‌ ‌వెళ్లి మరీ ఈ ఒప్పందం చేసుకున్నారు. ఈ అంశానికి సంబంధించి ఫిబ్రవరిలో చైనా పెట్రోలియం మంత్రి భారత్‌ ‌కి వచ్చారు. దీని తర్వాత మే 2018 లో డబల్‌ ‌టాక్సేషన్‌ ఎ‌గ్రిమెంట్‌ ‌చైనా భారత్‌ ‌ల మధ్య కొత్త తరహా లో చేసుకున్నారు. ఇంతే కాదు గత నవంబర్లో భారత్‌ ‌కి వచ్చి పనిచేసే చైనా ప్రొఫెషనల్‌ ‌కి భారత్‌ ‌సామాజిక భద్రత కల్పిస్తుందని ఇరు దేశాల మధ్య ఒప్పందం జరిగింది . ఈ ఒప్పందం ప్రకారం భారతదేశానికి వచ్చి పని చేసే చైనా ప్రొఫెషనల్‌ ‌కి సామాజిక భద్రత భారత ప్రభుత్వం కల్పించాలి. గమనించాల్సింది ఏమిటంటే మన దేశ అన్‌ ఆర్గనైజ్డ్ ‌సెక్టార్‌ ‌లో పనిచేసే 35 కోట్ల కార్మికులకు భారత ప్రభుత్వం ఎటువంటి సామాజిక భద్రత కల్పించటం లేదు. మన దేశంలో మెట్రో రైలు పెట్టెలు చైనా నుంచి మనం ఇంపోర్ట్ ‌చేసుకుంటున్నాం. వందకు పైగా చైనా కంపెనీలు భారతదేశంలో ఉన్నాయి. అలాగే భారతీయ కంపెనీలు కూడా చైనాలో ఉన్నాయి. రిలయన్స్, ‌డాక్టర్‌ ‌రెడ్డీస్‌ ‌లాబొరేటరీస్‌, అరబిందో ఫార్మా, మెట్రిక్‌ ‌ఫార్మా, భారత్‌ ‌ఫోర్స్, ‌సాఫ్ట్వేర్‌ ‌రంగంలో నిట్‌, ఇన్ఫోసిస్‌, ‌టిసిఎస్‌, ఆప్టెక్‌, ‌విప్రో, మహేంద్ర అండ్‌ ‌మహేంద్ర, ఎస్‌ ఎల్‌ ‌ప్యాకేజింగ్‌, ‌సుజలాం ఎనర్జీస్‌, ‌టాటా సన్స్, ‌బినామీ సిమెంట్‌, ‌సుందరం ఫాస్ట్నర్స్ ఇలా ఈ కంపెనీల బ్రాంచీలు చైనాలో వున్నాయి. ఇవన్నీ ప్రభుత్వం నడిపే వారికి ఆజ్ఞలు జారీ చేసే హోదాలో వున్నవి వీటిని కాదని మోడీ చైనాలో దూరి తంతాను అనగలుగుతారా.. అందుకే మనం మోడీని అర్ధం చేసుకోవాలి. మొత్తం పరిణామాలు మీ గుండెలను మండిస్తే బర్నాల్‌ ‌లాంటి మరో వివరం చదవండి. 2018 లో భారత్‌ ‌కు 2 లక్షల 25 వేల మంది చైనా టూరిస్టులు వచ్చారు. దీని వలన భారత్‌ ‌కి ఆదాయం బాగా వచ్చింది. వెంటనే టూరిజం మంత్రి అల్ఫోన్స్ ‌జోసెఫ్‌ ‌కన్నంతనం చైనా టూరిస్టులను ఆకర్షించడానికి చైనాలో మూడు రోడ్‌ ‌షోలు చేసారు. . కనుక ప్రధాని మోడీని అర్ధం చేసుకుని.. మీరు కూడా చైనా టూరిస్ట్ ‌ను పేయింగ్‌ ‌గెస్ట్ ‌గా ఇంటిలో పెట్టుకుంటే మంచిది. అసలే కోవిద్‌ ‌వలన జీతాలు కట్‌ అయినవి. కనుక కొంత ఆదాయం అయినా వస్తుంది.

 

Leave a Reply