Take a fresh look at your lifestyle.

తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ..ఐటీఐఆర్‌ ‌పునరుద్ధరణ.

కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి సంజయ్‌ ‌ధోత్రే లిఖితపూర్వక సమాధానం

ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి ,న్యూ దిల్లీ,మర్చి17:ఐటీఐఆర్‌ ఏర్పాటుపై కేంద్రం స్పష్టత ఇచ్చింది. ఐటీఐఆర్‌ ‌పునరుద్ధరణపై తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తి పరిశీలనలో ఉంది అని కేంద్రం చెప్పింది. 2017లో ఐటీఐఆర్‌ ‌పథకం అమలును నిలిపివేసిన కేంద్రం…టీఆర్‌ఎస్‌ ఎం‌పీ గడ్డం రంజిత్‌రెడ్డి ప్రశ్నకి కేంద్రం సమాధానమిచ్చింది.

- Advertisement -

తెలంగాణలో రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధానికి కారణమైన ఐటీఐఆర్‌ అం‌శంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. 2017లో ఐటీఐఆర్‌ ‌పురోగతిపై జరిపిన సమీక్ష అనంతరం పథకం అమలును నిలిపివేయాలని నిర్ణయంచామని తెలిపింది. అయితే అనంతరం ఐటీఐఆర్‌ను పునరుద్ధరించాలని, లేదా దాని స్థానంలో మెరుగైన పథకాన్ని అందించాలంటూ తెలంగాణ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని పరిశీలిస్తున్నామని కేందప్రభుత్వం వెల్లడించింది. బుధవారం లోక్‌సభలో టీఆర్‌ఎస్‌ ఎం‌పీ డా రంజిత్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి సంజయ్‌ ‌ధోత్రే లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఐటీఐఆర్‌ ‌పథకాన్ని పునరుద్ధరించడం అంశంలో ఈ ఏడాది జనవరి 7వ తేదీన తెలంగాణ ఐటీ శాఖ మంత్రి నుంచి ఒక లేఖ వచ్చిందని ఆయన తెలిపారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ఎలక్ట్రానిక్‌ ‌మాన్యుఫ్యాక్చరింగ్‌ ‌క్లస్టర్‌ ‌పథకాలు, పరిశ్రమల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఇతర కార్యక్రమాల దృష్ట్యా ఐటీఐఆర్‌ అం‌శాన్ని పరిశీలిస్తున్నామని అన్నారు. 2016, 2017ల్లో హైదరాబాద్‌లో ఇన్ఫర్మేషన్‌ ‌టెక్నాలజీ ఇన్వెస్ట్‌మెంట్‌ ‌రీజియన్‌(ఐటీఐఆర్‌) ‌పథకం అమలుకు సంబంధించి సమీక్ష నిర్వహించామని, అయితే పారిశ్రామిక యూనిట్లు, క్లస్టర్‌ల అభివృద్ధిలో పురోగతి కారణంగా, ఐటీఐఆర్‌ ‌లక్ష్యాలను సాధిచడంతో ఐటీఐఆర్‌-2008 ‌పథకాన్ని కొనసాగించాల్సిన అవసరం లేదని నిర్ణయించి పథకాన్ని నిలుపుదల చేశామని కేంద్రమంత్రి తెలిపారు. ఈ సమీక్ష అనంతరం 2018లో జూన్‌ 15‌న, ఆగస్టు 4వ తేదీన, ఈ ఏడాది జనవరి 7వ తేదీన ఐటీఐఆర్‌ ఏర్పాటుపై తెలంగాణ ప్రభుత్వం నుంచి సమాచారం కేంద్రానికి అందిందని ఐటీ శాఖ సహాయ మంత్రి పేర్కొన్నారు.

హైదరాబాద్‌లో ఇన్ఫర్మేషన్‌ ‌టెక్నాలజీ ఇన్వెస్ట్‌మెంట్‌ ‌రీజియన్‌ (ఐటిఐఆర్‌)‌ను కేంద్ర ఆర్థిక సహాయంతో ప్రారంభించేందుకు 2013 నవంబర్‌ 13‌న కేంద్ర ఐటీ శాఖ నోటిఫికేషన్‌ ‌జారీ చేసింది. నోటిఫికేషన్‌ ‌ప్రకారం మౌలిక వసతులు, ఇతర సదుపాయాలు కల్పించాల్సి ఉంది. అయితే అదనపు నిధులు కోరుతూ తెలంగాణ ప్రభుత్వం 2014 సెప్టెంబర్‌ 24‌న లేఖ రాసింది. సాధ్యాసాధ్యాల వివరాలు వెల్లడిస్తూ 2014 నవంబర్‌ 20 ‌కేంద్రం బదులిచ్చింది. ప్రాజెక్టు విస్తరణ, అదనపు సదుపాయాలపై ఎలాంటి నివేదిక కేంద్రానికి పంపలేదని కేంద్రం తెలిపింది. అంతేగాక ఈ పథకానికి సంబంధించి రైల్వే మంత్రిత్వ శాఖ, కేంద్ర ప్రభుత్వ రవాణా-రహదారుల మంత్రిత్వ శాఖ, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖలతో తెలంగాణ ప్రభుత్వం సమన్వయం చేయాలని గతంలో సూచించింది. అయితే 2010లో ఐటీఐఆర్‌ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనతో పాటు అందిన ప్రాజెక్ట్ ‌రిపోర్టు మాత్రమే కేంద్రం వద్ద ఉందని, 2016లో ఎలాంటి అదనపు డీపీఆర్‌ అం‌దలేదని తెలిపారు.

Leave a Reply