Take a fresh look at your lifestyle.

డబ్బుకు వోట్లేస్తారనే చిల్లర ఆలోచనలు మానండి

  • తెల్లబట్టలో డబ్బులు పెట్టి పంచుతున్నారు
  • జమ్మికుంట ప్రచారంలో మండిపడ్డ ఈటల రాజేందర్‌

ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ ‌తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బుధవారం జమ్మికుంట ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ..డబ్బుకు వోట్లు వేస్తారనే చిల్లర ఆలోచనతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉన్నారని, చావనైనా చస్తా కానీ.. సీఎంకు లొంగనని స్పష్టం చేశారు. తనతో ఉండేవాళ్లకు డబ్బుల ఆశలు చూపుతున్నారని మండిపడ్డారు. కొడంగల్‌, ‌నారాయణఖేడ్‌, ‌హుజూర్‌నగర్‌, ‌నాగార్జు సాగర్‌లో నడిచినట్టు ఇక్కడ నడవదన్నారు. తెల్లబట్టలో పసుపు పెట్టి, డబ్బులు ఇచ్చి వోటు వేయాలని ప్రమాణం చేయించుకుంటారన్నారు. సీఎం కేసీఆర్‌ ‌ప్రగతి భవన్‌ ‌నుంచి హరీష్‌ ‌రావుకు డబ్బు సంచులు ఇస్తున్నారని ఈటల ఆరోపించారు. ’కేసీఆర్‌! ‌నువ్వు కాదు కదా.. నీ జేజమ్మ వొచ్చినా ఇక్కడ గెలవలేరు. ఇక్కడ ఉన్న నా అక్కాచెల్లెళ్లు, అన్నాతమ్ముళ్లు పద్దెనిమిదిన్నర ఏళ్లుగా నన్ను కడుపులో పెట్టుకొని కాపాడుకుంటున్నారు.

నన్ను గుండెల్లో పెట్టుకున్నోళ్లు..నీ సారా సీసాలకు, డబ్బు సంచులకు లొంగిపోరు, బెదిరింపులకు, నీ పోలీసు రాజ్యానికి భయపడరు. ఇది చైతన్యవంతమైన హుజూరాబాద్‌’అని అన్నారు. కేసీఆర్‌ ‌కుట్రలను, కుతంత్రాలను ఛేదించి ఈ నెల 30న హుజూరాబాద్‌ ‌ప్రజలు ఆత్మగౌరవ బావుటా ఎగురవేస్తారన్నారు. తాను ఒక్క హుజూరాబాద్‌తోనే కొట్లాట ఆపనని, ఉప ఎన్నిక ఫలితాల తర్వాత రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి అగ్గి పెట్టి.. కేసీఆర్‌ ‌పార్టీని కూల్చే ప్రయత్నం చేస్తానని ఈటల రాజేందర్‌ ‌హెచ్చరించారు.

టీఆర్‌ఎస్‌ ‌నాయకులు తన పేరిట నాలుగు దొంగ ఉత్తరాలు పుట్టించారని, దళితబంధు వద్దు.. అని సృష్టించిన లేఖపై ఎన్నికల కమిషన్‌, ‌టీఆర్‌ఎస్‌ ‌చెంప చెళ్లుమనిపించిందని అన్నారు. అలాగే తాను కేసీఆర్‌కు భయపడి వాళ్ల కాళ్ల వి•ద పడి క్షమించమని కోరుతూ ఉత్తరం రాసినట్లు మరో దొంగ లేఖ పుట్టించారని, తాను చచ్చినా ఎవరి ముందు మోకరిళ్లనని స్పష్టంచేశారు. గతంలో గ్యాంగ్‌స్టర్‌ ‌నయీం చంపిస్తానంటేనే బెదిరిపోలేదని, ఇప్పుడు కూడా కేసీఆర్‌ ‌తాటాకు చప్పుళ్లకు భయపడబోనని పేర్కొన్నారు.

Leave a Reply