Take a fresh look at your lifestyle.

దిమ్మతిరిగేలా… కెసిఆర్‌కు హుజూరాబాద్‌ ‌ప్రజలు గట్టి తీర్పు ఇచ్చారు

  • ఎమ్మెల్యేగా ఈటల రాజేందర్‌ ‌ప్రమాణం
  • అమరవీరుల స్థూపం వద్ద నివాళి

హుజురాబాద్‌ ఎమ్మెల్యేగా ఈటల రాజేందర్‌ ‌ప్రమాణ స్వీకారం చేశారు. బుధవారం ఉదయం అసెంబ్లీలోని స్పీకర్‌ ‌చాంబర్‌లో  ఎమ్మెల్యేగా ఈటల రాజేందర్‌ ‌చేత స్పీకర్‌ ‌పోచారం శ్రీనివాస్‌ ‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. ఆయన గన్‌ ‌పార్క్‌లో అమరవీరులకు నివాళులర్పించారు. ఈటలతో పాటు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, జితేందర్‌ ‌రెడ్డి, వివేక్‌, ఏనుగు, తదితరులు గన్‌పార్క్‌కు వొచ్చారు. హుజురాబాద్‌ ‌ప్రజల తీర్పుతో కేసీఆర్‌కు దిమ్మతిరిగిందని ఈటల ఈ సందర్భంగా అన్నారు. కేసీఆర్‌ ‌సీఎం అయ్యాక ప్రోటోకాల్‌ను కాలరాశారని ఫైర్‌ అయ్యారు.

సమైక్య రాష్ట్రంలో ఉన్న స్వేచ్ఛ కూడా ఇప్పుడు లేకుండా పోయిందని మండిపడ్డారు. కేంద్ర సర్కార్‌ ‌వడ్లు కొంటుందని చెప్పారు. రైతువేదికలు పశువులు కట్టేసే షెడ్లలా మారాయని మండిపడ్డారు. ర్రా పభుత్వం వెంటనే పెట్రో ధరలపై వ్యాట్‌ను తగ్గించాలని ఆయన డిమాండ్‌ ‌చేశారు. కెసిఆర్‌ ఉద్యమకారుల నోట్లో మట్టి కొట్టి.. ద్రోహులకు పదవులిస్తుండని మండిపడ్డారు. కేసీఆర్‌.. ఏం ‌మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థం కావడం లేదన్నారు. రెండు గంటలు కేసీఆర్‌ ‌మాట్లాడుతున్నాడంటే ప్రజలు నవ్వుకుంటున్నారని చెప్పారు. హుజురాబాద్‌ ‌ప్రజలు ఇచ్చిన తీర్పుకే కేసీఆర్‌కు దిమ్మతిరిగితే.. యావత్‌ ‌తెలంగాణ ప్రజలు ఇచ్చే తీర్పుకు ఆయన సిద్ధంగా ఉండాలని అన్నారు. నోరు చించుకుని మాట్లాడినంత మాత్రాన కేసీఆర్‌ ‌తప్పు చేయనట్టు కాదన్నారు. కేసీఆర్‌ ‌మాటల్లో నిజం లేదని, విశ్వసనీయత లేదని ఈటల చెప్పారు. ఉద్యమకారుల నోట్లో మట్టి కొట్టి.. ఉద్యమ ద్రోహులకు పదవులు కట్టబెడుతున్నాడని, అందుకే ఉద్యమకారులెవరూ కేసీఆర్‌ ‌వెంట ఉండొద్దని అన్నారు. ప్రమాణ స్వీకారానికి ముందు గన్‌ ‌పార్క్ ‌దగ్గర అమరవీరుల స్థూపానికి ఈటల నివాళులర్పించారు. ఆ తర్వాత ఏడోసారి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీలోని స్పీకర్‌ ‌పోచారం శ్రీనివాస్‌ ‌రెడ్డి ఆధ్వర్యంలో ఆయన ప్రమాణం చేశారు.

Leave a Reply