Take a fresh look at your lifestyle.

కేంద్రంలో బిజెపికి మెజార్టీ రాకుంటే మరోలా ఉండేది

  • ప్రత్యేక హోదాపై మనదే పైచేయి అయి ఉండేది
  • అయినా ప్రత్యేకహోదా డిమాండ్‌ను వదులుకోలేదు
  • ఎపిలో పెట్టుబడులకు అనేక అవకాశాలు ఉన్నాయి
  • విస్తారమైన సముద్ర తీరం..వనరులు మన ప్రత్యేకత
  • గత ప్రబుత్వంలా గ్రాఫిక్స్ ‌చూపడం లేదు
  • పారిశ్రామిక అభివృద్దిపై సిఎం జగన్‌ ‌వివరణ

అమరావతి,మే 28 : కేంద్రంలో ప్రభుత్వానికి పరిమితమైన సీట్లు వచ్చివుంటే ఎపికి ఇప్పటికే ప్రత్యేక హోదా వచ్చి ఉండేదని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. అలాగే 20 పార్లమెంట్‌ ‌సీట్లున్న వైకాపా పైచేయిగా ఉండేదని అన్నారు. మౌలిక సదుపాయాల విషయంలో ఆంధప్రదేశ్‌కు ప్రత్యేక బలం ఉందని తెలిపారు. రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం ఉందని.. లోక్‌సభలో నాలుగో అతిపెద్ద పార్టీగా వైఎస్సార్‌ ‌కాంగ్రెస్‌ ‌పార్టీ ఉందని సీఎం వైఎస్‌ ‌జగన్‌ ‌గుర్తుచేశారు. అయితే ఎప్పటికైనా ఎపికి అలాంటి అవకాశం వస్తుందని అప్పటికైనా మన డిమాండ్‌ ‌నెరవేరక తప్పదన్నారు. అలాగని ప్రత్యేక హోదా నుంచి వెనక్కి తగ్గలేదన్నారు. మన పాలన- సూచన కార్యక్రమంలో భాగంగా గురువారం పారిశ్రామిక రంగంపై తాడేపల్లిలోని క్యాంపు ఆఫీస్‌లో సీఎం వైఎస్‌ ‌జగన్‌ ‌సక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ పరిశ్రమల ఏర్పాటు, ఉద్యోగ అవకాశాల పెంపుపై సీఎం జగన్‌ ‌చర్చించారు. పారిశ్రామికవేత్తలు, లబ్దిదారులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ ‌జగన్‌ ‌మాట్లాడుతూ.. ఏపీకి 972 కిలోటర్ల కోస్తా తీరం.. మంచి రోడ్డుమార్గం, రైల్వే కనెక్టవిటీ, నాలుగు పోర్టులు, ఆరు ఎయిర్‌పోర్టులున్నాయని చెప్పారు. గత ప్రభుత్వం రాయితీలను కూడా అమ్ముకుందని.. కానీ ఈ ప్రభుత్వంలో అవినీతికి తావులేదని స్పష్టం చేశారు. వ్యవస్థలో పూర్తిస్థాయిలో మార్పులు తీసుకొచ్చామని చెప్పారు.

రాష్ట్ర విభజనతో మనకు నష్టమే జరిగింది. ప్రత్యేక హోదా ఇస్తారని మాట ఇచ్చి ఇవ్వలేదు. ప్రత్యేక హోదా ఇచ్చి ఉంటే అనేక రాయితీలు ఇచ్చేవారు.. పరిశ్రమలు వచ్చేవి. జీఎస్టీతోపాటు అనేక పన్నుల్లో మినహాయింపులు వచ్చేవి. 2014-19 వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కాపురం చేసినా హోదా రాలేదు. కేంద్రంలో సంపూర్ణ మెజార్టీ రాకపోయి ఉంటే రాష్ట్రానికి ప్రయోజనం జరిగి ఉండేది. ప్రత్యేక హోదా ఇస్తే ఎవరితోనైనా కలిసిపోతామని ఆనాడే చెప్పాం. కానీ కేంద్రంలో పూర్తి మెజార్టీతో ప్రభుత్వం ఏర్పడింది. ఎప్పుడు అవకాశం వచ్చినా కేంద్రంతో ప్రత్యేక హోదా గురించి అడుగుతూనే ఉన్నాం. ఎప్పటికైనా ప్రత్యేక హోదాను సాధించి తీరుతామన్నారు. మనం చెప్పే మాటల్లో నిజాయితీ, నిబద్ధత ఉండాలి. గత ప్రభుత్వం మాదిరిగా నేను అబద్దాలు చెప్పను. గత ప్రభుత్వం రూ.20 వేల కోట్ల పెట్టుబడులు, 40 లక్షలు ఉద్యోగాలంటూ ప్రచారం చేసింది. అన్ని విదేశీ సంస్థలు వచ్చేస్తున్నాయని ప్రచారం చేశారు. గత ప్రభుత్వం అబద్దాలు చెబుతూ గ్రాఫిక్స్‌తో కాలం గడిపింది. గత ప్రభుత్వం రాయితీలు ఇస్తామని చెప్పి ఇవ్వలేదు. 2014-19 వరకు రూ.4వేల కోట్లు బకాయిలు ఉన్నాయి. గత ప్రభుత్వం డిస్కంలకు రూ.20వేల కోట్ల బకాయిలు పెట్టిందని జగన్‌ అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఈజ్‌ ఆఫ్‌ ‌బిజినెస్‌ అం‌టూ క్రమం తప్పకుండా విదేశీ పర్యటనలు చేశారు తప్ప.. చేసిందే లేదు. వారి అనుకూల డియా కూడా అబద్దాలు ప్రచారం చేసింది. మాట ఇచ్చిందే చేస్తామని చెప్పాం.

నిజాయితీ, నిబద్ధతకు కట్టుబడి ఉన్నాం, ఇదే విషయాన్ని పరిశ్రమలకు చెప్పాం. మౌలిక సదుపాయల విషయంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక బలం ఉందన్నారు. ఇకపోతే రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం ఉంది. లోక్‌సభలో నాలుగో అతిపెద్ద పార్టీగా వైఎస్‌ఆర్‌ ‌సీపీ ఉందన్నారు.దేశంలో ఎక్కడాలేని విధంగా జ్యుడిషీయల్‌ ‌ప్రివ్యూ కమిషన్‌ ఏర్పాటు చేశాం. రివర్స్ ‌టెండరింగ్‌ ‌విధానాన్ని ప్రవేశపెట్టాం. దీని ద్వారా పారదర్శకత పెరిగింది. దేశంలోనే అత్యున్నత పోలీసు వ్యవస్థ ఇక్కడ ఉంది. రాష్ట్రంలో విద్యుత్‌ ‌కొరత లేదు.. బలమైన బ్యాంకింగ్‌ ‌వ్యవస్థ ఉంది. పరిశ్రమలకు భూమి ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. పరిశ్రమలకు నీరు ఇచ్చేందుకు బలమైన వ్యవస్థ ఉంది. ప్రాథమికస్థాయి నుంచి ఇంగ్లిష్‌ ‌డియం అమలు చేస్తున్నాం. పరిశ్రమల్లో 75శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేలా చట్టం చేశాం. పరిశ్రమలను ప్రోత్సహించే కార్యక్రమాలు చేస్తున్నాం. కియా వెళ్లిపోతుందంటూ చంద్రబాబు, ఎల్లోడియా దుష్ప్పచారం చేసింది. చివరికి కియా యాజమాన్యం ముందుకొచ్చి.. ఏపీలో మంచి ప్రభుత్వం ఉంది.. మేమెందుకు వెళ్తామని చెప్పిందన్నారు. కొత్తగా 13,122 సూక్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు వచ్చాయి. రూ. 11,500 కోట్లతో పరిశ్రమలు పెట్టేందుకు 1466 కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి. మరో 23 ప్రముఖ సంస్థలు కూడా పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయి. సుమారు 90వేల సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను నిలబెట్టుకోవాల్సి ఉంది.

ఈ పరిశ్రమలను కాపాడుకుంటేనే ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయి. 2014-19 వరకు పెండింగ్‌లో ఉన్న బకాయిలతోపాటు.. సూక్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను కాపాడుకునేందుకు రూ.968 కోట్లు కేటాయించామని జగన్‌ అన్నారు. మొదటి విడతగా రూ.450 కోట్లు విడుదల చేశాం. సూక్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు సుమారు రూ.1200 కోట్లు ప్యాకేజీ ఇచ్చాం. రూ.15వేల కోట్లతో కడపలో స్టీల్‌ఎ•-‌లాంట్‌ ఏర్పాటు. స్టీల్‌ఎ•-‌లాంట్‌ అభివృద్ధి కోసం ప్రైవేట్‌ ‌కంపెనీలు ముందుకొస్తే… వారితో కలిసి పని చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం’అని జగన్‌ ‌తెలిపారు. ఇదిలావుంటే ఆంధ్రప్రదేశ్‌లో మరిన్ని పెట్టుబడులు పెట్టనున్నట్టు కియా సంస్థ ప్రకటించింది. రాష్ట్రంలో మరో 54 మిలియన్‌ ‌డాలర్లు అదనంగా పెట్టుబడులు పెట్టనున్నట్టు ఆ సంస్థ కూకున్‌ ‌షిమ్‌ ‌వెల్లడించారు. కియా ఎస్‌యూవీ వెహికల్స్ ‌తయారీకి ఈ కొత్త పెట్టుబడులు పెడుతున్నట్టు తెలిపారు. మన పాలన- సూచన కార్యక్రమంలో భాగంగా గురువారం పారిశ్రామిక రంగంపై ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహించిన సదస్సులో పాల్గొన్న ఆయన ఈ ప్రకటన చేశారు. ఆంధప్రదేశ్‌ ‌ప్రభుత్వంతో కియాకు బలమైన బంధం ఉందని కూక్యూన్‌ ‌తెలిపారు.

Leave a Reply