Take a fresh look at your lifestyle.

ఐటి రంగంలోని చిన్న సంస్థలను కాపాడాలి

  • కేంద్రమంత్రి రవిశంకర్‌ ‌ప్రసాద్‌కు మంత్రి కెటిఆర్‌ ‌లేఖ
  • తలసేమియా చిన్నారికి ఆర్థిక సాయం చేయాలని ఆదేశం

కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్‌ ‌ప్రసాద్‌కు మంత్రి కేటీఆర్‌ ‌లేఖ రాశారు. ఐటీ రంగంలోని సూక్ష్మ, మధ్య స్థాయి పరిశ్రమలను ఆదుకోవాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న జీఎస్టీ, ఐటీ రిఫండ్లను వెంటనే పరిష్కరించాలన్నారు. ఐటీ ఎంఎస్‌ఎంఈలకు స్వల్పకాలిక రుణాలు ఇవ్వడం ద్వారా లే ఆఫ్స్ ఆపవచ్చని సూచించారు. ఐటీ పార్కులు, సెజ్‌ల్లోని కార్యాలయాలకు స్టాండర్డ్ ‌హెల్త్ ‌కోడ్‌ ‌ప్రవేశపెట్టాలని కేటీఆర్‌ ‌లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఉద్యోగుల సాంద్రత ఆఫీస్‌ ‌కార్యాలయ స్థలంతో పోలిస్తే ఎక్కువగా ఉందన్నారు. దీన్ని ఒక్కో ఉద్యోగికి 100 నుంచి 125 చదరపు అడుగులులా నిర్దేశించాలని చెప్పారు. సెజ్‌ల ప్రత్యక్ష ప్రయోజనాలను వచ్చే ఏడాది వరకు పొడిగించాలన్నారు. ఇదిలావుంటే సంగారెడ్డి జిల్లాలోని పటాన్‌చెరు అంబేద్కర్‌ ‌కాలనీకి చెందిన పెంటేష్‌ ‌వృతిరీత్యా పెయింటర్‌.

ఇతని కూతరు వైష్టవి చిన్నప్పటి నుండి తలసేమియా వ్యాధితో పడుతుంది. లాక్‌డౌన్‌ ‌మూలంగా కుటుంబానికి ఉపాధి లభించకపోవడంతో మందులు కొనుగోలు చేయలేని స్థితి ఏర్పడింది. బాధిత కుటుంబ ధీనస్థితిని ఎండీఆర్‌ ‌ఫౌండేషన్‌ ‌సభ్యులు ట్విట్టర్‌ ‌ద్వారా మంత్రి కేటీఆర్‌ ‌దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన మంత్రి చిన్నారి వైష్ణవికి సహాయం అందించాల్సిందిగా జిల్లా కలెక్టర్‌ ‌హనుమంతరావుకు సూచించారు. కలెక్టర్‌ ఆదేశానుసారం స్థానిక ఎమ్మెల్యే సోదరుడు మధు, ఎమ్మార్వో, ఆర్‌ఐ అధికారులు వైష్ణవి ఇంటికి వెళ్లి వివరాలను సేకరించారు. బాధిత కుటుంబ స్థితిపై కలెక్టర్‌కు తెలియజేయనున్నట్లు తెలిపారు. విషయం తెలిసిన మాజీ సర్పంచ్‌ ‌దేవేందర్‌రాజు వైష్ణవి కుటుంబానికి రూ.2 వేలు ఆర్థికసాయం అందించారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!