Take a fresh look at your lifestyle.

మూడరోజు కొనసాగిన ఐటి దాడులు

  • పంచానామ అందించిన ఐటి అధికారులు
  • 28న హాజరు కావాలని మంత్రి మల్లారెడ్డికి నోటీసులు

రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డికి చెందిన సంస్థలు, బంధువుల ఇళ్లల్లోనూ మూడో రోజు ఐటీశాఖ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. మంత్రి మల్లారెడ్డికి చెందిన సంస్థలు, బంధువుల ఇళ్లల్లో ఐటీశాఖ అధికారుల సోదాలు ముగిశాయి. కుత్బుల్లాపూర్‌ ‌లోని మల్లారెడ్డి బంధువుల ఇంట్లో సోదాలు పూర్తయ్యాయి. దూలపల్లిలోని ప్రవీణ్‌ ‌రెడ్డి, సుచిత్రలోని త్రిశూల్‌ ‌రెడ్డి ఇంట్లో సోదాలు ముగిశాయి. మెడికల్‌, ‌డెంటల్‌ ‌కళాశాలలు, మల్లారెడ్డి వర్సిటీలోనూ సోదాలు చేశారు. అంతకు ముందు.. తమ ఇంట్లో సోదాలు ముగిసిన తర్వాత పంచనామా నివేదికలను మంత్రి మల్లారెడ్డికి ఐటీ అధికారులు అందజేశారు. ఈనెల 28వ తేదీసోమవారం ఐటీ ఎదుట హాజరు కావాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు.

మరోవైపు మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్‌ ఇం‌ట్లో సోదాలు కొనసాగాయి. ఈ తనిఖీల్లో 10 కోట్ల 50 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. అర్ధరాత్రి సమయంలో మంత్రి మల్లారెడ్డి.. గన్‌ ‌మెన్‌, ‌సెక్యూరిటీ లేకుండా కేవలం డ్రైవర్‌ ‌తో హాస్పిటల్‌కి వెళ్లారు. తప్పుడు పత్రాలపై ఐటీశాఖ అధికారులు బలవంతంగా సంతకాలు తీసుకున్నారని ఆరోపించారు. మరోవైపు ఇదే విషయంపై బోయిన్‌ ‌పల్లి పోలీస్‌ ‌స్టేషన్‌ ‌లో ఫిర్యాదు చేసేందుకు మంత్రి మల్లారెడ్డితో పాటు ఆయన చిన్న కుమారుడు వెళ్లారు. ఎన్ని కోట్లు రాశారని మంత్రి మల్లారెడ్డి ప్రశ్నించడంతో రూ.100 కోట్లు అని ఐటీ అధికారి రత్నాకర్‌ ‌సమాధానమిచ్చారని తెలుస్తుంది. ఇదే విషయంపై మంత్రి మల్లారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. వి•డియా ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌దృష్టికి తీసుకెళ్లండని అన్నారు.

Leave a Reply