Take a fresh look at your lifestyle.

యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ఐటి పాలసీ

  • భవిష్యత్‌లో ఐటీ రంగానికి కేంద్రంగా విశాఖ సిటీ
  • విశాఖపట్నం, తిరుపతి, అనంతపురంలో కాన్సెప్ట్ ‌సిటీలు ఏర్పాటు
  • ఉన్నతస్థాయి సక్షలో సిఎం వైఎస్‌ ‌జగన్‌ ‌వెల్లడి

అమరావతి,జూన్‌ 23 : ‌యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ఐటి పాలసీ ఉంటుందని సిఎం జగన్‌ అన్నారు. అందుకు అనుగుణంగా వారి స్కిల్స్‌ను తీర్చిదిద్దాలన్నారు. భవిష్యత్‌లో ఐటీ రంగానికి విశాఖ కేంద్రంగా మారుతుందని, ఐటీ రంగంలో అత్యుత్తమ యూనివర్శిటీని విశాఖపట్నంలో తీసుకురావాలని పేర్కొన్నారు. ఐటీ రంగంలో అత్యాధునిక టెక్నాలజీ లెర్నింగ్‌కు డెస్టినేషన్‌గా ఈ యూనివర్శిటీ మారాలన్నారు. ఐటీ పాలసీ, ఎలక్టాన్రిక్‌ ‌మాన్యుఫాక్చరింగ్‌ ‌క్లస్టర్స్, ‌డిజిటల్‌ ‌లైబ్రరీలపై బుధవారం సీఎం జగన్‌ ‌సక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ ‌జగన్‌ ‌మాట్లాడుతూ.. యువతకు మంచి ఉద్యోగాలు రావడమే ఐటీ పాలసీ ప్రధాన ఉద్దేశం కావాలని,వారికి హైఎండ్‌ ‌స్కిల్స్ ‌నేర్పించాలన్నారు. హైఎండ్‌ ‌స్కిల్స్ ‌నేర్పించే కంపెనీలకు, సంస్థలకు పాలసీలో ప్రాధాన్యత, ప్రోత్సాహకాలు ఇవ్వాలని ఆదేశించారు. విశాఖపట్నం ఉద్యోగాల కల్పనకు ప్రధాన కేంద్రం అవుతుందని.. ప్రభుత్వం కల్పించనున్న మౌలిక సదుపాయాలు, అంతర్జాతీయ విమానాశ్రయం.. ఇవన్నీ కూడా నగర స్థాయిని మరింత పెంచుతాయన్నారు.

విశాఖపట్నం, తిరుపతి, అనంతపురంలో కాన్సెప్ట్ ‌సిటీలు ఏర్పాటు చేయాలని.. దీనికి అవసరమైన భూములను గుర్తించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. కాన్సెప్ట్‌సిటీల ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధంచేయాలని పిలుపునిచ్చారు. ఏపీలో ఏర్పాటయ్యే కంపెనీలకు ప్రతి ఏడాది ఇన్సెంటివ్‌లు ఉంటాయని? కనీసం ఏడాది పాటు ఒక ఉద్యోగి స్థిరంగా అదే కంపెనీలో పనిచేయాల్సి ఉంటుందని తెలిపారు. మొదటి ఏడాది పూర్తవగానే ఆ కంపెనీకి ఇన్సెంటివ్‌ల చెల్లింపులు ప్రారంభం అవుతాయని చెప్పారు. ఈ నిబంధన వల్ల మన పిల్లలకు ఏడాదిపాటు స్థిరమైన ఉపాధి లభిస్తుందని నిర్ణీత కాలం పని వల్ల నైపుణ్యం కూడా మెరుగుపడుతుందన్నారు.

శేషాద్రి కొండపై
కొలువుదీరిన చిన్న తిరుపతి
ద్వారకా తిరుమలపై శ్రీద్వారకాధీశ నమోనమ: గ్రంథం
మాటూరిని అభినందించిన మంత్రి కొడాలి నాని
గుడివాడ,జూన్‌ 23 : ‌శేషాద్రి కొండపై కొలువు దీరిన సుదర్శన క్షేత్రం ద్వారకా తిరుమల చిన్న తిరుపతిగా ప్రసిద్ధి చెందినదని, ఈ ఆలయంపై శ్రీద్వారకాధీశ నమోనమ: గ్రంథాన్ని రచించడం అభినందనీయమని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) అన్నారు. బుధవారం గుడివాడలో మంత్రి కొడాలి నానిని ప్రముఖ వ్యాపారవేత్త, రచయిత మాటూరి రంగనాథ్‌ ‌కలిశారు. ఈ సందర్భంగా ద్వారకా తిరుమలలోని శ్రీవేంకటేశ్వర స్వామిపై రాసిన శ్రీ ద్వారకాధీశ నమోనమ: గ్రంథాన్ని మంత్రి కొడాలి నానికి అందజేశారు. స్వామివారి అనుగ్రహం, మంత్రులు కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్‌ ‌సహకారం వల్ల తన భార్య డాక్టర్‌ ‌మాటూరి శ్రీవల్లి ద్వారకా తిరుమల దేవస్థానం ట్రస్ట్ ‌బోర్డు సభ్యురాలిగా కొనసాగుతోందని రంగనాథ్‌ ‌చెప్పారు. శ్రీవేంకటేశ్వర స్వామి దేవస్థానం గురించి సవివరంగా భక్తులకు తెలియజేయాలనే ఉద్దేశ్యంతో గ్రంథాన్ని రచించడం జరిగిందన్నారు.

ఈ పుస్తకంలో దత్త దేవాలయాలు, వేద పాఠశాల, డిగ్రీ కళాశాల, గోశాలతో పాటు ఆలయంలో జరిగే క్రతువులు, అన్నదానం వంటి విషయాలను పొందుపర్చానని చెప్పారు. అనంతరం శ్రీద్వారకాధీశ నమోనమః గ్రంథాన్ని మంత్రి కొడాలి నాని ఆసక్తిగా చదివారు. ద్వారకా తిరుమలలోని శేషాద్రి కొండపై శ్రీవేంకటేశ్వర స్వామి కొలువు తీరి ఉన్నారని, స్వామివారిపై గ్రంథాన్ని రాయడం ఎంతో అదృష్టమని మంత్రి కొడాలి నాని అన్నారు. ఈ గ్రంథంలో నిత్య కార్యక్రమాలు, విశేష ఉత్సవాలు, ఇతర ఆలయాలు, చూడదగిన ప్రదేశాలను చక్కగా వివరించారని తెలిపారు. గ్రంథకర్త మాటూరిని మంత్రి కొడాలి నాని అభినందించారు.

Leave a Reply