Take a fresh look at your lifestyle.

పౌరుల వ్యకిగత స్వేచ్ఛ హరించడమే ..!

మోడీ సర్కార్‌ ‘‌పెగాసెస్‌’ ‌ను అందుకే కొనుగోలు చేసిందా…?
ప్రతిపక్ష నాయకుల సమావేశంలో రాహుల్‌ ‌గాంధీ
‘పార్లమెంటులో ప్రతిపక్షాల గొంతు అణచివేయబడుతుంది’ అని కాంగ్రెస్‌ ‌పార్టీ నాయకుడు రాహుల్‌ ‌గాంధీ అన్నారు. దీనికి బాధ్యులు ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్‌ ‌షా అని రాహుల్‌ ఆరోపించారు. పెగాసెస్‌ ‌వివాదం నేపథ్యంలో బుధవారం రాహుల్‌ ‌గాంధీ పలువురు ప్రతిపక్ష నాయకుల సమావేశానికి అధ్యక్షత వహించారు. పెగాసెస్‌ ‌వివాదంపై బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వంపై వొత్తిడి పెంచాలని, ఉభయ సభలకు వాయిదా నోటీసులు ఇవ్వాలని ప్రతిపక్షాలు సమావేశంలో నిర్ణయించాయి. ప్రతిపక్ష పార్టీల సభా పక్ష నాయకులతో జరిగిన సమావేశం తరువాత రాహుల్‌ ‌విలేఖరులతో మాట్లాడుతూ ప్రతిపక్షాల ఒకే ఒక ప్రశ్న…. ఇజ్రాయెల్‌ ‌స్పైవేర్‌ ‌పెగాసెస్‌ను తమ సొంత ప్రజలకు వ్యతిరేకంగా ఆయుధంగా ఉపయోగించడానికి భారత ప్రభుత్వం కొనుగోలు చేసిందా…? అని, ఈ ప్రశ్నపై సభలో ఎందుకు చర్చించలేమని ఆయన ప్రశ్నించారు. ప్రతిపక్షం ఈ సమస్యను లేవనెత్తడం ద్వారా పార్లమెంటు చర్యలకు భంగం కలిగించడం లేదని, తమ బాధ్యతను మాత్రమే తాము నెరవేరుస్తున్నామని రాహుల్‌ అన్నారు. ‘‘ప్రభుత్వం పెగాసెస్‌ను కొనుగోలు చేసి భారతీయులపై విరుచుకుపడిందా..? అని మాత్రమే మేము అడుగుతున్నాము’’ అని రాహుల్‌ ‌మోడీ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా సూటిగా ప్రశించారు. పెగాసెస్‌ ఉదంతం గోప్యతకు సంబంధించినది కాదని, ఇది దేశ వ్యతిరేక పని అని రాహుల్‌ అన్నారు.

నరేంద్ర మోడీ, అమిత్‌ ‌షా భారతదేశానికి, దేశ సంస్థలకు వ్యతిరేకంగా పెగాసెస్‌ను ఉపయోగించడం ద్వారా భారతదేశ ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీశారని రాహుల్‌ ‌గాంధీ అన్నారు. ప్రతిపక్ష పార్టీల సమావేశంలో పలువురు నాయకులు పెగాసెస్‌ ‌వివాదంపై భారతీయ జనతా పార్టీ (బిజెపి) నేతృత్వంలోని ప్రభుత్వంపై వొత్తిడి పెంచాలని, లోక్‌సభలో వాయిదా నోటీసులు ఇవ్వాలని నిర్ణయించారు. పెగాసెస్‌ ‌వివాదాన్ని మినహాయించి, ఇంకేదైనా అంశంపై చర్చకు సిద్ధంగా ఉన్నట్లు ప్రభుత్వ పక్షం సూచించిందని ప్రతిపక్ష శిబిర వర్గాలు పేర్కొన్నాయి. సోమవారం లోక్‌సభలో రెండు బిల్లులను ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం చేసిన ప్రయత్నం ప్రతిపక్ష పార్టీలను ఇంకా రెచ్చగొట్టింది.

ప్రతిపక్ష పార్టీల సమావేశంలో లోక్‌సభ కాంగ్రెస్‌ ‌నాయకుడు అధీర్‌ ‌రంజన్‌ ‌చౌదరి, డిఎంకెకు చెందిన టిఆర్‌ ‌బాలూ, కనిమోళి, ఎన్‌సిపి సుప్రియ సులే, శివసేన అరవింద్‌ ‌సావంత్‌, ‌కేరళ కాంగ్రెస్‌ (ఎం) ‌థామస్‌ ‌చాజికాదన్‌, ‌నేషనల్‌ ‌కాన్ఫరెన్స్ ‌హస్నైన్‌ ‌మసూది, ఆర్‌ఎస్‌పికి చెందిన ఎన్‌కె ప్రేమాచంద్రన్‌, ‌ముస్లిం లీగ్‌కు చెందిన ఇటి మొహద్‌ ‌బషీర్‌, ‌సిపిఎంకు చెందిన ఎస్‌ ‌వెంకటేశన్‌, ఎఎమ్‌ ఆరిఫ్‌ ఉన్నారు. ఈ సమావేశంలో ప్రతిపక్ష ఫ్లోర్‌ ‌లీడర్స్ ‌పలువురు ప్రతిపక్షం ఐక్యతతో ఉందని, వారిలో ఎలాంటి విభజన లేదా అపార్థం లేదనే మెసేజ్‌ ‌బిజెపికి వెళ్లవలసిన అవసరం వుందని వాదించారు. ప్రతిపక్ష నాయకుడు ఒకరు మాట్లాడుతూ..సభకు మరింత దూకుడుగా అంతరాయం కలిగించవలసిన అవసరం గురించి మాట్లాడుతూ ‘మనం నినాదాలు చేసినప్పటికీ ప్రభుత్వం సభను నిర్వహించ గలిగింది’ అని చెప్పుకొచ్చారు. ప్రతిపక్షాల కోలాహలంతో లోక్‌ ‌సభ మళ్ళీ వాయిదా పడింది. పెగాసెస్‌ ‌స్నూపింగ్‌ ‌వివాదం, వ్యవసాయ చట్టాలు మరియు ధరల పెరుగుదలపై ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేయడం వల్ల రాజ్యసభ కూడా వాయిదా పడింది.

Leave a Reply