Take a fresh look at your lifestyle.

విమోచన దినాన్ని నిర్వహించకపోడవడం దారుణం

  • మజ్లిస్‌కు భయపడి ఉత్సవాలను నిర్వహించరా?
  • బిజెపి అధికారంలోకి వొస్తే సెప్టెంబర్‌ 17 ‌ఫైల్‌పైనే మొదటి సంతకం
  • సిఎం కెసిఆర్‌పై కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి మండిపాటు
  • బిజెపి కార్యాలయంలో జెండా ఆవిష్కరణ

తెలంగాణ విమోచన దినం సెప్టెంబర్‌ 17‌ను అధికారికంగా నిర్వహించకపోవడం దారుణమని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం తెలంగాణ విమోచన వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌ ‌పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ..అమరుల ఆత్మకు శాంతి కలిగేలా అధికారికంగా తెలంగాణ విమోచన ఉత్సవాలు నిర్వహించాలని తెలిపారు. చరిత్రను తొక్కిపెట్టే ప్రయత్నం జరుగుతుందని విమర్శించారు. ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌ ‌మాట్లాడుతూ..

సీఎం కేసీఆర్‌ ‌నియంతలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌ ఊసరవెల్లిలా రంగులు మారుస్తున్నారని దుయ్యబట్టారు. ఎంఐఎంకు మద్దతిచ్చే పార్టీలకు మనుగడ ఉండదన్నారు.  17 సెప్టెంబర్‌ను అధికారికంగా నిర్వహించకుండా కాంగ్రెస్‌, ‌టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వాలు అన్యాయం చేశాయని ఆయన విమర్శించారు. ఉదయం అసెంబ్లీ ముందున్న సర్థార్‌ ‌పటేల్‌ ‌విగ్రహానికి కిషన్‌ ‌రెడ్డి, బీజేపీ నేతలు  నివాళులర్పించారు. కేసీఆర్‌ ‌తన తప్పును తెలుసుకొని అమరుల ఆత్మకు శాంతి చేకూర్చాలని డిమాండ్‌ ‌చేశారు. రజాకార్ల నేత కాశిం రజ్వీ పెట్టిన పార్టీ ఎంఐఎం అని అన్నారు. మజ్లీస్‌ ‌కనుసైగల్లో కాంగ్రెస్‌, ‌టీఆర్‌ఎస్‌లు పనిచేస్తున్నాయన్నారు. ఇది తెలంగాణ ఆత్మ గౌరవం..ఆకాంక్షల సమస్య అని…కానీ మజ్లీస్‌ ఏది చెబితే అది అమలు అవుతుందని తెలిపారు. కేసీఆర్‌, ఒవైసీ కుటుంబాలు తెలంగాణ ప్రజలను తమకి బానిసలుగా ఉండాలని కోరుకుంటున్నాయన్నారు. సెప్టెంబర్‌ 17 అన్ని పార్టీలు చేయాల్సిన పరిస్థితి వొచ్చింది..కానీ ప్రభుత్వ పరంగా గ్రామ గ్రామాన జరగాలని డిమాండ్‌ ‌చేశారు. కుహనా లౌకిక వాదులకి, వోటు బ్యాంకు రాజకీయాలకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కేసీఆర్‌ ‌వైఖరిని మజ్లీస్‌ ‌దౌర్జన్యాన్ని ప్రజలు ఖండించాలన్నారు.

బీజేపీ అధికారంలోకి వొస్తే మొదటి సంతకం సెప్టెంబర్‌ 17‌ని అధికారికంగా నిర్వహించే ఫైల్‌…‌రెండో సంతకం తెలంగాణ విమోచన చరిత్రను పాఠ్య పుస్తకాలలో పెట్టే ఫైల్‌పైన అని కిషన్‌ ‌రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ సీనియర్‌ ‌నేత లక్ష్మణ్‌ ‌తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మజ్లిస్‌ ‌పార్టీకి లొంగి.. కేసీఆర్‌ ‌విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహించడం లేదని ఆయన అన్నారు. చరిత్ర వెలుగులోకి వస్తే మజ్లీస్‌కు, ఆ పార్టీకి మద్దతు ఇచ్చే పార్టీలకు రాజకీయ మనుగడ ఉండదని హెచ్చరించారు. వోటు బ్యాంకు రాజకీయాల కోసం చరిత్రను తెరమరుగు చేస్తున్నారన్నారు. నిజాంకు, కేసీఆర్‌కు ఎలాంటి తేడా లేదని…ఊసర వెల్లిలా కేసీఆర్‌ ‌రంగులు మారుస్తున్నారని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ ‌నియంతలా వ్యవహరుస్తున్నారని లక్ష్మణ్‌ ‌దుయ్యబట్టారు.

Leave a Reply