Take a fresh look at your lifestyle.

ఘనంగా శ్రీ వాసవి మాత జన్మదినం

సూర్యాపేట, మే 2, ప్రజాతంత్ర ప్రతినిధి): పార్వతిదేవి అంశయైన జగజ్జనని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి జన్మదిన వేడుకలు జిల్లా కేంద్రంలోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయంలో శనివారం ఘనంగా నిర్వహించా రు. ఈ సందర్భంగా దేవాలయ ప్రధాన అర్చకులు అన్నావరజ్జుల కృష్ణమూర్తి శర్మ శాస్త్రోక్తంగా మాతకు ప్రత్యేక పంచామృత అభిషేకం నిర్వహిం చారు. అనంతరం అమ్మవారికి పట్టు వస్త్రములు అలంకరింపజేసి అష్టోత్తర, సహస్ర నామ పూజ లు, పారాయణం నిర్వహించారు. దేవాలయం లో వేంచేసియున్న శ్రీ నగరేశ్వరస్వామి, శ్రీ గణపతి స్వామి వార్లకు ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. అమ్మవారికి ప్రీతిక రంగా 11రకాల ప్రసాధములు నైవేద్యంగా పెట్టారు. కరోనా నేపధ్యంలో భక్తులను ఎవరిని లోపలికి అనుమతించలేదు. ఈ పూజా కార్యక్ర మంలో దేవాలయ అధ్యక్షులు సింగిరికొండ సురేందర్‌, ‌ప్రధాన కార్యదర్శి ఈగ వెంకటేశ్వర్లు, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

మధిరలో…
మధిర, మే 2 (ప్రజాతంత్ర) :  మధిర పట్టణం లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం నందు అమ్మవారి జయంతి వేడుకలను శనివా రం ఘనంగా నిర్వహించారు. దేవాలయంలో కరోనా సందర్భంగా సోషల్‌ ‌డిస్టెన్స్ ‌పాటిస్తూ ధ్వజస్థంభంపై జెండాను ఆవిష్కరించారు. ముం దుగా  ప్రధానార్చకులు శ్రీనివాసుల శేషాచార్యుల ఆధ్వర్యంలో అమ్మవారికి  ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్‌ ‌కపి)వాయి జగన్మోహన్‌రావు మాట్లాడుతూ కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతిని పురస్కరించుకుని ఈ కార్యక్రమాలను నిర్వహించటం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్ర మలో కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply