మహబూబ్నగర్, 23 జూన్ (ప్రజాతంత్ర ప్రతినిధి) : తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాకే అభివృద్ధి పథంలో కొనసాగుతుందని తెరాస పార్టీ ద్వారాన్ని అభివృద్ధి సాధ్యమని నిరూపించామని మంత్రి శ్రీనివాసస గౌడ్ అన్నారు వక్ఫ్ కాంప్లెక్స్ వెనక ఉన్న మోటార్ లైన్ లో పనిచేస్తున్న వారందరి షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించి ఇస్తామని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ తెలిపారు సోమవారం ఆయన మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పలు కాలనీలలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.ముందుగా శ్రీనివాస కాలనీ దగ్గర ఉన్న సంతోష్ నగర్ కాలనీలో ఐదు లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న మురికి కాలువ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం వక్ఫ్ బోర్డు వెనక మోటార్ లైన్లో సుమారు 20 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న రోడ్డు మరియు డ్రైన్ పనులకు శంకుస్థాపన చేశారు.
మోటార్ లైన్ లో పనిచేస్తున్న యజమానులు, వర్కర్లను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ ఇక్కడ పనిచేసే వివిధ నైపుణ్యం కలిగిన ఆటోమొబైల్ వారి కోసం రోడ్డు సౌకర్యం కల్పించడం జరుగుతున్నదని, భవిష్యత్తులో వీరందరి కోసం ఒక కాంప్లెక్స్ ను నిర్మించి ఇస్తామని, అంతేకాక సులబ్ కాంప్లెక్స్ ద్వారా మూత్ర శాలలు, స్నానపు గదులు కూడా ఏర్పాటు చేస్తామని, వర్కర్లు ఇక్కడి నుండే దేవాలయాలు లేదా మసీదులకు వెళ్లేందుకు అనుకూలంగా కూడా ఉంటుందని తెలిపారు. అందరికీ షాపులు లభించే విధంగా పెద్ద కాంప్లెక్స్ ను నిర్మిస్తామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. పట్టణంలోని చిరు వ్యాపారుల కోసం రోడ్డుపై వ్యాపారం చేసేవారికి చిన్నచిన్న షాపులు ఏర్పాటు చేసి ఇవ్వడం జరిగిందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు . అంతకుముందు సంతోష్ నగర్ కాలనీలో తాగునీరు సరిగా రావట్లేదని కాలనీవాసులు మంత్రి దృష్టికి తీసుకురాగా తక్షణమే మిషన్ భగీరథ అధికారులతో మాట్లాడి ప్రతి రోజు కాలనీ కి తాగునీరు వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. న్యూ మోతి నగర్ లో ప్రైవేట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ పంపును ప్రారంభించారు. మంత్రి వెంట రాష్ట్ర సంగీత నాటక అకాడమీ చైర్మన్ బాదిమి శివకుమార్, డిసిసిబి ఉపాధ్యక్షులు వెంకటయ్య, మున్సిపల్ చైర్మన్ నరసింహులు, వార్డు కౌన్సిలర్ లు తదితరులు అదనపు ఎస్ పి వెంకటేశ్వర్లు,డి ఎస్ పి శ్రీధర్ తదితరులు ఉన్నారు .