Take a fresh look at your lifestyle.

కష్టకాలంలో భారాలు మోపడం బాధాకరం

‌కష్టకాలంలో ప్రజలను ఆదుకోవాల్సింది పోయి పాలకులు ధరలను పెంచి భారం మోపడం ఏ మేరకు సమంజసమని కాంగ్రెస్‌పార్టీ జిల్లా అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి విమర్శించారు. సోమవారం ఏఐసీసీ, టీపీసీసీ ప్రెసిడెంట్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశాల మేరకు డిజిల్‌, ‌పెట్రోల్‌ ‌పంపకంపై జిల్లా కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించిన అనంతరం జిల్లా కలెక్టర్‌ ‌కె నిఖిలకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జంగా మాట్లాడుతూ నేడు దేశంలో నిరుద్యోగ సమస్యలతోపాటు గత నాలుగు నెలలుగా కరోనాతా ప్రజలంతా విలవిల లాడుతూ తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ప్రజలపై 20రోజు లుగా వరుసగా పెట్రోల్‌, ‌డిజిల్‌ ‌ధరలను పెంచుతూ మూలిగే నక్కపై తాటికా య పడ్డచందంగా బీజేపి ప్రభుత్వం వ్యాపార దృక్పథంతో వ్యవహరించడం వలన ప్రజలను మరింత తీవ్రంగా కుంగదీస్తుందన్నారు. ప్రపంచంలో అధిక జనాబాలో రెండవస్థానంలో ఉన్న మన దేశంలో లాక్‌డౌన్‌లో పేద, మధ్య తరగతి ఉద్యోగ, వ్యాపార, రైతు, చిల్లర వర్తకులు తీవ్రంగా నష్టపోయారని, ఉద్యోగ, ఉపాధి కరువై వందల కి.మి.ల దూరంలో ఉన్న వారి ఊళ్లకు కాలినడకన వెళ్లి కాలం వెల్లదీసే దుర్భర జీవితాన్ని చవి చూశారన్నారు.

ఇలాంటి తరుణంలో అన్ని రకాలుగా ధరలను తగ్గించి ప్రజలను ఆదుకోవా ల్సిన ప్రభుత్వం పెట్రోల్‌, ‌డిజిల్‌ ‌ధరలను పెంచి ప్రజల నడ్డి విరుస్తున్నాంద న్నారు. దుర్బర జీవితాన్ని ఎదుర్కొంటున్న సమయంలో ప్రభుత్వాల మానవత్వా న్ని మరిచిపోయి బాధ్యతలను విస్మరించి పీఎం మోదీ ఒక నియంతలా ఒక పాషాణ హృదయంతో వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014 సంవత్సరంలో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం అధికారంలో ఉన్నపుడు అంతర్జాతీయ క్రూడాయిల్‌ ‌ధర 108 డాలర్లు ఉన్నపుడు లీటర్‌కు పెట్రోల్‌ ‌ధర రూ.71.40, డిజిల్‌ ‌ధర రూ.59.49 ఉంటే నేడు బీజేపి ప్రభుత్వ కాలంలో అంతర్జాతీయంగా 43,41డాలర్లకు క్రూడాయిల్‌ ‌ధర దిగజారిందంటే దాదాపు 60శాతం తగ్గితే అదేమాదిరిగా పెట్రోల్‌, ‌డిజిల్‌ ‌ధరలు తగ్గాలన్నారు. ఉదాహరణకు (ఒక బ్యారెల్‌ 159 ‌లీటర్ల క్రూడాయిల్‌) ‌ధర రూ.3,289 ఉంటే ఆ లెక్కన పెట్రోల్‌ ‌ధర రూ.20.68 ఉండాలన్నారు. కానీ దోపిడీ దారుల వల్ల ఎక్సైజ్‌ ‌పన్నులు పెంచి నేడు పెట్రోల్‌ ‌ధర రూ.82.96, డిజిల్‌ ‌ధర రూ.78.19 పెంచి పేద ప్రజల నడ్డి విరిచారన్నారు. 258శాతం పన్నులు పెంచుతూ పేద ప్రజల రక్తాన్ని జలగలా పీల్చిపిప్పిచేస్తూ పెట్టుబడి దారులకు, వ్యాపారస్తులకు లాభాలు అర్జిస్తున్న బీజేపి పార్టీ ప్రజావ్యతిరేఖ వైఖరికి నిదర్శనమన్నారు. గత ఆరు సంవత్సరాలలో కేవలం ఎక్సైజ్‌ ‌పన్ను పెంచడం ద్వారా మోదీ ప్రభుత్వం దాదాపు 18లక్షల కోట్లు ప్రజాధనాన్ని పేద ప్రజల రక్తాన్ని చార్జీల రూపంలో పీల్చుకుందన్నారు. ఇష్టమొచ్చినట్లు పెట్రోల్‌, ‌డిజిల్‌ ‌ధరలను పెంచి ప్రజలను కనిపెట్టడం ఎంత మాత్రం సబబు కాదన్నారు. దీంతో ఈ విషయాలను పరిశీలించి అంతర్జాతీయ క్రూడాయిల్‌ ‌ధరలకు అనుగుణంగా పెట్రోల్‌, ‌డిజిల్‌ ‌ధరలను తగ్గించి ప్రజలను ఆదుకోవా లని కాంగ్రెస్‌ ‌విజ్ఞప్తి చేస్తుందన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ ‌మాజీ చైర్మన్‌ ‌వేమల్ల సత్యనారాయణ, మార్కెట్‌ ‌మాజీ చైర్మన్‌ ఎ‌ర్రమల్ల సుధాకర్‌, ‌డాక్టర్లు లక్ష్మినారాయణ నాయక్‌, ‌రాజమౌళి, పట్టణ అధ్యక్షుడు బుచ్చిరెడ్డి, మాజీ జెడ్పీటీసీ అండాలు శ్రీరామ్‌, ‌మాజీ కౌన్సిలర్లు మేడ శ్రీనివాస్‌, ‌దయాకర్‌రెడ్డి, జిల్లా మైనార్టీ సెల్‌ అధ్యక్షుడు జమాల్‌ ‌షరీఫ్‌, ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడు చిలువేరు అభిగౌడ్‌, ‌మున్సిపల్‌ ‌ఫ్లోర్‌ ‌లీడర్‌ ‌మారబోయిన పాండు, డిప్యూటీ ఫ్లోర్‌లీడర్‌ ‌గాదెపాక రాంచందర్‌, ‌కౌన్సిలర్లు చంద్రకళ రాజు, మంత్రి శ్రీశైలం, మల్లేశం, చందర్‌, ‌కమలమ్మ, విజయ్‌కుమార్‌, ‌వెల్దండ సర్పంచ్‌ ‌వెంకటరమణారెడ్డి, నాయకులు ఎండీ గౌస్‌, ‌పాషా,సంజయ్‌రెడ్డి, మినుకూరి మహేందర్‌ ‌రెడ్డి, రంగరాజు ప్రవీణ్‌కుమార్‌, ‌దేవరుప్పుల, కొడకండ్ల, మండలపార్టీ అధ్యక్షులు సురేష్‌ అయ్యగారు,సురేష్‌, ‌బ్లాక్‌ ‌కాంగ్రెస్‌ అధ్యక్షుడు సత్యనారాయణ, కుమార్‌,‌తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply