Take a fresh look at your lifestyle.

ప్రవాసంలోని ప్రజాస్వామ్యాన్ని రక్షించడం సాధ్యం కావటం లేదు…

‘‘‌ప్రభుత్వ విమర్శకులను ఓ దేశం వెలి వేయగా రాజకీయ ప్రవాసులైపోయిన… ప్రజాస్వామ్య వాదులకు శరణు ఇచ్చి కాపాడే దేశాలు ప్రభుత్వాలు ప్రపంచ వ్యాపితంగా కనుమరుగు అవుతున్న వైనాన్ని ఈ రిపోర్ట్ ‌తేటతెల్లం చేస్తున్నది.’’

 ఫ్రీడమ్‌ ‌హౌస్‌ ‌రిపోర్ట్

ఏదైనా ఒక దేశంలో ‘‘ప్రజాస్వామ్యాన్ని రక్షించటం సాధ్యం కావటం లేదు’’ అంటే సదరు దేశంలో నియంతృత్వ ప్రభుత్వం వుంది అని తేల్చేసి…ఆ దేశాన్ని నియంతృత్వ దేశం అనో అథారిటేరియన్‌ ‌దేశం అనో ఫాసిస్ట్ ‌దేశం అనో పిలుస్తాం. భూమి మీదే ‘‘ప్రజాస్వామ్యాన్ని రక్షించటం సాధ్యం కావటం లేదు’’ అని ఫ్రీడమ్‌ ‌హౌస్‌  ‌రిపోర్ట్ ‌చెబుతున్నది. అంటే మొత్తం భూమి నియంతృత్వంలో ఉందా…?
గత సంవత్సర కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాలు, విదేశాల్లో నివసించే లేదా శరణు తీసుకునే ‘‘తమ ప్రభుత్వ విమర్శకులపై’’ (అంటే ప్రజాస్వామ్యంపై) దాడి చేయడం చాలా ఎక్కువ అయినది. ఇలా చేయటం ద్వారా దేశంలోనే కాదు, భూమి మీద ఎక్కడ భిన్నాభిప్రాయాలను వినిపించే వారు అంటే ప్రజాస్వామ్యాన్ని ఆచరించే వారు ఉన్నా వారిని   అణిచివేసేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాలు చాలా గట్టిగ ప్రయత్నాలు చేసి ప్రజాస్వామయాన్ని కాల రాస్తున్నాయి అని ఫ్రీడమ్‌ ‌హౌస్‌  ‌రిపోర్ట్ ‌చెబుతున్నది.

బెలారసియన్‌ అధికారులు ఒక అంతర్జాతీయ విమానాన్ని బలవంతంగా ల్యాండ్‌ ‌చేయించి విమానంలో ఉన్న జర్నలిస్టును అదుపులోకి తీసుకున్నారు. బ్రూక్లిన్‌లో ఓ  ఇంటి నుంచి మహిళా హక్కుల కార్యకర్తను కిడ్నాప్‌ ‌చేసేందుకు ఇరాన్‌ ఏజెంట్లు కుట్ర పన్నారు. టర్కీ ఇంటెలిజెన్స్ అధికారులు నైరోబీలోని ఒక పోలీసు స్టేషన్‌ ‌వెలుపల నుండి రాజకీయ ప్రముఖుడి మేనల్లుడిని అపహరించారు. ఇలా ప్రజాస్వామ్యం ఖునీ అవుతున్న సంఘటనలను వివరిస్తూ…   తమకు అనుకూలంగా లేని వర్గాల వ్యతిరేకతను అణిచివేయటానికి ప్రపంచంలో ఉన్న అన్ని  ప్రభుత్వాలు, జాతీయ సరిహద్దులను దాటి అంతర్జాతీయ తీరాలకి పోయి అణచివేతకు పాల్పడుతున్నాయి అని ఫ్రీడమ్‌ ‌హౌస్‌  ‌రిపోర్ట్ ఏకరువు పెడుతున్నది. ఒక్క మాటలో చెప్పాలి అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ధనిక ప్రభుత్వాలు తాము రాసుకున్న అంతర్జాతీయ చట్టాలను, సో కాల్డ్ ‌ప్రజాస్వామ్య నిబంధనలను, దేశాల సార్వభౌమాధికారాలను ఉలంఘిస్తున్నాయి అని ఫ్రీడమ్‌ ‌హౌస్‌  ‌రిపోర్ట్ ‌నొక్కి వక్కాణిస్తున్నది.

ఈ దేశీయ…అంతర్జాతీయ అణచివేత వలన మానవ హక్కులకు…ప్రజాస్వామ్య విలువలకు భూమి మీద ముప్పు వాటిల్లుతున్నది. ఎందుకంటే నిరంకుశ శక్తులను ఎదిరించేంత ధైర్యం ఉన్న వ్యక్తులను  విడిచి పెడితే వీరు తమ ప్రభుత్వాలకి ప్రమాదం అని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాలు భావిస్తున్నాయి అని ఫ్రీడమ్‌ ‌హౌస్‌  ‌రిపోర్ట్ అధ్యయనంలో తేలింది. •తీ•అ•అ••ఱశీఅ•శ్రీ అణచివేతపై అధ్యయనం చేసే ఫ్రీడమ్‌ ‌హౌస్‌ ‌తన రెండవ సిరీస్‌ ‌రిపోర్టులో పై మాటలన్నీ చెపింది. ప్రభుత్వ విమర్శకులను ఓ దేశం వెలి వేయగా రాజకీయ ప్రవాసులైపోయిన… ప్రజాస్వామ్య వాదులకు శరణు ఇచ్చి కాపాడే దేశాలు ప్రభుత్వాలు ప్రపంచ వ్యాపితంగా కనుమరుగు అవుతున్న వైనాన్ని ఈ రిపోర్ట్ ‌తేటతెల్లం చేస్తున్నది.

ఉన్న దేశంలో ప్రభుత్వ దమనానికి గురికావటమే కాకుండా అంతర్జాతీయ అణచివేత అనే శక్తివంతమైన అస్త్రానికి, ప్రభుత్వాలకి వ్యతిరేకంగా మాట్లాడే ప్రజాస్వామ్య ఆచరణ వాదులు గురి అవుతున్న నేపథ్యంలో కూడా ఒక మానవ హక్కుల పరిరక్షణ కార్యకర్త ఇలా అంటాడు ‘‘నేను మీ పట్ల (ప్రభుత్వం పట్ల) నిజాయితీగా ఉన్నాను అంటేనే….నేను నిజంగా ఒంటరి అయిపోయాను అని అర్ధం.’’
ఈ పరిస్థితి మొత్తం ప్రపంచంలో ఉండగా ఇంకా భూమి మీద ప్రజాస్వామ్యం కొనసాగుతున్నది అని మనం నమ్ముతున్నాం అంటే ధనిక వర్గ రాజ్య నియంతృత్వం (అనగా •ఱ••••శీతీ•ష్ట్రఱజూ శీ•  •శీ•తీస్త్రవశీఱ•ఱవ) కొనసాగుతున్నది అని చెప్పుకుంటున్నాం అంతేగా.

aruna new delhi

 

Leave a Reply