Take a fresh look at your lifestyle.

‌ద్వితీయశ్రేణి నగరాలకు ఐటి కంపెనీలు: కేటీఆర్‌

Minister KTR appeals, Davos to guide, party leaders, municipal elections

రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ పరిశ్రమలు తెచ్చేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం ఫలితాలనిస్తుందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఫిబ్రవరి 18వ తేదీన కరీంనగర్‌ ఐటీ టవర్‌ ‌ప్రారంభిస్తామని తెలిపారు. తెలంగాణలో పెట్టుబడులకు మరిన్ని కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయని వెల్లడించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే కంపెనీలకు పూర్తి సహకారం అందిస్తామన్న మంత్రి కేటీఆర్‌ ‌కంపెనీల ఏర్పాటుకు అవసరమైన మౌళిక వసతుల కల్పన చేపట్టాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌ ‌నగరంలో ఇతర ప్రాంతాలకు ఐటీ విస్తరించేలా చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి. త్వరలోనే టీ-వర్క్, ‌రెండవ దశ టీ-హబ్‌ ‌ప్రారంభిస్తామని పేర్కొన్నారు. అటు వరంగల్‌లో పరిశ్రమల అభివృద్ధికి అవసరమైన మౌళిక సదుపాయాలు కల్పిస్తామని వెల్లడించారు. పుడ్‌ ‌ప్రాసెసింగ్‌ ‌రంగంలో పెట్టుబడులపై త్వరలోనే పలు కంపెనీలు ప్రకటనలు చేస్తాయని మంత్రి వెల్లడించారు.

గ్రేటర్‌లో మరో 227 బస్తీ దవాఖానాలు
గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ‌మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌ ‌పరిధిలో నూతనంగా మరో 227 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ ‌తెలిపారు. ఇప్పటికే నిర్వహణలో ఉన్న 123 బస్తీ దవాఖానాలకు తోడు మరో 227 బస్తీ దవాఖానాలకు ముఖ్యమంత్రి కార్యాలయం ఆమోదం తెలిపినట్లు మంత్రి కేటీఆర్‌ ‌ట్విట్టర్‌ ‌ద్వారా వెల్లడించారు. దీంతో మొత్తం బస్తీ దవాఖానాల సంఖ్య 350కి చేరుతుందన్నారు. రానున్న మూడు నెలల్లో ఈ దవాఖానాలు హైదరాబాద్‌ ‌వాసులకు అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply