Take a fresh look at your lifestyle.

12 ‌నుంచి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల జారీ

తిరుమల,జనవరి9 : శ్రీవారిని దర్శించుకునేందుకు ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఈ నెల 12 వ తేదీ నుంచి టీటీడీ జారీ చేయనున్నది. ఏ రోజుకారోజు దర్శనం కోసం తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్‌లో ఎప్పటిమాదిరిగానే ఎస్‌ఎస్‌డీ టోకెన్లు జారీ చేయనున్నారు. సామాన్య భక్తులను దృష్టిలో ఉంచుకొని రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనంను టీటీడీ ప్రవేశ పెట్టింది. ఈ దర్శనాలను గతంలో ఆఫ్‌ ‌లైన్‌ ‌లో అందించారు. కాలక్రమేణా ఆన్‌లైన్‌ ‌లో విడుదల చేస్తున్నారు. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా 10 రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పచేందుకు డిసెంబర్‌ ‌చివరిలో జనవరి 1 నుంచి 11 వరకు టోకెన్లను టీటీడీ జారీ చేసింది. అయితే పెండింగ్‌లో ఉన్న 12వ తారీఖు నుంచి టోకెన్లను అందజేయనున్నారు. ఈ నెల 31వ తారీఖు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్లను ఫిబ్రవరి 12వ తారీఖు నుంచి రోజువారిగా 20 వేల చొప్పున జనవరి 9 నుంచి  జారీ చేస్తున్నారు.

భక్తులు హెచ్‌టిపిపిఎస్‌ ‌తిరుపతి బాలాజీ.ఏపి. గవర్నమెంట్‌.  ఇన్‌  ‌వెబ్‌ ‌లింక్‌లో టికెట్‌ ‌పొందవచ్చు. ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని టీటీడీ బోర్డు విజ్ఞప్తి చేస్తుంది. తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు ఒక రోజు అన్నప్రసాదాలు అందించేందుకు టీటీడీ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టు ఒకరోజు విరాళ పథకం ప్రారంభించింది. ఇందుకోసం ఒక రోజు పూర్తిగా అన్నప్రసాద వితరణ కోసం రూ.33 లక్షలు విరాళం ఇవ్వాల్సి ఉంటుంది. ఉదయం అల్పాహారం కోసం రూ. 7.70 లక్షలు, మధ్యాహ్న భోజనం కోసం రూ.12.65 లక్షలు, రాత్రి భోజనానికి రూ.12.65 లక్షలు అందించి దాతలు స్వయంగా భక్తులకు అన్నప్రసాదాలు వడ్డించవచ్చు. దాతల పేర్లను వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ప్రదర్శిస్తారు. దాతలు తాము కోరుకున్న మేరకు ఒకరోజు అన్నప్రసాదాలు వడ్డించే అవకాశాన్ని పొందవచ్చు.

Leave a Reply