Take a fresh look at your lifestyle.

ఇజ్రాయెల్‌ – ‌పాలస్తీనా యుద్ధం … ప్రపంచ యుద్ధంగా మారనుందా?

“క్రైస్తవులు ఇక్కడే ఉన్నా డోమ్‌ ఆఫ్‌ ‌ది రాక్‌ ‌ను అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఇటీవలే ఇజ్రాయెల్‌ ‌లో ఒక కోర్టు  తీర్పు చెప్తూ తూర్పు జెరూసెలేం లోని కొన్ని ప్రాంతాలలో పాలస్తీనీయులు నివసించడానికి వీలు లేదని చెప్పడంతో, అధికారులు అక్కడినుంచీ నుంచి పాలస్తీనీయులను ఖాళీ చేయించి ఇళ్లు కూల్చివేయడం చేశారు. మే 9న జెరూసెలెం డే   ప్రదర్శనలో బ్యానర్‌ ‌రాతలు ఈ గొడవలకు కారణంగా భావిస్తున్నారు..”

యావత్‌ ‌ప్రపంచం కొరోనాతో అతలాకుతలం అవుతుంటే ఒక పక్క హమస్‌ ‌గాజా ప్రాంతం నుంచి  ఇజ్రాయెల్‌ ‌పైకి దాడులు, మరో పక్క ఇజ్రాయెల్‌ ‌గాజా ప్రాంతంపైకి ప్రతిదాడులతో ఏమీ సంబంధంలేని  సాధారణ పౌరులు వందల సంఖ్యలో మరణిస్తున్నారు.

కారణం ఏమై ఉంటుంది :
తూర్పు జెరూసెలేం లోని పాతనగరంలో గల అల్‌-అఖ్సా మసీదులో ప్రార్థనల సందర్భంగా జరిగిన ఘర్షణలు ఈ దాడి, ప్రతి దాడులకు కారణంగా చెప్పవచ్చు. ఇక్కడ పాతనగరంలో అల్‌- అక్సా మసీదు చుట్టు 35 ఎకరాల ప్రాంతం మూడు మతాల వారికి అత్యంత పవిత్రమైన స్థలంలో మహమ్మద్‌ ‌ప్రవక్త ఒకరోజు నమాజ్‌ ‌చేశారని అనంతరం స్వర్గాన్ని అధిరోహించారన్న ముస్లింల నమ్మకం కాబట్టే అత్యంత ముఖ్యమైన మూడవ పవిత్ర స్థలం ఈ మసీదు.

క్రైస్తవులు ఇక్కడే ఉన్నా డోమ్‌ ఆఫ్‌ ‌ది రాక్‌ ‌ను అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఇటీవలే ఇజ్రాయెల్‌ ‌లో ఒక కోర్టు  తీర్పు చెప్తూ తూర్పు జెరూసెలేం లోని కొన్ని ప్రాంతాలలో పాలస్తీనీయులు నివసించడానికి వీలు లేదని చెప్పడంతో, అధికారులు అక్కడినుంచీ నుంచి పాలస్తీనీయులను ఖాళీ చేయించి ఇళ్లు కూల్చివేయడం చేశారు. మే 9న జెరూసెలెం డే   ప్రదర్శనలో బ్యానర్‌ ‌రాతలు ఈ గొడవలకు కారణంగా భావిస్తున్నారు..

ఇజ్రాయెల్‌-‌పాలస్తీనా మధ్య దాడులు, ప్రతి దాడులు ప్రారంభం కాగానే ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ఇస్లామిక్‌ ‌కంట్రీస్‌ ( ఓ ఐ ‌సి) లోని 57 దేశాలు అత్యవసర సమావేశం జరిపి, ఇజ్రాయెల్‌ ‌చర్యను అరబ్‌  ‌ఖండించినా ఆ దేశాల స్పందనలో వ్యత్యాసాలు కనిపించాయి. సౌదీ అరేబియా ఈ ఘర్షణలను ఆపడానికి అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోవాలని కోరగా. మొరాకో, బహరెయిన్‌, ‌సుడాన్‌, ‌యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్ ‌టర్కీ, ఇరాన్‌ ‌తీవ్రంగా ఇజ్రాయెల్‌ ‌చర్యను బహిరంగంగా విమర్శించాయి. ఈజిప్ట్, ‌జోర్డాన్‌ ‌సంఘర్షణ పరిష్కారానికి ప్రయత్నాలు చేయగా, ఖతార్‌ ‌మధ్యవర్తిత్వానికి ప్రయత్నించింది.

అమెరికా మిత్ర దేశాలైన సౌదీ అరేబియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్, ‌బహరెయిన్‌ ఇ‌జ్రాయెల్‌ ‌దాడులను తప్పు పడుతూనే మెతక వైఖరిని కొనసాగించగా, లెబనాన్‌, ‌సిరియా జోర్డాన్‌, ఇరాన్‌, ‌టర్కీ, పాకిస్తాన్‌, ఇరాక్‌, ఆఫ్ఘనిస్తాన్‌ ఇతర ముస్లిం దేశాలు పాలస్తీనాకు పూర్తి మద్దతు ఇస్తున్నాయి.

జర్మనీ,  బ్రిటన్‌ ఇ‌జ్రాయెల్‌ ‌కు పూర్తి మద్దతు ప్రకటించగా, అమెరికా దాడులు ఆపాలని ఇజ్రాయెల్‌ను కోరినా అమెరికా,  మిత్రదేశాలు ఇజ్రాయిల్‌ ‌పక్షం వహించి  పరోక్షంగా పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాయి.  రష్యా, భారత్‌ ‌వంటి చాలా దేశాలు  పూర్వ స్థితిని కొనసాగించాలని, పేర్కొంటున్నాయి. చైనా పూర్వ స్థితికి ఉండాలని పేర్కొంటూనే  అంతర్జాతీయంగా పాలస్తీనా  మిత్ర దేశాలకు మద్దతిస్తూ అవసరమైతే పశ్చిమాసియాలో పెద్దన్న పాత్ర పోషించాలని చూస్తుంది.

భారత్‌ ‌వైఖరి:
తాజా పరిస్థితులలో భారత్‌ ‌తన వైఖరిని స్పష్టంగా పేర్కొంది. ఇప్పటికీ రెండు దేశాల సిద్ధాంతానికి భారత్‌ ‌కట్టుబడి ఉందని, న్యాయమైన పాలస్తీనా పౌరుల హక్కులకు భారత్‌ ‌మద్దతిస్తుందని ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత రాయబారి పేర్కొన్నారు. భారత్‌ ‌దేశం ఇజ్రాయెల్‌ ‌కు మిత్రదేశంగానే కొనసాగుతుంది .

మూడో ప్రపంచ యుద్ధంగా మారు తుందా:         ఇజ్రాయిల్‌ ‌పాలస్తీనా ఘర్షణలలో పాలస్తీనాకు మద్దతుగా లెబనాన్‌, ‌సిరియా  వైమానిక దాడుల్లో పాల్గొనడం, ఇస్లామిక్‌ ‌దేశాల కూటమి సమావేశమై ముక్తకంఠంతో ఇజ్రాయెల్‌ ‌చర్యలను ఖండించడం, గాజా లోని హమస్‌, ‌లెబనాన్‌ ‌లోని హిజ్బుల్లా సాయుధ దళాలకు ఇరాన్‌ ‌సహాయం పరోక్షంగా కొనసాగుతుండడం, టర్కీ, ఇరాన్‌ ‌బహిరంగంగానే పాలస్తీనాకు మద్దతు ప్రకటించడం ఒకవైపు అయితే, 25 దేశాలు బహిరంగంగానే  ఇజ్రాయెల్‌కు మద్దతు ఇవ్వటం, చైనా సమయం కోసం వేచి చూస్తూ ఉండటం, అమెరికా చెప్పిన ఇజ్రాయెల్‌ ‌వెనక్కి తగ్గక పోవడం లాంటి పరిస్థితులు మూడవ ప్రపంచ యుద్ధం రావచ్చనే అనుమానాన్ని కల్గిస్తున్నాయి.

ఐక్యరాజ్య సమితి  పేర్కొన్నట్లు ఇజ్రాయిల్‌ ‌రెండు దేశాల సిద్ధాంతానికి కట్టుబడుతూ తూర్పు జేరుసేలం నగరం రాజధానిగా పాలస్తీనా దేశం ఏర్పాటుకు అంగీకరించితే పరిష్కారం సుగమమమే.   తక్షణం హమాస్‌ ‌లాంటి సాయుధ సంస్థలు ఇజ్రాయెల్‌ ‌పై దాడులకు స్వస్థి చెప్పాలి. అల్‌-అఖ్సా ప్రాంతంలో పాత ఒప్పందాల ప్రకారం  పూర్వ స్థితి సాగించాలి. గత ఏడు దశాబ్దాలుగా రావణకాష్టంలా రగులుతున్న ఇజ్రాయిల్‌ ‌పాలస్తీనా సమస్యను రెండు దేశాలలోని సాధారణ పౌరుల జీవించే హక్కుల కోణం నుంచి చూడాలి. రెండు వర్గాలు శాంతి మార్గంలో ముందుకు నడవాలి.
జుర్రు నారాయణ యాదవ్‌
‌టి టి యు జిల్లా అధ్యక్షులు
మహబూబ్నగర్‌, 9494019270.

Leave a Reply