Take a fresh look at your lifestyle.

కరోనాకు ఏకైక మందు ఐసోలేషనే..!: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

ప్రధాని పిలుపు మేరకు జనతా కర్ఫ్యూలో భాగంకండి రాజకీయాలు కాదు. .కలిసి కరోనాపై యుద్దం చేద్దాం. కరోనా వైరస్‌ ‌వ్యాప్తి నిరోధించడానికి కేంద్రం అన్ని చర్యలు తీసుకుంటుంది..ఆందోళన అవసరం లేదు.. అందరం కలిసి కరోనపై పోరాడుదాం అని కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి అన్నారు. ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌ ‌పై అంతిమ విజయం ప్రజలదే కావాలని, ఇందుకోసం ప్రజలంతా ఇళ్ల నుంచి బయటకు రాకుండా స్వీయ నియంత్రణ పాటించాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌ ‌రెడ్డి పిలుపునిచ్చారు. కరోనా మహమ్మారి నివారణకు ఐసోలేషన్‌ ‌మంచి మందని అన్నారు. దేశ వ్యాప్తంగా కరోనా మరణాలు, పాజిటీవ్‌ ‌కేసులు నమోదవుతోన్న నేపథ్యంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదు అంటూ.. ప్రధాని మోడి ఇచ్చిన జనతా కర్ఫ్యూలో దేశ ప్రజలంతా స్వచ్చందంగా పాల్గొని, వైరస్‌ ‌మహమ్మారిపై పోరాడాలన్నారు. ఇకపై దేశానికి ఏ సమస్య వచ్చినా ఈ విధానం ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. శుక్రవారం ఢిల్లీలోని ఆయన నివాసంలో కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర బిజేపి అధ్యక్షులు బండి సంజయ్‌ ‌పాల్గొన్నారు. వైరస్‌ ‌వ్యాప్తిని అరికట్టే దిశలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలను, ఇకపై తీసుకోనున్న ముఖ్యమైన నిర్ణయాలను వివరించారు. వైరస్‌ ‌పై ప్రపంచ దేశాలు చేస్తోన్న యుద్ధంలో క్రీయా శ్రీలకంగా భారత్‌ ‌వ్యవహరించనున్నది అని తెలిపారు. ప్రారంభ దశ నుంచే కరోన నివారణకు చేర్యలు చేపట్టామన్నారు. ఈ దిశలో రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర మంత్రిత్వ శాఖలు, వివిధ దేశాలతో కోఆర్డినేషన్‌ ‌సిట్టంను ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపాదికన మినిసట్టర్‌ ‌టాస్క్ ‌పోర్టస్, ‌కేంద్ర ఉన్నతాధికారుల టాస్క్ ‌పోర్స్ ‌లను ఏర్పాటు చేసిందన్నారు. కరోనా వైరస్‌ ‌పై జనవరి 7 చైనా చేసిన తొలి ప్రకటించిన మరసటి నుంచే ఎనిమిది జాయింట్‌ ‌మానిటరింగ్‌ ‌గ్రూపులను ఏర్పాటు చేసి పర్యావేక్షిస్తున్నట్లు తెలిపారు. పిఎంఓ కార్యాలయం ఎప్పటికప్పుడు పరిస్థితులను తెలుసుకుంటున్నదని, అలాగే, కేంద్ర ఆరోగ్య, పౌర విమానయాన, విదేశాంగ, హోం శాఖలతో ఏర్పాటైన ఉప సంఘం ఇప్పటికే 7 సమావేశాల్ని నిర్వహించి తగు చర్యలు తీసుకుందన్నారు. వైరస్‌ ‌పై పట్టిష్టమైన పర్యావేక్షణ కోసం ఆన్‌ ‌లైన్‌ ‌పోర్టల్‌ ‌ని కేంద్రం ఏర్పాటు చేసిందన్నారు. ఇంటిగ్రేటేడ్‌ ‌డిసీస్‌ ‌సర్వేయలైన్స్ ఆధారంగా సోషల్‌ ‌వ్యవస్తను ఏర్పాటు చేయాలని అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. వైరస్‌ ‌ప్రభావం ఉన్న దేశాల నుంచి విమాన సర్వీసులు రద్దు చేసినట్లు తెలిపారు. దేశంలోకి సముద్ర ప్రయాణాలను, సరకు రవాణాను పూర్తిగా మూసివేసినట్లు వెల్లడించారు. చైనా, నేపాల్‌, ‌బంగ్లాదేశ్‌, ‌మయన్మార్‌ ‌లతో భారత్‌ ‌లోని 26 సరిహద్దు జిల్లాల్లో సుమారు 4, 645 గ్రామ సభలను ఏర్పాటు చేసి వైరస్‌ ‌పై అవగాహన కల్పించినట్లు చెప్పారు. సరిహద్దు దేశాల నుంచి భారత్‌ ‌లోకి వచ్చేలా కేవలం 20 మార్గాల ద్వారా అనుమతి ఇస్తున్నామన్నారు. వైరల్‌ ఇన్ఫెక్షణ్‌ ‌ప్రోఫేషన్‌ ‌మేనేజ్మెంట్‌ ఏర్పాటు చేసి ప్రపంచ దేశాల్లో వైరస్‌ ‌బాధితులకు అందిస్తోన్న వైద్యం, డ్రగ్స్, ‌ప్రాక్టీస్‌ ‌విధానాలను తెలుసుకుంటున్నట్లు చెప్పారు. బెస్ట్ ‌ప్రాక్టీస్‌ ఇన్‌ ‌ది ఎంటైర్‌ ‌వరల్డ్ ‌విధానాలను భారత్‌ ‌మాత్రమే వినియోగిస్తున్నట్లు చెప్పారు.

- Advertisement -

విపత్తు, ఆరోగ్య శాఖ నిధుల్ని వాడుకోవచ్చు..
రాష్ట్రాల దగ్గర ఉండే విపత్తు, ఆరోగ్య శాఖ నిధుల్ని కరోనాను అరికట్టేందుకు వినయోగించుకోవచ్చని మంత్రి కిషన్‌ ‌రెడ్డి తెలిపారు. డబ్బుకు ఏమాత్రం వెనకాడవద్దని, ఎక్కువ నిధుల్ని ఖర్చు చేసినా… కేంద్రం తర్వాత రియింబర్స్ ‌మెంట్‌ ‌చేస్తుందన్నారు. వైరస్‌ అనుమానితుల నుంచి తీసుకునే రక్త పరీక్షల నుంచి… కరోనా పాజిటీవ్‌ ‌వ్యక్తి మరణిస్తే అంత్యక్రియలు చేసేంత వరకు కేంద్రం అన్ని విధాలుగా తగిన జాగ్రత్తలు తీసుకుంటుందన్నారు. దేశంలో కరోనా నుంచి క్యూర్‌ అయిన బాధితుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉందని కిషన్‌ ‌రెడ్డి చెప్పారు. రేడియో గ్రాఫిక్స్ ‌క్లియరెన్స్, ఇతర టెస్ట్ ‌లు నెగటీవ్‌ ‌గా వచ్చిన తర్వాతే వారిని డిచార్జ్ ‌చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. వైరస్‌ అనుమానితులు క్వారెంటైన్‌ ‌లో ఉండేందుకు భయపడుతున్నారని, ఆందోనలు, ధర్నాలు చేస్తున్నారని ఇలాంటిది మంచింది కాదన్నారు. చైనాలో ఆర్మీ పాలన ఉంటుందని, అక్కడి విధానాలు చాలా క్రమశిక్షణగా ఉంటాయి కాబట్టే ఆ దేశం కరోనా మహమ్మారి నుంచి బయటడగలుగుతుందని వివరించారు. ఏ కుటుంబ సభ్యులు కూడా తమ వారిని క్వారెంటైన్‌ ‌నుంచి విడిపించాలని ప్రభుత్వాలు, అధికారులపై ఒత్తిడి తేవద్దని కోరారు.

శుక్రవారం మధ్యాహ్నం వరకు దేశంలో 15 వేల మందికి పైగా కరోనా పరీక్షలు నిర్వహించినట్లు చెప్పారు. రెండు వందల వరకు పాజీటీవ్‌ ‌కేసులు నమోదయ్యాయన్నారు. కాగా, తెలంగాణలో 16 పాజిటివ్‌ ‌కేసులు నమోదయ్యాయి అని ఆందోళన వ్యక్తం చేశారు. వివిధ రాష్ట్రాలు, క్వారైంటెన్‌ ‌కేంద్రాల్లో కలిపి దేశ వ్యాప్తంగా 69 వేల మంది నిఘాలో పెట్టినట్లు స్పష్టం చేశారు. ప్రస్తుతం 70 వేల కిట్‌ ‌లు అందుబాటులో ఉన్నాయని, మరో పది లక్షల కిట్లు ఉత్పత్తికి ఆదేశాలిచ్చామన్నారు. 37, 326 మంది ఐసోలేషన్‌ ‌కేంద్రాలు సిద్ధంగా ఉన్నాయని, అవసరమైతే విద్యా సంస్థలు మూసివేసిన నేపథ్యంలో రెసిడెంట్స్ ‌కాలేజీలు, పాఠశాలలను వినియోగించుకుంటామన్నారు. వ్యాధి నిర్ధాణకు ప్రజలు ఒక్క రూపాయి ఖర్చు చేయాల్సిన అవసరం లేదని, అన్ని రాష్ట్రాలు ఉచితంగా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తాయని స్పష్టం చేశారు. వైరస్‌ ‌నియంత్రణపై వివిధ రాష్ట్రాలకు చెందిన 260 మందికి శిక్షణ పూర్తయిందని, వారు దేశంలోని వెయ్యి కేంద్రాల్లో శిక్షణ ఇస్తారని తెలిపారు.

Leave a Reply