Take a fresh look at your lifestyle.

గాంధీ పుట్టిన దేశమా ఇది!?

స్వాతంత్య్రం, గాంధీతో సహా ఎందరో
మహనీయుల త్యాగఫలమైతే…
సత్యం, అహింస మానవ జీవితాల్ని
ఎంతగా సముద్ధరించ గలవో నేర్పింది
మాత్రం మహాత్ముడే….
సామాజిక రుగ్మతల్ని పోగొట్టి,
భారతీయుల్ని పరిపూర్ణులుగా తీర్చి
దిద్దడానికి ఆ బక్కప్రాణి ఆజన్మాంతం
ఏదోక పథక రచన చేస్తూనే వచ్చాడు…
బ్రిటీష్‌ ‌వారిని లొంగదీయడానికి,
సత్యాగ్రహమనే ఆయుధాన్ని ధరించి,
ఆసేతు హిమాచలం ఒక్క తాటిపై
నడిపించి, బానిస సంకెళ్లు తెంచుకొనే
మనో బలాన్ని మనకందించేడు….
నిరాడంబరత , శత్రువు పట్ల కూడా
కనికరం చూపే పరిపక్వత అతణ్ణి
మహాత్ముణ్ణి చేసింది….అతడికి
ఆయుధాలతో,డబ్బుతో, కుట్రలతో,
పనిలేదు…సత్యశోధన, ధర్మాచరణ,
దండనీతిని ఎదుర్కొనే సహనం…..
ఇవే అతడి బలం, బలగం!
అవినీతి, కులమత ప్రాంత విభేదాలు,
స్త్రీ హింస లేని దేశాన్ని నిర్మించడమే
స్వాతంత్య్ర లక్ష్యమని ఆయన
మనకిచ్చిన సందేశం, సందేహాస్పదమై
నేడు మనల్ని వెక్కిరిస్తూనే వుంది…!!?
(నేడు గాంధీ జయంతి….)

– భీమవరపు పురుషోత్తమ్‌
ఇన్నీస్‌ ‌పేట బ్రాంచ్‌, ‌రాజమహేంద్రవరం
:9949800253

Leave a Reply