Take a fresh look at your lifestyle.

‘‌దళిత బంధు’ ప్రారంభోత్సవం ప్రచార ఆర్భాటమా?

డాక్టర్‌ ‌బి.ఆర్‌ అం‌బేద్కర్‌ ‌కుల నిర్మూలన అనే అంశాన్ని ప్రస్తావిస్తూ కులం పునాదుల మీద ఒక జాతిని కాని నీతిని కాని నిర్మించలేము అనీ కుల నిర్మూలన అంతిమ పరిష్కారం అని హెచ్చరించాడు. కానీ స్వతంత్ర భారతంలో 75 ఏళ్లుగా అస్పృశ్యత వివక్షత దళితులపై దాడులు నిర్వహించగా కొనసాగిస్తున్న ఈ సమాజంలో ప్రభుత్వం తన అవకాశం కోసమే ఈ సంఘటనను ఉపయోగించుకున్న తప్ప దళితులపైన ప్రేమతో ఉదాహరణతో ఏ కార్యక్రమాలు ఇంతవరకు చేపట్టలేదు అనేది నగ్నసత్యం. దళిత బంధు పథకం కింద దళితులకు 10 లక్షల రూపాయల నగదు ఇచ్చే కార్యక్రమాన్ని సోమవారం హుజురాబాద్‌ ‌నియోజకవర్గ కేంద్రానికి సమీపంలో గల చర్లపల్లి దళితవాడలో ముఖ్యమంత్రి ప్రారంభించిన విషయం తెలిసిందే . పథకాన్ని ప్రారంభిస్తూ గత సంవత్సరం క్రితమే ఈ పథకం ప్రారంభించవలసి ఉండేదనీ .. గత 25 సంవత్సరాలుగా దళితుల గురించి తాను ఆలోచిస్తున్నట్లు చెప్పడాన్ని దళితుల తో పాటు సమాజం యావత్తూ ఆలోచించవలసిన అవసరం ఉన్నది. ఇది ప్రభుత్వ కార్యక్రమం కాదని మహా ఉద్యమం అని చెప్పడంలో విశ్వాసము లేని కారణంగా దశాబ్దము కిందకి తిరిగి వెళ్ళవలసి వస్తుంది. తెలంగాణ మలిదశ ఉద్యమ కాలంలో రాష్ట్రం ఏర్పడితే తొలి ముఖ్యమంత్రి దళితుడే నని తాను కావాలి కుక్కలా ఉండి ప్రజల కోసం పని చేస్తానని దళితులకు 3 ఎకరాల భూమి తప్పనిసరి చేస్తామని అలాగే డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇళ్లను సమకూరుస్తామని ఇచ్చిన హామీలను ప్రభుత్వం మరచిన ప్రజలు దళిత సంఘాలు దళిత ప్రజానీకం మరవలేదు.

అనాదిగా అనగా రుణ వర్గమైన దళితులకు అనేక సౌకర్యాలు కల్పించడంతోపాటు రాజ్యాధికారాన్ని కట్టబెట్టే డంలో కూడా ఏ వర్గానికి అభ్యంతరం లేదు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల ముఖ్యమైన రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోవాలని కి అనాదిగా జరుగుతున్నటువంటి ప్రయత్నాలను ఈ చీలిక వాదం తాకట్టు పెట్టడమే అవుతుందని బహుజనుల ఆవేదన మాత్రమే. ఇప్పటి దళిత మేధావులు ఆలోచించి సబ్బండ వర్ణాలు ఏకం చేసి మన వోటు అనే ఆయుధంతో ద్వారా రాజ్యాధికారానికి చేరువ కావడమే మన ముందున్న తక్షణ కర్తవ్యం. ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన ప్రధాన వాగ్దానాలను పక్కన పెట్టడంలో ఔచిత్యం ఏమిటో ఎందుకు రాజీ పడుతున్నారో ప్రజానీకానికి సమాధానం చెప్పుకోవలసిన అవసరం ఉన్నది. డిమాండ్‌ ‌చేసే స్థాయి నుండి యాచక స్థాయికి దిగజారడం అని లోకోక్తికి మౌనంగా ఉండడం మరింత బలాన్ని చేకూర్చే నట్లు అవుతుంది. దళిత సంఘాలు రాజీ పడడం ద్వారా బహుజన ఉద్యమం ఇది తీవ్రమైన నష్టం జరిగే అవకాశం ఉంది .కనుక ఇదే సందర్భంలో ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు కూడా ప్రజాధనం లో తమ వాటాను సాధించే క్రమంలో డిమాండ్‌ ‌చేయడం ద్వారా మాత్రమే మన హక్కులను రక్షించుకోగలరు. ఆత్మ గౌరవాన్ని నిలబెట్టుకుని ఉమ్మడి ఉద్యమాన్ని బలోపేతం చేయగలరు.

తెలంగాణ రాష్ట్రంలో దళిత బంధు ప్రారంభించక ముందే పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్రానికి చెందిన పార్లమెంటు సభ్యులు దేశవ్యాప్తంగా ఈ పథకాన్ని అమలు చేయాలని డిమాండ్‌ ‌చేయడంలో అర్థమే లేదు. పైగా ఈ పథకాన్ని అమలు చేయమని అనడం ద్వారా కుల వివక్ష, అస్పృశ్యతను కొనసాగించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు గానే భావించవలసి ఉన్నది. పాలకులకు చిత్తశుద్ధి గనుక ఉంటే సామాజిక స్పృహ ,సామాజిక బాధ్యతతో సమాజాన్ని విశ్లేషించే క్రమంలో మానవ అభివృద్ధి సాధించడానికి మార్గాలను నిపుణులు అయినటువంటి ఆర్థికవేత్తల మేధావులతో చర్చించవలసిన అవసరం ఉంది. గతంలో ప్రతిపక్షాలతో సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకున్న ఆచారం లేదా సాంప్రదాయం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉండేది .కానీ నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొరోనా వంటి భయంకరమైన సందర్భాలు ఉన్నప్పటికీ కీలక అంశాల విషయంలోనూ ఏనాడు కూడా ప్రతిపక్షాలను సంప్రదించ లేదు. పైగా ప్రతిపక్షాలు లేని సమయంలో చట్టసభలలో బిల్లులను పాస్‌ ‌చేసుకోవడం ఎంత అప్రజాస్వామికం…

రాష్ట్రంలో గత ఏడు సంవత్సరాలుగా ఏనాడు కూడా దళితుల సాధికారత గురించి ఆలోచించి అమలు చేసిన సందర్భం లేదు. పైగా ఎస్సీ సబ్‌ ‌ప్లాన్‌ ‌నిధులు కూడా ఖర్చు చేయకుండా దాటవేసి మెజారిటీ ప్రజా అనేకమైన బీసీ వర్గానికి ఏటా 25 వేల కోట్లు బీసీ సబ్‌ ‌ప్లాన్‌ ‌కింద ఖర్చు చేస్తామని గత రెండు వేల పదిహేడు లో హామీ ఇచ్చిన ప్రభుత్వం ఈనాడు కూడా అమలు చేయకపోవడం ని ప్రశ్నించకపోతే ఎలా? మరొకవైపు ఈ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా గల 17 లక్షల దళిత కుటుంబాలకు అమలు చేస్తానని ముఖ్యమంత్రి చెప్పడంలో విశ్వసనీయత ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు. హుజురాబాద్‌ ‌లో ఉప ఎన్నిక జరగనున్న వేళ ప్రభుత్వం అతి ఉత్సాహంతో ఎన్నికల కోసమే ఇలాంటి వేర్పాటు పథకాలను అక్కడే ప్రారంభించడం రాజ్యాంగ ఉల్లంఘన కిందికే వస్తుంది. న్యాయస్థానాలు కానీ, గవర్నర్‌, ‌రాష్ట్రపతి వ్యవస్థ ఇలాంటి విషయాల పట్ల నిర్మోహమాటంగా హెచ్చరించే వలసిన అవసరం ఎంతగానో ఉన్నది .అప్పుడే సామాజిక స్పృహతో ఆర్థిక ప్రాతిపదికన సమాన అవకాశాలు మెరుగు పరిచే సమసమాజ స్థాపన దిశగా ప్రభుత్వాలు ముందడుగు వేస్తాయి ప్రశ్నించే వాడే లేకుంటే బానిసత్వం తో తల ఊపితే ప్రభుత్వాలు రాజకీయ పార్టీలు ప్రజల పైన స్వారీ చేస్తాయి.. ఇది ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరం.

దళిత బంధు కార్యక్రమ ప్రారంభోత్సవ సందర్భంగా ముఖ్యమంత్రి రైతుబంధు ఎంత గొప్పదో అంత కంటే గొప్ప పథకమని దీనిని కొనియాడారు. ఇప్పటికే రైతుబంధు కార్యక్రమంలో దళితుల్లో 95 శాతానికి భూమి లేకపోతే ఆ ప్రయోజనం ఆ వర్గాలకు చేరడం లేదు. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల లో కూడా భూములు ఉన్న వారి శాతం అంతంత మాత్రమే. అలాంటప్పుడు రైతుబంధు సామాన్యుల పథకం ఎలా అవుతుంది. ఏటా 14 వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు రైతుబంధు ఖర్చు చేస్తూ ఉంటే పేద అట్టడుగు వర్గాలకు భూమి లేని కారణంగా ఏ మాత్రం అందకపోవడం ప్రభుత్వాలు ఆలోచించాలి. ఇతర దళిత బందులో ముఖ్యంగా ఉద్యోగాలు ఉన్న కుటుంబాలతో పాటు సంపన్న వర్గాలు కూడా ఈ ప్రయోజనం చేకూరుతుందని ప్రకటించడంలో శాస్త్రీయత లేదని అనేక మంది అభిప్రాయపడుతున్నారు. సామాజిక హోదాను బట్టి విభిన్న వర్గాలకు సబ్‌ ‌ప్లాన్‌ ‌నిధుల కింద ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడం లో తప్పులేదు. కానీ నగదు బదిలీ ప్రవేశపెట్టి అట్టు నిధులు దుర్వినియోగం అయ్యేవిధంగా దళితులను ప్రలోభపెట్టడం పూర్తి స్థాయిలో అమలు చేయకుండా ప్రచార ఆర్భాటం గా మారే అవకాశం ఉందని అనేక మంది అనుమాన పడుతున్నారు.
– వడ్డేపల్లి మల్లేశము, 9014206412

Leave a Reply