Take a fresh look at your lifestyle.

పేదరిక నిర్మూలన అంత మాయేనా…!

“మోదీ ప్రభుత్వం వచ్చాక కార్పొరేట్ పన్నును గణనీయంగా తగ్గించి పరోక్ష పన్నుల నిత్యవసర సరుకులు పెట్రోల్, డీజిల్ పై భారీగా పెంచింది. దీంతో సామాన్యులు జీవనం సాగించడమే కష్టంగా మారింది. దేశ సంపద కొంతమంది దగ్గరే కేంద్రీకృతమై ఉందని నివేదికలు చెప్పుతున్నాయి 60 ఏండ్ల క్రితం (1961) లో జాతీయ సంపదలో శతకోటిశ్వర్ల వాటా 11.9 శాతం.. ధనికుల వాటా 43.2 శాతం. పేదరికంలో దిగువన ఉన్న 50 శాతం ప్రజల వాటా 12.3 శాతం. 60 ఏండ్ల తర్వాత (2020) లో శత కోటిశ్వర్ల సంపంద 42.5 శాతానికి చేరుకుంది. ధనికుల వాటా 74.3 శాతానికి పెరిగింది. అదే పేదరికంలో ఉన్న పేద ప్రజల వాటా 2.8 శాతానికి పడిపోయిదని ‘ద ఇండియా’ ఫోరం వారి నివేదిక ప్రస్తావించింది.”

దశాబ్దాల స్వాతంత్ర్య భారత దేశంలో నేటికి పేదరిక నిర్మూలన సాధ్యం కాలేదు ప్రభుత్వాలు ఎన్ని మారినా శాస్త్ర సాంకేతిక రంగంలో ప్రపంచ దేశాలతో పోటీ పడి అభివృద్ధి లో పరుగులు పెడుతున్న సామాన్యుల బతుకులు మాత్రం మారడం లేదు దేశాన్ని దశాబ్దాలు పరిపాలించిన కొన్ని పార్టీలు దేశ సంపదను దోచుకుని విదేశాలకు తరలించడం స్విస్ బ్యాంకుల్లో వేల కోట్ల నల్ల ధనాన్ని దాచిన జాతీయ నాయకులు మళ్లీ ప్రజల్లోకి వచ్చి దేశానికి సేవ చేశామని ప్రగల్భలు పలుకుతున్నారు. గత పాలకుల శాపమే నేటికి పేదరికం వేదిస్తుందని కేంద్ర ప్రభుత్వం ఆరోపిస్తుంది. పేదరిక నిర్మూలకై ఏ విధంగా ముందుకు పోవాలని కేంద్రానికి ఇప్పటికీ ఒక స్పష్టత లేదు. రాజకీయ లబ్ధి కోసం పేదరిక నిర్మూలకై ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఆచరణలోకి తీసుకు రాలేక పోయారు ఒక వేళ కొన్ని వచ్చినా నిజమైన అర్హుల వరకు చేరడం లేదు. ఈ మధ్య నీతి అయోగ్ బహుముఖ పేదరిక సూచీ (ఏంపిఐ) నివేదికలో అత్యంత పేద రాష్ట్రం బీహార్ అని ఆ రాష్ట్ర జనాభా లో సగం మంది పేదరికం లో మగ్గుతున్నారని సూచించింది కనీస అవసరాలకు నోచుకోని వారు బీహార్ లోనే ఎక్కువ శాతం ప్రజలు ఉన్నారని అత్యధిక పోషకాహార లోపం తో భాదపడుతున్న ప్రజల శాతం బీహార్ లోనే ఎక్కువ ఉందని నివేదిక వెల్లడించింది ఈ నివేదిక ప్రకారం అత్యధికంగా బీహార్ లోనే 51.91 శాతం పేద ప్రజలు ఉన్నారు దీని తర్వాత 42.16 శాతం జార్ఖండ్ 32.67 శాతం ఉత్తర్ ప్రదేశ్ వరుసగా రెండు మూడు స్థానాల్లో ఉన్నాయి మధ్య ప్రదేశ్ లో 36.65 శాతం, మేఘాలయ 32.67 శాతం పేదలు ఉన్నారు తెలంగాణ రాష్ట్ర జనాభాలో 13.74 పేదలున్నారు ఈ జాబితాలో తెలంగాణ 18 వ స్థానంలో నిలిచింది ఏపిలో 20 వ స్థానాల్లో కొంత మెరుగ్గా ఉన్నాయి ఏపిలో పేదలు 12.31 శాతం బీదవారు ఉన్నారు పోషకాహారంతో భాదపడుతున్న వారు తెలంగాణ లో 31.10 శాతం ఉండగా ఏపిలో 26.38 శాతం ఉన్నారు శిశువులు యవ్వన దశలో మరణాలు ఏపిలో 1.82 శాతం తెలంగాణ లో 1.38 శాతం సంభవిస్తున్నాయి కావున అత్యంత పేదరికం తక్కువ ఉన్న రాష్ట్రం కేరళ అక్కడి జనాభాలో 0.71 శాతం మాత్రమే పేదరికంలో ఉన్నారు తర్వాత సిక్కిం 3.62 శాతం, తమిళనాడు 4.89 శాతం, పంజాబ్ 5.59 శాతం నిలిచాయి. కేంద్ర పాలిత ప్రాంతాలలో అత్యధిక పేదరికం ఉన్న ప్రాంతం దాద్రా నగర్ హైవేలీ 27.36 శాతం కాగా అతి తక్కువ పేదరికం ఉన్న ప్రాతం పుదుచ్చేరి 1.72 శాతం ఢిల్లీలో 4.79 శాతం పేదలున్నారు బీహార్ తర్వాత జార్ఖండ్, మధ్య ప్రదేశ్ ఉత్తర్ ప్రదేశ్ వంటి రాష్ట్రాలు అత్యధిక పోషకాహార లోపంతో భాదపడుతున్నాయి. దీనికి తోడు దేశంలో కొరోనా ప్రభావం దేశంలో అసమానతలు పెంచిందని ప్యూ రీసర్చ్ సెంటర్ (మార్చి 2021) కూడా తెలిపింది. అదనంగా మరో 7.5 కోట్లమంది పేదరికం లో కూరుకుపోయారని మధ్య తరగతి ప్రజల్లో 3.2 కోట్ల మంది ఉన్నారని పేర్కొంది.

ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 139 కోట్ల మంది పేదరికంలో మగ్గుతున్నారు. అందులో 22.7 కోట్ల మంది భారతీయులే ఉన్నారని ఐక్యరాజ్యసమితి నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు పరం చేస్తూ జాతీ సంపదను కొంతమందికి పరిమితం చేస్తుంది. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలల్లో కూడా పేదరికాని నిర్మూలించలేక పోతుంది. దేశంలో పేదరికం ఏ స్థాయిలో ఉందో మనం లాక్ డౌన్ సమయంలో చూశాము. ఉపాధి కోసం వివిధ రాష్ట్రలకు గల్ఫ్ దేశాలకు వలస పోయిన వారు కొరోనా సమయంలో వలస కార్మికులు పడిన ఇబ్బందులు చూశాము. భారత దేశం ప్రతి ఆరుగురి పేదల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ సామాజిక వర్గలకు చెందిన వారే ఉన్నారు. భారత దేశంలో కనీస అవసరాలు తీర్చుకోవడానికి జీవన పోరాటం చేస్తున్నారు పేదలు. ప్రపంచ బిలీనియర్లు ఉన్న మూడవ అతి పెద్ద దేశం ఇండియా దశాబ్దాల నుండి ప్రభుత్వాలు మారిన పేదరికం పోవడం లేదు.

ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థను చిన్నభినం చేసిన కొరోనా భారత దేశం పై కూడా ప్రభావం చూపింది. అందువల్లనే కొరోనా వల్ల 60 శాతానికి పెరిగింది పేదరికం. మోదీ ప్రభుత్వం వచ్చాక కార్పొరేట్ పన్నును గణనీయంగా తగ్గించి పరోక్ష పన్నుల నిత్యవసర సరుకులు పెట్రోల్, డీజిల్ పై భారీగా పెంచింది. దీంతో సామాన్యులు జీవనం సాగించడమే కష్టంగా మారింది. దేశ సంపద కొంతమంది దగ్గరే కేంద్రీకృతమై ఉందని నివేదికలు చెప్పుతున్నాయి 60 ఏండ్ల క్రితం (1961) లో జాతీయ సంపదలో శతకోటిశ్వర్ల వాటా 11.9 శాతం.. ధనికుల వాటా 43.2 శాతం. పేదరికంలో దిగువన ఉన్న 50 శాతం ప్రజల వాటా 12.3 శాతం. 60 ఏండ్ల తర్వాత (2020) లో శత కోటిశ్వర్ల సంపంద 42.5 శాతానికి చేరుకుంది. ధనికుల వాటా 74.3 శాతానికి పెరిగింది. అదే పేదరికంలో ఉన్న పేద ప్రజల వాటా 2.8 శాతానికి పడిపోయిదని ‘ద ఇండియా’ ఫోరం వారి నివేదిక ప్రస్తావించింది. కొరోనా సమయంలో కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ మహమ్మారిని ఎందుర్కోవాలంటే పోషకాహారం తీసుకుని శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవాలని సూచించింది. కానీ కనీసం పూటకు లేని వాళ్ళకు పోషకాహారం ఎలా సాధ్యపడుతుంది..? పేదరికానికి తోడైన కొరోనా వల్ల ప్రైవేటు ఉద్యోగులు, చిరు వ్యాపారులు అనేక ఇబ్బందులు పడుతూ అప్పుల ఊబిలో కూరుకు పోయిన కుటుంబాలు పిల్లలను చదువు దూరం చేస్తూ బాలకార్మికులుగా మారుస్తున్నారు. దాంట్లో ఎక్కువ గ్రామీణ ప్రాంతానికి చెందిన జీవనోపాధికి వలస వచ్చిన వారి పిల్లలు ఉన్నారు. పేదరికంలో ఉన్న వారి పిల్లలు పోషకాహారం లోపంతో మానసిక, శారీరకంగా వృద్ధి చెందలేక పోతున్నారని నివేదికలు తెలుపుతున్నాయి.

మిద్దె సురేష్
టిఆర్ఎస్వీ నాయకులు
9701209355

Leave a Reply