Take a fresh look at your lifestyle.

సైదాబాద్‌ ‌చిన్నారి విషయంలో ఇంత నిర్లక్ష్యమా?

  • నిందితుడిని పట్టుకున్నామని కెటిఆర్‌ ఎలా చెప్పారు
  • తప్పుడు సమాచారమిచ్చిన అధికారిని ఎందుకు ఉపేక్షిచారు
  • డ్రగ్స్ ‌మాఫియాగా తెలంగాణ
  • మత్తులో జోగుతున్న యువతతో అకృత్యాలు
  • డ్రగ్స్ ‌కేసును ఎవరి కోసం అణగదొక్కాలని చూశారు
  • కెటిఆర్‌ ‌ట్వీట్‌పై మండిపడ్డ పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి
  • బాధిత కుటుంబాన్ని సిఎ కెసిఆర్‌, ‌మంత్రులు ఎందుకు పరామర్శించరు : ఎంపి కోమటిరెడ్డి వెంకట్‌ ‌ రెడ్డి

సైదాబాద్‌ ‌చిన్నారి అత్యాచారం కేసు నిందితుడు గత ఆరు రోజులుగా తప్పించుకు తిరుగుతుండడంతో రాష్ట్ర ప్రభుత్వంతో పాటు పోలీసులపై విమర్శలు చుట్టుముడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే టీపీసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. ముఖ్యంగా చిన్నారిపై అత్యాచారం జరిగిన తర్వాత మంత్రి కేటీఆర్‌ ‌చేసిన ట్వీట్‌పై ఆయన విరుచుకుపడ్డాడు. నిందితుడు పోలీసు కస్టడీలో ఉన్నాడని, నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు చేబట్టాలని ట్వీట్‌ ‌చేశారని, అయితే నిందితుడు పోలీసు కస్టడీలో ఉన్నట్టు చెప్పిన అధికారి ఎవరని ఆయన ప్రశ్నించాడు. తప్పుడు సమాచారం ఇచ్చిన అధికారిని సస్పెండ్‌ ‌చేయాల్సిన అవసరం లేదా అంటూ ఫైర్‌ అయ్యారు. ప్రభుత్వం నిర్లక్ష్యంతో రాష్ట్రంలో మత్తులో జోగుతుందని ఆయన అన్నారు. సైదాబాద్‌లో గంజాయితో పాటు గుడుంబా విచ్చల విడిగా అమ్ముతున్నారని అయినా.. రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర పోతుందంటూ ఆయన విమర్శించారు.

తెలంగాణలో జరుగుతున్న అత్యాచారాలకు మద్యమే కారణమని..వ్యసనపరులకు రాష్ట్రం స్వర్గధామంగా మారిందని పీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో మద్యం అమ్మకాలు రెట్టింపయ్యాయన్నారు. సైదాబాద్‌ ‌బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని మంత్రి కేటీఆర్‌ ఐదు రోజుల కిందే ట్వీట్‌ ‌చేశారన్నారు. ఐదు రోజుల తర్వాత నిందితుడు దొరకలేదని పోలీసులు చేతులెత్తేశారని రేవంత్‌ ‌పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్‌ ‌హోష్‌లో ఉండే ట్విట్‌ ‌చేశారా? అని ప్రశ్నించారు. ఉదయం 5 గంటల వరకు పబ్‌లు నడుస్తుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కెటిఆర్‌ ‌దగ్గరి బంధువులే పబ్‌లు నడుపుతున్నారన్నారు. టాలీవుడ్‌ ‌డ్రగ్స్ ‌కేసులో విచారణ ఏమైందని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా యువత డ్రగ్స్ ‌మత్తులో మునిగి పోతుందని చెప్పిన ఆయన రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ ‌కేసును ముందుకు సాగకుండా అడ్డుపడుతుందని ఆరోపణలు చేశారు.

కేంద్ర ప్రభుత్వ సంస్థలు విచారణ చేపడుతున్నా వారికి కావాల్సిన సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం లేదని, అందుకే కేసు విచారణ సంవత్సరాలుగా కొనసాగుతుందని అన్నారు. విచారణ కొనసాగితే ఎవరు వెలుగులోకి వొస్తారని సీఎం కేసిఆర్‌తో పాటు కేటిఆర్‌ ‌భయపడుతున్నారని ఆయన ప్రశ్నించారు. డ్రగ్స్ ‌విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అడ్డుపడుతుందో స్పష్టం చేయాలని ఆయన డిమాండ్‌ ‌చేశారు. ఈ కేసులో విచారణ జరుగుతున్న సమయంలోనే విచారణ అధికారిగా ఉన్న అకున్‌ ‌సబర్వాల్‌ను ఎందుకు బదిలీ చేశారని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం మత్తులో ఉండడంతో విచ్చలవిడిగా డ్రగ్స్ ‌మాఫియా తన కార్యకలాపాలను కొనసాగిస్తుందని దుయ్యబట్టారు.

యువత భవిష్యత్‌పై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదని ఆయన మండిపడ్డారు. డ్రగ్స్ ‌మాఫియాతో హైదరాబాద్‌లో విష సంస్కృతికి అడ్డాగా మారుతుందని అన్నారు. 2017లో విచారణ చేపట్టిన డ్రగ్స్ ‌కేసును అటకెక్కించడంతో కేంద్ర ప్రభుత్వ సంస్థలు రంగంలోకి దిగాయని అయితే వాటికి పూర్తిస్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని అన్నారు. అందుకే తాము కేంద్ర సంస్థలకు ఫిర్యాదు చేశామని చెప్పారు. మద్యంతో పాటు డ్రగ్స్ అమ్మకాలకు హైదరాబాద్‌ అడ్డాగా మారుతుంటే… విశ్వనగరంగా ఎలా మారుతుందని ఆయన ప్రశ్నించారు. మరోవైపు ఈ నెల 17న నిర్మల్‌కు రానున్న హోంమంత్రి అమిత్‌ ‌షాను కూడా కలిసి సీఎం కేసిఆర్‌ అ‌క్రమాలపై ఫిర్యాదు చేస్తామని అన్నారు. అయితే ఆయన అపాయింట్‌’‌మెంట్‌ను ఇప్పించాలని మంత్రి కిషన్‌రెడ్డిని కోరారు. అప్పుడే రాష్ట్ర ప్రభుత్వంపై  బీజేపీ వైఖరి స్పష్టం అవుతుందని ఆయన అన్నారు.

బాధిత కుటుంబాన్ని సిఎ కెసిఆర్‌, ‌మంత్రులు ఎందుకు పరామర్శించరు : ఎంపి కోమటిరెడ్డి వెంకట్‌ ‌రెడ్డి
ఆరేళ్ళ పసికందుపై ఒక రాక్షసుడు అత్యాచారం చేసి హత్య చేయడం దారుణమని కాంగ్రెస్‌ ‌నేత కోమటిరెడ్డి వెంకట్‌ ‌రెడ్డి అన్నారు. ఈ ఘటనతో తెలంగాణ పరువు పోయిందన్నారు. నిందుతున్ని పట్టిస్తే 10లక్షలు ఇస్తామని ప్రకటించడం హాస్యాస్పదమన్నారు. పోలీసులున్నది గాడిదలు కాయడానికా..?అంటూ ప్రశ్నించారు. చిన్నారి మృతికి ఆ రాక్షసుడు ఎంత కారణమో పోలీసులు నిర్లక్షయం కూడా అంతే కారణమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. చిన్నారి కుటుంబ సభ్యులను పరామర్శించకడానికి సీఎం కెసిఆర్‌, ‌దత్తత తీసుకున్న కేటీఆర్‌, ‌డవ్మి హోంమంత్రి మహ్మూద్‌ అలీ, గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ ‌రాకపోవడం దారుణమని కోమటిరెడ్డి వ్యాఖ్యా నించారు. తల్లి పిర్యాదు చేసిన వెంటనే డోర్‌ ఓపెన్‌ ‌చేసి ఉంటే అమ్మాయి బ్రతికి ఉండేదని వ్యాఖ్యానిం చారు.

కేటీఆర్‌ ‌ప్రచారాల మంత్రి, మూర్ఖుడు అంటూ ఆయన మండిపడ్డారు. బతుకమ్మ అంటూ తెలంగాణ అంతా తిరిగే కవిత ఇక్కడికి ఎందుకు రాలేదని ప్రశ్నించారు. మానవత్వం ఉంటే కేటీఆర్‌ ఇక్కడికి రావాలన్నారు. దళిత గిరిజన బిడ్డలని రాలేదా, కేటీఆర్‌ ‌సమాధానం చెప్పాలన్నారు. అమ్మాయి చనిపోయి బాధలో ఉంటే డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇల్లు ఇస్తామని చెప్పడం బాధాకరమన్నారు. చదువుకున్న కలెక్టర్‌ ‌మాట్లాడే మాటలేనా ఇవంటూ ప్రశ్నించారు. సినీ యాక్టర్‌ని పరామర్శించే తలసాని శ్రీనివాస్‌ ఇక్కడికి ఎందుకు రాలేదని కోమటి రెడ్డి ప్రశ్నించారు. అయన అసలు మంత్రేనా అంటూ వ్యాఖ్యానించారు. దిశ టైం లో చేసినట్లే చిన్నారి విషయంలో కూడా వెంటనే శిక్షించాలని డిమాండ్‌ ‌చేశారు. ఆరేళ్ల చిన్నారిపై హత్యాచార ఘటన అమానుషమని కాంగ్రెస్‌ ఎం‌పీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. బుధవారం బాధిత కుటుంబాన్ని ఆయన పరామర్శించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 24గంటల్లోగా నిందితుడి పటుకుని శిక్షించాలని డిమాండ్‌ ‌చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగిందన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం లేదని చెప్పేందుకు ఇది నిదర్శమని విమర్శించారు. పోలీసులకు అవార్డులు వస్తున్నాయని గొప్పలు చెప్పుకుంటున్నారని.. డబ్బులతో అవార్డులు కొంటున్నారని ఎద్దేవా చేశారు.

Leave a Reply