Take a fresh look at your lifestyle.

కేసీఆర్‌ ‌చేసిన తప్పిదాలను ప్రజలపైకి నెట్టే ప్రయత్నం?

తెలంగాణ కాంగ్రెస్‌ ‌పార్టీ ప్రచార కమిటీ ఛైర్‌పర్సన్‌, ‌మెదక్‌ ‌మాజీ ఎంపి ఎం.విజయశాంతి అలియాస్‌ ‌రాములమ్మ మరోసారి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ ‌రావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె సోషల్‌ ‌మీడియాలో ఓ పోస్టు చేస్తూ… జీహెచ్‌ఎం‌సీ పరిధిలో ప్రతి రోజూ కరోనా పాజిటివ్‌ల సంఖ్య పెరగడానికి కారణం ఏమిటి? అని నిలదీశారు.  సుమారు 50 రోజులుగా ప్రజలు నిజాయితీగా లాక్‌డౌన్‌ ‌పాటించారు కదా? పాజిటివ్‌ల పెరుగుదలకు కేవలం వైన్‌ ‌షాపులే కారణమైతే వాటిని మళ్లీ మూసివేయాలన్నారు. సరైన సంఖ్యలో పరీక్షలు ఇప్పటివరకూ చేయకుంటే ఆ నిజం ఒప్పుకోండి.

అన్ని త్యాగాలు చేసిన ప్రజలు అసలు సమస్య అర్థం కాక సతమతమవుతున్నారు. వైన్స్ ‌షాపులు తెరవడమే ఈ పరిస్థితికి కారణమైతే, అనేక ఇతర రాష్ట్రాల్లో కూడా ఇదే స్థాయిలో పెరుగుదల నమోదై ఉండాలి కదా?అని ప్రశ్నించారు.అయితే, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌తమ తప్పిదాలను ప్రజల అలవాటు మీదకు నెట్టే ప్రయత్నమేదో చేస్తున్నట్టు కనిపిస్తోందనీ విజయశాంతి తన పోస్టులో అనుమానాన్ని వ్యక్తం చేశారు.

Leave a Reply