Take a fresh look at your lifestyle.

లింగ సమానత్వం, మహిళా సాధికారత అందని ద్రాక్షేనా ?

లింగ సమానత్వం ఒక ప్రాథమిక హక్కు అని, పురుషులతో సమానంగా స్త్రీలు కూడా సమాజాభివృద్ధిలో పాలుపంచుకుంటారని అర్థనారీస్వరుడి రూపమే వివరిస్తున్నది. మహిళాభ్యుదయంతోనే ప్రపంచ శాంతి, సౌభాగ్యాలు, సుస్థిరాభివృద్ధి సుసాధ్యమని గమనించిన ఐరాస సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు-2030 జాబితాలో 5వ అంశంగా ‘లింగ సమానత్వం – మహిళా సాధికారత’ను తీసుకొని ప్రపంచదేశాలకు ఐరాస మార్గదర్శకం చేస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా 750 మిలియన్ల మహిళలు/బాలికలు 18 ఏండ్లకు ముందే వివాహం చేసుకోవడం, 200 మిలియన్ల బాలికలు సున్తీ దురాచారాలను భరించడం విచారకరం.

2015లో ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ తీసుకున్న ఏకగ్రీవ తీర్మానం ప్రకారం ‘2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా సానుకూల సుస్థిరాభివృద్ధి మార్పులు’ చేపట్టాలనే సదుద్దేశంతో 17 ‘ఐరాస సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు-2030’ని నిర్ణయించారు. ఈ 17 లక్ష్యాలను ‘2030 ఎజెండా’ అని కూడా పిలుస్తాం. పేదరికం, ఆకలి చావులు, ఆరోగ్యం, విద్య, పర్యావరణ మార్పులు, లింగ సమానత్వం – మహిళా సాధికారత, సురక్షిత నీరు, పారిశుధ్యం, శక్తి వనరులు, పట్టణీకరణ, భూతాపం, సామాజిక న్యాయం లాంటి ప్రధాన అంశాలు తీసుకోబడినవి.

ఐరాస సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు-2030లో నాలుగవ లక్ష్యంగా ‘నాణ్యమైన విద్య (క్వాలిటీ ఎడ్యుకేషన్‌)’ అనబడే అంశం అధ్యయనం చేయబడుతున్నది. సామాజిక న్యాయం, అసమానతలు, పేదరికం, లింగ భేదం, ఆకలి చావులు, నిరుద్యోగం లాంటివ ప్రత్యక్ష సంబంధాన్ని కలిగి ఉంటుంది. గత దశాబ్దకాలంగా విద్యారంగంలో ప్రపంచమానవాళి ఎంతో ముందడుగు వేసింది. లింగ సమానత్వం ఒక ప్రాథమిక హక్కు అని, పురుషులతో సమానంగా స్త్రీలు కూడా సమాజాభివృద్ధిలో పాలుపంచుకుంటారని అర్థనారీస్వరుడి రూపమే వివరిస్తున్నది.

మహిళాభ్యుదయంతోనే ప్రపంచ శాంతి, సౌభాగ్యాలు, సుస్థిరాభివృద్ధి సుసాధ్యమని గమనించిన ఐరాస సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు-2030 జాబితాలో 5వ అంశంగా ‘లింగ సమానత్వం – మహిళా సాధికారత’ను తీసుకొని ప్రపంచదేశాలకు ఐరాస మార్గదర్శకం చేస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా 750 మిలియన్ల మహిళలు/బాలికలు 18 ఏండ్లకు ముందే వివాహం చేసుకోవడం, 200 మిలియన్ల బాలికలు సున్తీ దురాచారాలను భరించడం విచారకరం. ప్రపంచంలోని 18 దేశాల్లో మహిళల్ని పనికి అనుమతించక పోవడం, 39 దేశాల్లో అమ్మాయిలకు సమాన ఆస్థి లభించక పోవడం, 49 దేశాల్లో మహిళల హక్కుల ప్రస్తావన చేయకపోవడం వాస్తవమని తెలుస్తున్నది. ప్రపంచంలోని 46 దేశాల పార్లమెంట్స్‌లో 30 కన్న అధికంగా మహిళా ప్రతినిధులు ఉండడం, 52 శాతం వివాహిత మహిళలు తమ నిర్ణయాలను తామే తీసుకునే స్థాయిలో ఉన్నారని తేలింది.

ప్రకృతిలో సగం, మానవాళి జనాభాలో అర్థభాగం, కుటుంబ బండికి తనో చక్కనైన మహిళ పాత్ర సమాజాభివృద్ధిలో మరువలేనిది. నేటి శాస్త్రసాంకేతిక యుగంలో మహిళలు/బాలికల పట్ల వివక్ష కొనసాగుతూనే ఉన్నది. గత దశాబ్దంగా బాలికల విద్యరంగంలో కొంత ప్రగతి సాధించామని, పాఠశాలల్లో బాలికల నమోదు పెరగడం, బాల్యవివాహాలు/బాలకార్మిక వ్యవస్థలు తగ్గడం, ప్రజా ప్రతినిధులుగా పార్లమెంట్‌ ‌నుంచి వార్డు సభ్యురాలి వరకు మహిళల శాతం పెరగడం, లింగ సమానత్వ సాధనకు పలు చట్టాలు అమలు కావడం జరిగింది.

అయినప్పటికీ అనేక సవాళ్ళ నడుమ లింగ సమానత్వం – మహిళా సాధికారతలో రావలసిన మార్పులు రాలేదని, మహిళల పట్ల వివక్ష, రాజకీయ ప్రాతినిధ్యంలో వెనుకంజ, మహిళలపై భౌతిక హింస లేదా అత్యాచార హత్యలు (20 శాతం), ఆర్థిక బానిసత్వం లాంటి పలు సమస్యలు నేటికీ రాజ్యమేలుతూనే ఉన్నాయి. కొరోనా కల్లోలంతో ఆర్ధికం నుంచి ఆరోగ్యం వరకు మహిళలు/బాలికలపై అతి తీవ్రమైన ప్రభావాన్ని చూపింది. ఆన్‌లైన్‌ ‌కారణంగా బాలికలు/విద్యార్థినులు చదువులకు దూరమై, కార్మికులుగా/గృహ పనులకు వినియోగించడం, పోషకాహారం లోపాలు పెరిగాయి. కోవిడ్‌-19 ‌విషకోరల్లో చిక్కిన అసంఘటితవర్గ మహిళలు లైంగిక హింసలకు లోనుకావడంతో పాటు 60 శాతం ఆర్థికంగా కుంగిపోయి పేదరిక పాతాళంలోకి నెట్టబడ్డారని తెలింది. నేటికీ పార్లమెంట్‌లో 25 శాతం, స్థానిక ప్రభుత్వాల్లో 36 శాతం మాత్రమే మహిళలు ఉన్నారు. కరోనా వారియర్లుగా 70 శాతం మహిళలు హెల్త్ ‌కేర్‌ ‌వర్కర్లుగా విశేష కృషి చేయడం చూశాం.

లింగ అసమానతలు పెంచిన కొరోనా దుస్థితుల నుంచి మహిళలు/బాలికలు రికవరీ కావడానికి గౌరవమైన పని కల్పన, ఆర్థిక వెసులుబాటు ప్రయత్నాలు, మహిళాభ్యుదయ కేంద్రంగా సామాజిక-ఆర్థిక ప్రణాళికల్ని సత్వరమే అమలు చేయాల్సి ఉంది. గృహ హింస / భౌతిక లైంగిక అత్యాచారాలను తగ్గించే కఠిన చర్యలతో పాటు సామాజిక-ఆర్థిక భద్రతల కల్పనలు జరగాలి. కోవిడ్‌-19 అనంతర అభివృద్ధి ప్రణాళికలు, వాటి అమలులో మహిళలను పెద్దపీట వేయాలి. 2019 అంచనా ప్రకారం 28 శాతం ప్రపంచ మహిళలు మాత్రమే మేనేజర్‌ ‌స్థాయి ఉద్యోగాల్లో సేవలు అందిస్తున్నారని, నేటికీ ఆడ శిశువు పుట్టకుండా భ్రూణహత్యలు జరుగుతున్నాయని తెలుస్తున్నది. పాఠశాలల్లో బాలికలకు కనీస టాయిలెట్స్ ‌వసతులు లేకపోవడం, కుటుంబాల్లో అమ్మాయిలపై చిన్న చూపు కారణంగా బాలికల విద్య నత్తనడకన జరుగుతోంది. మహిళలు/బాలికలకు ఆరోగ్య రక్షణ కొరవడడం, పోషకాహారలోపం, బాల్య బాలికల వివాహాలు, బాలికల సున్తీ దురాచారాలు పెరగడంతో బాలికల మరణాల రేటు బాలుర కన్న అధికమని విధితం అవుతున్నది. బాలికా విద్య వెనక బడడంతో మహిళా కార్మికులు పెరగడం, సాధికారతక దూరంగా చీకటి బతుకులు గడపడం చూస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా 35 శాతం 15-49 ఏండ్ల మహిళలు భౌతిక/లైంగిక హింసలకు లోను కావడం, 30 ఆఫ్రికా/మిడిల్‌ ఈస్ట్ ‌దేశాల్లో 33.33 శాతం 15-19 ఏండ్ల అమ్మాయిలు సున్తీ దురాచారంతో దీర్ఘకాలిక అనారోగ్యాల బారినపడి బాధప డుతున్నారని తేలింది.

ప్రపంచ మహిళల్లో 13 శాతం మాత్రమే భూహక్కులు కలిగి ఉన్నారు. లింగ సమానత్వ సాధనకు 100 పైగా దేశాలు తమ బడ్జెట్‌లో కేటాయింపులు చేయడం చూస్తున్నాం. 2020 నాటికీ లింగ వివక్షతో కూడిన చట్టాలతో 95కు పైగా దేశాల్లోని మహిళా హక్కులు హరించుకు పోతున్నాయి. మహిళా హింస/రేప్‌లను కట్టడి చేయడానికి 63 శాతం దేశాల్లో సరైన చట్టాలు లేవని తెలుస్తున్నది. నేటికీ మహిళలు 2.5 రెట్లు అధికంగా ఆదాయం లేని గృహ పనుల్లో నిమగ్నం అవుతున్నారు. రాబోయే దశాబ్దంలో 10 మిలియన్ల బాలికలు బాల్యవివాహాల వలలో చక్కవచ్చని తెలుస్తున్నది. బాలికలకు నిర్భంధ ఉచిత విద్య, మహిళా హక్కుల పరిరక్షణ, లైంగిక హింసలను కఠినంగా కట్టడి చేయడం, బాల్య వివాహాలను నిరోధించడం, ప్రజా ప్రతినిధులలో మహిళల శాతాన్ని పెంచడం, ప్రజారోగ్య వసతుల కల్పన, వృత్తి ఉద్యోగాలు/రాజకీయ పదవుల్లో రిజర్వేషన్ల అమలు లాంటి చర్యలతో లింగ సమానత్వ సాధనకు కృషి చేయాలని ఐరాస కోరుతున్నది. ప్రస్తుత డిజిటల్‌ ‌యుగంలో ఐరాస నిర్ణయించిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు-2030లను అధిగమిస్తూ, ప్రపంచ మానవాళి సామాజిక ఆర్థిక ప్రగతితో పాటు భూమిని నివాసయోగ్య గ్రహంగా కాపాడు కుందాం. విశ్వ మహిళా జాతి భద్రత, శాంతి, సౌభాగ్యాల పరిరక్షణకు మనందరం కంకణ బద్దులం అవుదాం.
– డా: బుర్ర మధుసూదన్‌ ‌రెడ్డి
కరీంనగర్‌ – 9949700037

Leave a Reply