Take a fresh look at your lifestyle.

డిజిటల్‌ ‌చదువులు ఆచరణ సాధ్యమెలా!?

“‌ప్రభుత్వ పాఠశాలల్లో 75 రోజుల ఆలస్యంగా ఈ విద్యాసంవత్సరం ప్రారంభమవుతుండగా ప్రయివేట్‌ ‌కార్పొరేట్‌ ‌పాఠశాలల్లో ఫిబ్రవరి లోనే విద్యాసంవత్సరం  ప్రారంభమైంది. నర్సరీ నుండి పదవతరగతి వరకు ఆన్‌ ‌లైన్‌ ‌బోధన సీరియస్‌ ‌గా కొనసాగుతుంది. వేలాది రూపాయల ఆన్‌ ‌లైన్‌ ‌ఫీజుల వసూళ్ళతో కార్పొరేట్‌ ‌విద్యా వ్యాపారం చెలరేగిపోయింది. పదవ తరగతి కి సిలబస్‌ ‌దాదాపు సగంపూర్తయింది. మొదటి రౌండు రివిజన్‌ ‌ప్రారంభమైంది. విద్యార్థుల సామర్థ్యాల సాధనలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ప్రయాణం ఇప్పుడు మొదలయింది. ప్రభుత్వ,ప్రయివేట్‌ ‌పాఠశాలల విద్యార్థులు ఈ విద్యా సంవత్సరం చివరి వరకూ పొందేటి సంసిద్దతల మధ్య, అవగాహనల మధ్య అభ్యసనల మధ్య స్పష్టమైన తేడాలుంటాయనేది సత్యం.ఖచ్చితంగా పరీక్షలల్లో ఉత్తీర్ణతల మధ్య కూడా ఈ తేడాలు ప్రతిబింబిస్తాయనటంలో సందేహం లేదు. సమాజం ముందు ప్రభుత్వ పాఠశాలల ఫలితాలు నిర్వీర్యమైతే ప్రభుత్వ ఉపాధ్యాయుల వైఫల్యాలుగా సమాజం జమకడుతుంది.”

బడి పిల్లలకు డిజిటల్‌ ‌పాఠాలు ప్రారంభించిన తెలంగాణ ప్రభుత్వం కరోనా జాగ్రత్తల విషయంలో తన బాధ్యతలను సంపూర్ణంగా నెరవేర్చినట్టుగా కనిపించటం లేదు. లక్షలాది మంది ఉపాధ్యాయులు విధులు నిర్వహించే చాలా పాఠశాలల్లో ముందు రోజు వరకు కూడా కోవిడ్‌ 19 ‌పరీక్షా కేంద్రాలు నడిచాయి. ఆ పరీక్షా కేంద్రాలను ఎత్తివేయాలనే ఉత్తర్వులు మందురోజే ఆరోగ్య శాఖను చేరాయి. ముందు రోజు సాయంత్రం వరకు కూడా పరీక్షా కేంద్రాల్లో సంబంధిత పరీక్షా పరికరాలు బయటికి తరలించబడలేదు. పరీక్షల కోసం వినియోగించినవైద్య అవశేషాలు పాఠశాల మైదానాల్లో విచ్చల విడిగా పడి కనిపిస్తున్నాయి.గత నాలుగురోజులుగా తెలంగాణ లో విజృంభిస్తున్న కరోనా లెక్కలు చూస్తే పాఠశాలకు పోవాలంటే భయం కలగటం సహజమే..

కోవిడ్‌ -19 ‌సంక్షోభ నేపధ్యంలో పాఠశాలకు భౌతికంగా  హాజరయ్యే ఉపాధ్యాయులకు విధిగా కరోనా పరీక్షలు చేయాల్సిన అవస రముంది.శానిటైజర్లు, మాస్కులు చేతి తొడుగులు ఉపాధ్యాయులకు అందుబాటులో ఉంచాల్సిన అవసరముంది. ప్రతిరోజు పాఠశాలలో సోడియం హైపో క్లోరైట్‌ ‌స్ప్రే చేయించాల్సిన అవసరముంది.ప్రతిరోజు హెడ్‌ ‌మాస్టర్లు,స్థానిక అరోగ్య కేంద్రం ప్రతినిధి పాఠశాలలోని ఉపాధ్యాయుల ఆరోగ్య పరిస్థితి పై నివేదికను ఆరోగ్య మరియు విద్యా శాఖలకు అందచేయాలి. ఇమ్యునిటీ కి సంబంధించి (ప్రికాషనరి) మందులు ఉపాధ్యాయులకు అందుబాటులో వుంచాలి. కరోనా లక్షణాలు కనిపించిన వెంటనే సదరు ఉపాధ్యాయులకు పరీక్షలు నిర్వహించి,విషమించినట్లయితే తక్షణమే కార్పోరేట్‌ ‌వైద్యం అందించాలి.  కోవిడ్‌ -19 ‌చికిత్స కు మందులు లేవు,పదివేల రూపాయల లోపే కార్పొరేట్‌ ‌వైద్యం అందుబాటులో వుందని ఈటెల ప్రకటించారు. అలాంటప్పుడు ఈ కరోనా చికిత్సను ‘‘ఎంప్లాయిస్‌ ‌హెల్త్ ‌స్కీం’’ మరి’’ఆరోగ్య శ్రీ ‘‘పరిధి లోకి తేవాలనే డిమాండ్‌ ‌ను ప్రభుత్వం ఎందుకు నిర్లక్షం చేస్తుందో తెలియపర్చాల్సిన అవసరముంది.

పాఠశాలల్లో నాలుగవ తరగతి సిబ్బంది నియామకం చాలాకాలంగా ప్రభుత్వం విస్మరించింది. ఈ నేపధ్యంలో ఐదేళ్ళుగా తాత్కాలికంగా నియమిస్తున్న సానిటరి, వాచ్‌ ‌మెన్‌ ‌సిబ్బంది పాఠశాలల్లో తక్కువ రేమునరేషన్‌ ‌కు సేవలందిస్తున్నారు. పాఠశాల పరిశుభ్రంగా వుంచటంలో వీరి పాత్రను తీసిపారేయలేము. ఈ విద్యా సంవత్సరం వారి సేవల పునఃనియమాకం పై మార్గదర్శకాల్లో పేర్కొనలేదు. పైగా పంచాయితీ సానిటరి సిబ్బంది సేవలను పాఠశాల పరిశుభ్రత కోసం వినియోగించుకోవాలని ఆదేశించారు. పట్టణ,నగర స్థాయిల్లో నైనా గ్రామ స్థాయిలోనైనా ఇది ఆచరణ సాధ్యమెలా అవుతుందనేది ప్రశ్నార్ధకం.!వీధుల్లో పారిశుధ్యం పనులు పూర్తయ్యే వరకే వారికి సమయం చాలదు,వారు పాఠశాలల పరిశభ్రతను ఎప్పుడు నిర్వహిస్తారు!? చివరకు పాఠశాలల మరుగుదొడ్లను ఉపాధ్యాయులే శుభ్రపరుచుకునే దుస్థితి దాపురించనున్నది.ఈ విద్యాసంవత్సరం లక్షలాది మంది విద్యా వాలంటీర్ల , కాంట్రాక్టు ఇన్‌ ‌స్ట్రక్టర్ల పునః నియమాకంపై మార్గదర్శకాలల్లో ఆదేశాలు ఇవ్వలేదు.

 

విద్యార్థులు పాఠశాలకు రాకూడదని పేర్కొన్నప్పుడు ఉపాధ్యాయంలే ఆవాస ప్రాంతం పర్యటించి వర్క్ ‌షీట్ల హార్డ్ ‌కాపీలను విద్యార్థులను భౌతికంగా కలిసి  ఇవ్వటం,తీసుకోవటం చేయక తప్పదు. క్షేత్ర స్థాయిలో వాస్తవంగా జరుగబోయేది ఇదే! ఉపాధ్యాయులు ఆవాస ప్రాంతాల్లోకి వెళ్ళకుండా కార్యక్రమం విజయవంతం జరుగుతుందనుకుంటే అది భ్రమే అవుతుంది. ఎటుచేసి ఉపాధ్యాయులను కరోనా కోరలకి అప్పగించి డిజిటల్‌ ‌పాఠాల ప్రహసనానికి తెర లేపిన ప్రభుత్వం ఉపాధ్యాయుల ప్రాణాలతో చెలగాటమాడుతుందనేది ఆచరణ ద్వారా తెలియనున్న కఠోర సత్యం!.
విద్యార్థుల భౌతిక హాజరు ద్వారా ప్రత్యక్ష తరగతులకు కేంద్ర ప్రభుత్వం రేపోమాపో మార్గదర్శకాలు విడుదల చేసే అవకాశాలున్నాయి. నిరుపేద ఆవాస ప్రాంతాల నుండే ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు వుంటుందనేది జగమెరిగిన సత్యం. వారు సెక్షన్‌ ‌లవారిగా హాజరైనా కూడా పాఠశాలల్లో  ఇప్పుడున్న మౌలిక సదుపాయాలు చాలవు.తాగునీరు,వాష్‌ ‌రూం,ఫర్నీచర్‌ ‌తరగతిగదులు తదితర సౌకర్యాలు రెట్టింపు అవసరముంటాయి.

ప్రభుత్వ పాఠశాలల్లో 75 రోజుల ఆలస్యంగా ఈ విద్యాసంవత్సరం ప్రారం• ••మవుతుండగా ప్రయివేట్‌ ‌కార్పొరేట్‌ ‌పాఠశాలల్లో ఫిబ్రవరి లోనే విద్యాసంవత్సరం  ప్రారంభమైంది. నర్సరీ నుండి పదవతరగతి వరకు ఆన్‌ ‌లైన్‌ ‌బోధన సీరియస్‌ ‌గా కొనసాగుతుంది. వేలాది రూపాయల ఆన్‌ ‌లైన్‌ ‌ఫీజుల వసూళ్ళతో కార్పొరేట్‌ ‌విద్యా వ్యాపారం చెలరేగిపోయింది. పదవ తరగతి కి సిలబస్‌ ‌దాదాపు సగం పూర్తయింది. మొదటి రౌండు రివిజన్‌ ‌ప్రారం భమైంది. విద్యార్థుల సామర్థ్యాల సాధనలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ప్రయాణం ఇప్పుడు మొదలయింది. ప్రభుత్వ,ప్రయివేట్‌ ‌పాఠశాలల విద్యార్థులు ఈ విద్యా సంవత్సరం చివరి వరకూ పొందేటి సంసిద్దతల మధ్య, అవగాహనల మధ్య అభ్యసనల మధ్య స్పష్టమైన తేడాలుంటాయనేది సత్యం.ఖచ్చితంగా పరీక్షలల్లో ఉత్తీర్ణతల మధ్య కూడా ఈ తేడాలు ప్రతిబింబిస్తాయనటంలో సందేహం లేదు. సమాజం ముందు ప్రభుత్వ పాఠశాలల ఫలితాలు నిర్వీర్యమైతే ప్రభుత్వ ఉపాధ్యాయుల వైఫల్యాలుగా సమాజం జమకడుతుంది.

సమాజం దృష్టిలో ప్రయివేట్‌ ,‌ప్రభుత్వ పాఠశాలలకు మధ్య అంతరాల సృష్టికి ఈ విద్యాసంవత్సరందోహదపడనుంది. సాంకేతిక సౌలభ్యాల దృష్ట్యా విద్యార్థుల మధ్య కూడా సామాజిక అంతరాల సృష్టికి ఈ విద్యా సంవత్సరం దోహదపడనుంది. ప్రభుత్వ పాఠశాలల శ్రేయస్సు కాంక్షించే సామాజిక బాధ్యతలు వున్న ఉపాధ్యాయ లోకం రెట్టింపైన బాధ్యతలను ఈ విద్యాసంవత్సరం తలనెత్తుకోవాల్సిన అవసరముంటుంది. మూడు వేల రూపాయల ఖర్చుతో స్మార్ట్ ‌ఫోన్‌ ‌కొనే స్థాయి వున్న పిల్లలెవరైనా ప్రభుత్వ పాఠశాలలో చేరుతారా! అనే చిన్న లాజిక్‌ ‌మరిచిన మన ప్రభుత్వానికి విద్యా రంగాభివృద్దిపై వున్న గౌరవానికి గుర్తుగా ఈ మార్గదర్శకాల విడుదలను భావించక తప్పదు. సెప్టెంబర్‌ 1 ‌నుండి పాఠశాల విద్యార్థుల డిజిటల్‌ ‌పాఠాలు నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. అన్ని స్థాయిల్లో అధికారులను,పాఠశాల స్థాయిలో హెడ్‌ ‌మాస్టర్లను బాధ్యులను చేస్తూ ప్రభుత్వం తను బాధ్యతలను నుండి తప్పుకుంది. డిజిటల్‌ ‌పాఠాలు ప్రారంభించటం ద్వారా విద్యా సంవత్సరాన్ని కాపాడటం లో ప్రభుత్వ చొరవను ప్రశంసించాలి.

కానీ డిజిటల్‌ ‌బోధనకు సంబంధించి పాఠశాల,విద్యార్థుల భౌతిక సామర్థ్యాలను,సౌకర్యాల అందుబాటు పై అంఛనా ను విస్మరించింది.డిజిటల్‌ ‌పాఠాల నిర్వహణ కార్యాచరణ కోసం మొదటి నుండి ఉపాధ్యాయ సంఘాల సర్వేలు,విద్యా రంగ మేధావులు నివేదిస్తున్న విషయాల్ని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదు.భూమిని విడిచి సాము చేయటం లాగా వున్న,ఆచరణ యోగ్యం కాని ఉత్తర్వులు, కార్యాచరణ మార్గదర్శకాలు విడుదల చేసి చేతులు దులుపుకుంది.క్షేత్రస్థాయి ఆచరణలో అనేక భౌతిక అడ్డంకులు ఎదురయ్యే కార్యక్రమం బయటకు ప్రకటించి సమాజం దృష్టిలో ప్రభుత్వం బేష్‌!అనిపించు కుంటుంది.ఆచరణలో అధికారులు,హెడ్‌ ‌మాస్టర్లు,ఉపాధ్యాయులు వైఫల్యం చెందారని బురద చల్లేందుకు ప్రభుత్వం యత్నించే అవకాశం వున్నది.
రాష్ట్రంలో 18 శాతం విద్యార్థులకు మాత్రమే డిజిటల్‌ ‌పాఠాలు చూసేందుకు టి.వీ. మాధ్యమం అందుబాటులో వుందని పలు సర్వేల్లో తేలిన అంశం.తల్లిదండ్రుల సహకారం పై పలు దశల్లో పేర్కొన్నారు. లాక్‌ ‌డౌన్‌ ఉపసంహరింపు జరుగుతున్న నేపథ్యంలో తల్లిదండ్రులు పొద్దంతా పనులకు వెళ్ళి వస్తారు. పగటి సమయంలో విద్యార్థుల డిజిటల్‌ ‌చదువులపై తల్లిదండ్రుల పర్యవేక్షణ ఆశించలేము. సాయంత్రం వేళల్లో తల్లిదండ్రులను టి.వీ.సీరియల్స్ ‌నుంచి దూరముంచ లేము.

students over tree

‘ఉన్నత’ ఉత్తమ ఉపాధ్యాయుడు!
అవును….విద్యార్థులకు చదువు చెప్పడం అధ్యాపకులకు సవాలే మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో…వెనకటికి ఇప్పటికీ విద్యావిధానంలో బోలెడు మార్పులు చోటు చేసుకోవడం గమనిస్తున్నాం…యుధ్ధ వాతావరణం లో టీచర్లు పిల్లలకు పాఠాలు చెబుతున్నారని చెప్పాలి ..టీచర్లకు తరగతి గదిలో కూర్చోడానికి కుర్చీలు వుండవు…విద్యార్థుల ను పల్లెత్తు మాట అనొద్దు…అటు యాజమాన్యానికి ఇటు పిల్లల తల్లితండ్రులకు జవాబుదారీగా వుంటూ పాపం నల్లేరు మీద నడకలా వృత్తిలో కొనసాగుతున్న  ఉపాధ్యాయులకు కొరొన కోరి కష్టాలు తెచ్చి పెట్టింది. విద్యా సంవత్సరం ప్రారంభమైనా కోరొన కారణంగా ఇంకా బళ్ళు తెరవక పోవడంతో ఎక్కడి వారు అక్కడే విద్యార్థులు ఇండ్లకే పరిమితం అయ్యారు.చదువు నష్ట పోవద్దని ప్రభుత్వాలు ఆన్‌ ‌లైన్‌ ‌లో పిల్లలకు పాఠాలు చెప్పమని ఉపాధ్యాయులను సూచించారు. వెస్ట్ ‌బెంగాల్‌ ‌లో వో ఉపాధ్యాయుడికి ఈ ఆన్‌ ‌లైన్‌ ‌బోధన విషమ పరిస్థితే తెచ్చి పెట్టింది.ఎక్కడో మారు మూల గ్రామీణ ప్రాంతం లో వున్న పాఠశాలలో పని చేస్తున్న ఈ సారు ఇంటర్నెట్‌ ‌సిగ్నల్స్ ‌సరిగ్గా అందని కారణంగా వేప చెట్టును ఆశ్రయించాల్సి వచ్చింది.

చెట్టు ఎక్కితే గానీ సిగ్నల్స్ అం‌దేలా లేవు.చెట్టు పైనే చిన్న వెదురు బల్ల లాంటిది ఏర్పాటు చేసుకొని,ఉదయాన్నే టిఫిన్‌ ‌డబ్బా,నీళ్ళ కాన్‌,ఇం‌టర్నెట్‌ ‌కనెక్షన్‌ ‌తోయింటి నుంచి బయలుదేరి  వచ్చి చెట్టెక్కి కూర్చుంటాడు ఆ బడి పంతులు.  పిల్లలు ఆన్‌ ‌లైన్‌ ‌లో రాగానే పాఠాలు మొదలు పెడతాడు.ఇంతవరకు బాగానే వుంది… అంత ఎత్తయిన చెట్టు ఎక్కడమే వొక సవాలు అయితే…మరి అంత పెద్ద వేప చెట్టు ప్రకృతి ఇచ్చిన కానుక మనకు…పెద్ద గాలి వీచగానే ఆ చెట్టు  కొమ్మలు జడలు విప్పుకొని ఊగుతాయి.గాలి మాత్రమే కాదు.. ఎండా వానా కూడా ప్రకృతి లో భాగం…వీటన్నిటినీ తట్టుకొని ప్రకృతిని జయిస్తూ ఈ సారు చెట్టు పై కూర్చొని పిల్లలకు పాఠాలు బోధించాలి.వొక రకంగా ఇది యుధ్ధ వాతావరణాన్ని తలపిస్తున్న ది కదా…ఈ అనుభవం టీచర్లకు మాత్రం చాలా పాఠాలు నేర్పే అవకాశం వున్నది… ఇక ముందు ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చే క్రమంలో చెట్లు ఎక్కించడం,గుట్టలు ,పర్వతాల పైకీ పాకించ డం,గాలిలొ పల్టీలు కొట్టించుకోవడం లాంటి అంశాలు వున్నా ఆశ్చర్య పొనవసరం లేదు…ఉపాధ్యాయులు కూడా సవాలుగా స్వీకరిస్తూ విధులను అతిక్రమించి బాధ్యతలు నిర్వహిస్తున్నారు.ఇది వాస్తవం అనడానికి యీ బెంగాల్‌ ఉపాధ్యాయుడే నిదర్శనం.మరి ఈయనను ఉత్తమ ఉన్నత ఉపాధ్యాయుడు అనొచ్చు కదా…!
సేకరణ : వీణ, ఊహా చిత్రం : శృతి దేవులపల్లి

గ్రామాల్లో ఎక్కువగా సింగిల్‌ ‌ఫేజ్‌ ‌విద్యుత్‌ ‌సౌకర్యం వుండటం,తరచు విద్యుత్‌ ‌ట్రాన్స్ ‌ఫార్మర్లు పేలి విద్యుత్‌ ‌సరఫరాలో అంతరాయం సాధారణ అంశాలు.గ్రామపంచాయితీల్లోని టి.వీ. ని విద్యార్థులకు ప్రత్యామ్నాయంగా మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. సాయంత్రం సమయాల్లో గ్రామ సచివాలయాలు తెరచి విద్యార్థులకు సహకరించేందుకు రాజకీయాలు,సామాజిక అంతరాలు ఎదురవుతాయి.ఇందుకు పంచాయితీ కార్యాలయ స్థాయిలో బాధ్యత వహించేదెవరు!? జాబ్‌ ‌చార్ట్ ‌లో లేని బాధ్యతలు నిర్వహించే దెవరు!?వారికి వారి సంబంధిత శాఖ నుండి ఆదేశాలు అందాల్సిన అవసరం వుంది. విద్యార్థులకు అందుబాటులో స్మాట్‌ ‌ఫోన్‌,‌దానిలో నెలకు రెండువందల రూపాయల ఖర్చుతో డాటా సిమ్‌ 9‌శాతం కుటుంబాలలో కూడా వుండటం అసాధ్యం. కోవిడ్‌ -19 ‌సంక్షోభంలో పల్లెల్లో ,పట్న ప్రాంతాల్లో లాక్‌ ‌డౌన్‌ ‌వల్ల ఉపాధి,కూలీ దొరకక నిత్యవసర వస్తువుల కొనుగోలు కూడా పడిపోయింది. వ్యాపార వాణిజ్య సంస్థల లావాదేవీ లు లేక అనేక కుటుంబాలు వలసబాట పట్టాయి.ఈ పరిస్థితుల్లో టి.వీ. లేదా స్మార్ట్ ‌ఫోన్‌ ‌కొనే స్థితి 80 శాతం పట్టణాల్లో దిగువ మధ్య,పల్లెల్లో రైతు కూలీ కుటుంబాలున్నాయి. ఇలా గుర్తించబడిన విద్యార్థులను సదరు టి.వీ. లేదా స్మార్ట్ ‌ఫోన్‌ ‌సౌలభ్యం గల విద్యార్థులతో జత కావాలని సూచించారు. మెంటర్‌ ‌పర్యవేక్షణ ఏర్పాటు చేయమన్నారు.ఇవన్నీ కోవిడ్‌ -19 ‌నియమాలు పాటించమంటూనే వాటిని ఉల్లంఘించే అవకాశాలున్న సూచనలు చేయటం గందరగోళపరచటం కాదా!? ప్రయివేట్‌ ‌పాఠశాలలకు నర్సరీ నుండి,ఎయిడెడ్‌ ‌పాఠశాలలకు మూడవతరగతి నుండి, ప్రభుత్వ పాఠశాలలకు రెండవ తరగతి నుండి డిజిటల్‌ ‌పాఠాల నిర్వహణ అని పేర్కొన్నారు. నర్సరీ విద్యార్థులు సోషల్‌ ‌మీడియాలో విని,పెంచుకునే సామర్థ్యాల స్థాయి ఏమిటో అధికారులే తెలుపాలి. పూర్తిగా లక్షల రూపాయల విద్యా వ్యాపార దోపిడికి దోహదపడే అవకాశం ఈ మార్గదర్శకాల్లో పేర్కొనటం బాధాకరం.

పాతిక సంవత్సరాల క్రితం ఇచ్చిన పాత టి.వీ.లు దాదాపు అన్ని పాఠశాలల్లో వేర్వేరు కారణాలచేత పాడయ్యాయి. కొన్ని యు.పి.ఎస్‌. ‌లకు రెండేసి కంప్యూటర్లు,హైస్కూల్స్కు ఇచ్చిన పదకొండు చొప్పున కంప్యూటర్లు నిర్వహణ లేక పనిచేసే స్థితిలో లేవు. గత ఎనిమిది సంవత్సరాలుగా ప్రతి యేట ఈ కంప్యూటర్ల స్థితిగతుల వివరాలు డైస్‌ ‌లో మరియు ప్రత్యేకంగా కూడా మండల వనరంల కేంద్రం ద్వారా జిల్లా విద్యాధికారి కార్యాలయాలు సేకరిస్తున్నాయి. ఇంటర్నెట్‌ ‌సౌకర్యం లేక పోవటం కూడా కంప్యూటర్లు పాడుకావటానికి కారణం.కాంప్లెక్స్ ‌హైస్కూల్స్ ‌లో కాంప్లెక్స్ ‌నిధులతో ఇంటర్‌ ‌నెట్‌ ‌కొంత శాతం హైస్కూల్స్ ఏర్పాటు చేసుకున్నా తాత్కాలిక శిక్షకుల నియమాకం 2015 తరువాత నిలిపి వేయటంతో ఫలితం శూన్యమైంది.ఐ.సి.టి శిక్షణను పొందిన హైస్కూల్‌ ఉపాధ్యాయులు ఉన్నచోట కంప్యూటర్‌ ‌లాబ్‌ ‌లు విండోస్‌ అప్‌ ‌డేటెడ్‌ ‌లేక వైరస్‌ ‌సోకి మదర్‌ ‌బోర్డులు దుమ్ము పట్టి పోయాయి. సర్వర్‌ ‌సిస్టంలు కొనప్రాణంతో కొన్ని స్కూళ్ళలో. లభించే అవకాశముంది.ప్రతి నెల రెగ్యులర్‌ ‌జీతాల బిల్లులు,సప్లిమెంటరీ బిల్లుల తయారీకి డి.డి.ఓ. లకు జేబులు ఖాళీ అవుతున్నాయి. ఉపాధ్యాయులు ఈ-లెర్నింగ్‌ ‌మెటీరియల్‌ ‌సంసిద్దం చేయటానికి పాఠశాలల్లో  సౌకర్యాల లేమికి, ఒక వేళ చేసినా విద్యార్థులకు పాఠశాల క్షేత్రం నుంచి  ట్రాన్స్ ‌మీట్‌ ‌చేయటానికి సాంకేతిక నిపుణత ఎలా అనేది మార్గదర్శకాల్లో చెప్పలేదు.రెండవ తరగతి నుండి పదవ తరగతివరకు ఎస్‌.‌సి. ఇ.ఆర్‌.‌టి. రూపొందించిన వర్క్ ‌షీట్లను లింక్‌ ‌ద్వారా  రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలలకు  పంపించారు. పాఠశాల నుండి విద్యార్థులకు ఎలా అందజేయాలనేది స్పష్టత లేదు విద్యార్థులు హార్డ్ ‌కాపీలుగా ప్రింట్‌ ‌తీసుకోని వాటిని రాయక తప్పదు. ఇది విద్యార్థులకు అదనపు భారం కానున్నది. ప్రత్యక్ష పర్యవేక్షణలో ముఖాముఖీ బోధనలోనే సామర్థ్యాల సాధనకు ఇంతకాలంగా నానా ఇబ్బందులు ఎదుర్కున్నాం. డిజిటల్‌ ‌బోధనలో వర్క్ ‌షీట్ల వ్యవహారంలో సొంతంగా నేర్చుకోవటం, రాయటం అనేది ప్రశ్నార్థకం అయ్యే వేళ సామర్థ్యాల సాధన తూతూ మంత్రం లాగే ముగిసే అవకాశాలున్నాయి.

మార్గదర్శకాలు చూడటానికి బాగా కన్పిస్తున్నా క్షేత్ర స్థాయి ఆచరణకు నిధుల విషయం ప్రస్తావించలేదు. విద్యా కార్యాలయాలన్నీ డిజిటల్‌ అయ్యాయని పేర్కొన్నప్పుడు వాటికి అనుసంధానమవ్వాల్సిన పాఠశాలలకు కూడా డిజిటల్‌ ‌సాంకేతికతను అందజేయాలనే విషయాన్ని విస్మరించారు. పాఠశాలలన్నింటికి లాన్‌ ‌సౌకర్యంతో కంప్యూటర్‌ ‌లాబ్‌ ‌లు,సంబంధిత ఫర్నీఛర్‌,50‌కె.బి. వేగంతో అన్‌ ‌లిమిటెడ్‌ ‌నెట్‌ ,‌మల్టీ అంటేన్నాల రౌటర్‌ ‌ప్రింటర్లు,స్కానర్లు,టి.వీ. మరియు ఆర్‌.ఓ.‌టి. సెట్‌ అప్‌ ‌బాక్స్ ‌లేదా కేబుల్‌ ‌కనెక్షన్‌ ‌సౌకర్యాలను తక్షణమే అందజేయాలని అందుకు కావల్సిన నిధులు నేరుగా పాఠశాల హెడ్‌ ‌మాస్టర్లకు విడుదల చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు,ఎస్‌.ఎం.‌సి.లు కోరుతున్నాయి. సాంకేతిక సౌకర్యాలున్న కుటుంబాల పిల్లలకే పరిమితం కానున్న ఈ డిజిటల్‌ ‌బోధన వలస కూలీలు,ఉపాధి హామీ కూలీలు,దినసరి కూలీ, సంచార జాతుల కుటుంబాల కు చెందిన పేద పిల్లలను చదువులకు దూరం చేయటమేనని  విద్యార్థి సంఘాల పలు సర్వేలు పేర్కొంటున్నాయి. డిజిటల్‌ ‌బోధన అదనపు బోధనగా పరిగణించాల్సిందే కానీ ప్రత్యక్ష తరగతి బోధనకు కావల్సిన హైజినిక్‌ ‌క్లాస్‌ ‌రూం నిర్మాణానికి ప్రభుత్వం నిధులు చేకూర్చాలని వారి సర్వే ఫలితాలు తెలుపుతున్నాయి.

కోట్లాది రూపాయల నిధులతో ప్రణాలికేతర వ్యయంతో పోలీస్‌ ‌శాఖకు పలు రకాల అధునాతన వాహనాలు సమకూర్చిన ప్రభుత్వం ఇప్పటికీ  ధనిక రాష్ట్రంగా చెప్పుకుంటుంది. కాబట్టి పేదపాఠశాల విద్యార్థులందరికి స్మార్ట్ ‌ఫోన్‌, ‌వారి కుటుంబానికి టి.వీ.లను అందజేయటం వృధా ఖర్చని భావించలేము.  ఇలాంటి అనేక భౌతిక సవాళ్ళ మధ్య డిజిటల్‌ ‌బోధన ప్రక్రియలో పిల్లలనుండి వారి తల్లిదండ్రులు నుండి జవాబు దారితనం ఆశించలేము. విద్యార్థులకు,పాఠశాలకు,పాఠశాలకు, సమీక్షల పర్వం నడిచే అధికార కార్యాలయాలకు మధ్య కొత్త తరహా పని వత్తిడి పెరగటం ఉపాధ్యాయులకు,హెడ్‌ ‌మాస్టర్లకు సమస్యగా మారనున్నది.ప్రతి పాఠశాలకు కంప్యూటర్‌  ‌సాంకేతిక సహాయకుల తాత్కాలిక నియామాకం చేయాల్సిన అవసరాన్ని ప్రభుత్వం గుర్తించాలి.      కోవిడ్‌-19 ‌సంక్షోభాన్ని దాని ఫలితాల సవాళ్ళను ఎదుర్కొని విద్యాసంవత్సరం కాపాడాలని భావించే ప్రభుత్వం ఇందుకు కావల్సిన సౌకర్యాల ప్రకల్పనకు సిద్దపడాలి. రూపాయి ఖర్చులేకుండా రాష్ట్రం లోని లక్షలాది పాఠశాలలకు చెందిన విద్యార్థులకు డిజిటల్‌ ‌బోధనను ఎలా చేయగలమనే లాజిక్‌ ‌ను ప్రభుత్వం విస్మరించటమే హాస్యాస్పదం!
వాడపల్లి అజయ్‌ ‌బాబు,టి.పి. టి.ఎఫ్‌. ‌సీనియర్‌ ‌నాయకులు, వరంగల్‌. 

Leave a Reply