Take a fresh look at your lifestyle.

పరిహారం అందరికీ ఒకేలా ఇవ్వరా?

  • మల్లన్నసాగర్‌ ‌ప్రాజెక్టుకు భూములిచ్చిన రైతులు ఇబ్బందులు పడరా?
  • పటాన్‌చెరు కాలుష్యం కోరల్లో చిక్కుకుంది…
  • దళితుల భూములు లాక్కుంటారా?
  • కెసీఆర్‌పై విరుచుకుపడిన షర్మిల
  • మా నాయకుడు వైఎస్‌ఆర్‌ని కాలర్‌ ఎగరేసుకుని చెప్పొచ్చు
  • మెతుకు సీమ వైఎస్‌ఆర్‌ అభిమానుల ఆత్మీయుల సమ్మేళనంలో షర్మిల

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును వైఎస్‌.‌షర్మిల మరోసారి టార్గెట్‌ ‌చేశారు. కేసీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. సిఎం కేసీఆర్‌ ‌ప్రాతినిధ్యం వహించే ప్రాంతంలో మల్లన్నసాగర్‌ ‌ప్రాజెక్టుకు భూములిచ్చిన రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని.. వారికి ఇంకా న్యాయం జరగలేదని సిఎం కేసీఆర్‌పై వైఎస్‌ ‌షర్మిల విమర్శలు గుప్పించారు. భూములిచ్చిన పాపానికి ఇబ్బందులు పడాలా? న్యాయం కోసం భూములిచ్చిన వాళ్లు కొంతకాలంగా ఆందోళనలు చేస్తున్నారని మండిపడ్డారు. ఒకే జిల్లా, ఒకే మంత్రి, ఒకే కలెక్టర్‌, ఒకే ఆర్డీవో పరిధిలో ఉన్న గ్రామాలలో భూములుచ్చిన వారందరికీ పరిహారం ఒకేలా ఉండొద్దా? ఇవ్వరా? అని ప్రశ్నించారు. మన అనుకునే వారికి ఒకలా? కాదు అనుకునే వారికి ఇంకోలా పరిహారం ప్రభుత్వం చెల్లించడం అన్యాయం కాదా? అని ప్రభుత్వాన్ని నిలదీశారు. అన్ని వర్గాలకు న్యాయం చేసిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ఒక దివంగత ముఖ్యమంత్రి  వైఎస్‌ఆరేననీ, వైఎస్‌ఆర్‌ అని మా నాయకుడు అని గ•ర్వంగా కాలర్‌ ఎగరేసుకుని చెప్పొచ్చన్నారు. వైఎస్‌ఆర్‌ ‌బతికి ఉంటే మెదక్‌ ‌జిల్లా రూపు రేఖలు పూర్తిగా మారిపోయేవనీ వైఎస్‌ ‌షర్మిల అన్నారు. బుధవారం లోటస్‌పాండులో ఉమ్మడి మెదక్‌ ‌జిల్లా వైఎస్‌ఆర్‌ అభిమానులతో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో వైఎస్‌ ‌షర్మిల మాట్లాడుతూ.. పాటకు ప్రాణం, విప్లవానికి ఊపిరి పోసిన గద్దర్‌ ‌పుట్టిన గడ్డ మెదక్‌ అన్నారు. నాగేటి సాలల్లో నా తెలంగాణ అన్న నందిని సిధారెడ్డి పుట్టిన నేల మెదక్‌ అని తెలిపారు. వైఎస్‌ఆర్‌కు మెదక్‌ ‌జిల్లాకు విడదీయరాని బంధం ఉందనీ,  వైఎస్‌ఆర్‌ ‌రాజీవ్‌ ఆరోగ్య శ్రీ పథకం మెదక్‌ ‌నుంచే ప్రారంభించారని ఆమె గుర్తుచేశారు. సిఎం కేసీఆర్‌ ‌జిల్లాగా చెప్పుకునే మెదక్‌లో 20 కరువు మండలాలు ఉండడం బాధాకరమని షర్మిల విమర్శించారు. పటాన్‌చెరు ప్రాంతం కాలుష్య కోరల్లో చిక్కుకుందని పేర్కొన్నారు. మల్లన్నసాగర్‌ ‌ప్రాజెక్టుకు భూములిచ్చిన రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని.. వారికి ఇంకా న్యాయం జరగలేదనీ, దళితుల భూములను లాక్కుంటున్నారని విరుచుకుపడ్డారు.

టిఆర్‌ఎస్‌ ‌పాలనలో నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారనీ, యువతకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు.  ఉమ్మడి ఆంధప్రదేశ్‌లో మెదక్‌ ‌జిల్లా అత్యంత వెనకబడిన జిల్లాగా ముఖ్యమంత్రి హోదాలో వైఎస్‌.‌రాజశేఖర్‌రెడ్డి కేంద్రాన్ని ఒప్పించి వెనకబడిన జిల్లా జాబితాలో మెదక్‌ ‌జిల్లాను చేర్చడం వల్ల అధికంగా నిధులను తేగలిగారన్నారు. భారతదేశంలో 10 ఐఐటిలుంటే…11వ ఐఐటి ఉమ్మడి ఆంధప్రదేశ్‌కు కేటాయిస్తే వెనకబడిన మెదక్‌ ‌జిల్లాలో విద్యలో వెనకబడి ఉండకూడదన్న ఏకైక లక్ష్యంతో సంగారెడ్డి కందిలో ఐఐటిని ఏర్పాటు చేయించిన ఘనతం వైఎస్‌ఆర్‌దే అన్నారు. హైదరాబాద్‌ ‌చుట్టూ ఔటర్‌ ‌రింగ్‌ ‌రోడ్డు నిర్మాణంతో మెదక్‌ ‌జిల్లా రూపు రేఖలే మారాయనీ, ఎంతో అభివృద్ధి చెంది భూములు బంగారమయ్యాయన్నారు.  ఐఐటితో పాటు హైదరాబాద్‌ ‌చుట్టూ ఔటర్‌ ‌రింగ్‌ ‌రోడ్డు నిర్మాణంతో మెదక్‌ ‌జిల్లాలోని భూముల ధరలు గణనీయంగా పెరిగాయన్నారు. వైఎస్‌ఆర్‌ ‌వల్లే మెదక్‌ ‌జిల్లా ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. వందల ఎకరాలలో బయోటెక్‌ ‌పార్కులను ఏర్పాటు చేయాలనుకున్నారనీ, ఇప్పుడు ఇండస్ట్రియల్‌ ‌పార్కులకు నిజమైన పునాది వైఎస్‌ఆర్‌ ఆటోమెటిక్‌ ‌పార్కు అన్నారు. సింగూరు ఎత్తిపోతల ప్రాజెక్టు కూడా వైఎస్‌ఆర్‌ ‌తలపెట్టిందేననీ, ప్రస్తుతం 40వేల ఎకరాలకు సాగు నీరు అందుతుందంటే ఆ ఘనత వైఎస్‌ఆర్‌దేననీ అన్నారు.  గంజాయి సాగు చేస్తున్న వారికి ప్రత్యామ్నాయం కల్పించారని చెప్పారు.  ప్రాణహిత-చేవెళ్ల పథకం ద్వారా మెదక్‌ ‌జిల్లాకు 5.19 లక్షల ఎకరాల భూమికి సాగునీరు అందించాలని వైఎస్‌ ‌రాజశేఖర్‌ ‌రెడ్డి భావించారని..దానిని రీడిజైన్‌ ‌చేసిన నాయకులు, ఇప్పటి వరకు ఏం చేశారో ఎవరికీ తెలియదని విమర్శలు గుప్పించారు.  వైఎస్‌ఆర్‌ ‌సిఎంగా ఉన్నప్పుడు మెదక్‌ ‌జిల్లా నుంచి నలుగురు మంత్రులను కేబినెట్‌లోకి తీసుకున్నారనీ వారిలో ఒకరు అన్న దామోదర రాజనర్సింహా ఎస్సీ సామాజిక వర్గంకు చెందితే  ఇద్దరు మహిళలను, మరొకరు మైనారిటీని తీసుకున్నారన్నారు. వైఎస్‌ఆర్‌ ‌బతికి ఉంటే మెదక్‌ ‌జిల్లా రూపు రేఖలు ఎవరూ ఊహించని విధంగా మారిపోయేవనీ, దురదృష్టవశాత్తు వైఎస్‌ఆర్‌ ‌చనిపోయారనీ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజా సంక్షేమాన్ని తీసుకురావల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ  ఆత్మీయ సమ్మేళనంలో రాష్ట్ర, జిల్లా నేతలు కొండా రాఘవరెడ్డి, ఇందిరా శోభన్‌,  ‌రామంచ భాస్కర్‌రెడ్డి, వై••ఎస్‌ఆర్‌సిపి సిద్ధిపేట జిల్లా అధ్యక్షుడు తడ•క జగదీశ్వర్‌ ‌గుప్తా తదితరులు పాల్గొన్నారు.  ఇదిలా ఉంటే, సమ్మేళనంకు వచ్చిన మహిళలతో షర్మిల చాలా క్లోజ్‌గా కలిసిపోయారు. వారి సాధకబాధలను తెలుసుకున్నారు. ముఖ్యంగా లంబాడ మహిళలు తెచ్చిన బట్టలు ధరించి వారిలో ఒకరిలా షర్మిల కలిసిపోయారు. ఈ సమ్మేళనానికి మహిళలు కూడా పెద్ద సంఖ్యలోనే హాజరయ్యారు.

Leave a Reply