Take a fresh look at your lifestyle.

చైనా, పాకిస్థాన్‌ ‌పై బైడెన్‌ ‌వైఖరి భారత్‌ ‌కు ఇబ్బందికరమా??

అమెరికా ప్రపంచానికే పెద్దన్న. ఆ దేశాధ్యక్షుని వ్యక్తిగత నిర్ణయాలపై ప్రపంచం భవిష్యత్తు ఆధార పడి ఉంటుందా. అమెరికా అధ్యక్షుని ఆదేశంలోని ఓటర్లు తాము కోరుకునే అభ్యర్థిని ఎన్నుకుంటారు. అయితే, అధ్యక్ష ఎన్నిక పక్రియ పరోక్ష విధానంలో ఉంటుంది. ప్రజలు తాము కోరుకునే పార్టీకి చెందిన ఎలక్టోరల్‌ ‌కాలేజీ సభ్యులకు ఓట్లు వేస్తారు. రాష్ట్రాల వారీగా జనాభా బట్టి ఈ ఎలక్టోరల్‌ ‌కాలేజీ సభ్యుల సంఖ్య ఉంటుంది. ఈ సంఖ్య ఒక్కో రాష్ట్రం నుంచి కాంగ్రెస్‌ (అమెరికా పార్లమెంట్‌) ‌లోని ఉభయ సభల నుంచి ఎన్నికయ్యే సభ్యులకు సమానం. మొత్తం 538 మంది ఎలక్టర్స్ ఉన్నారు. వీరిలో సగానికి పైగా, 270 మంది.. అంత కంటే ఎక్కువ మందిని ఏ పార్టీ గెలుచుకుంటే వారికే అధ్యక్ష పదవి. గత నవంబరు 3న జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో అమెరికా 46వ అధ్యక్షుడిగా బైడెన్‌ ‌ఖరారయ్యారు. ఆయన విజయాన్ని అమెరికా ఎలక్టోరల్‌ ‌కాలేజ్‌ ఆమోదించింంది. జో బైడెన్‌ ఈ ‌నెల 20న అమెరికా అధ్యక్షునిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. అమెరికా కాంగ్రెస్‌ ‌సంయుక్త సమావేశం కూడా ధ్రువీకరించడంతో నూతన అధ్యక్షుడిగా బైడెన్‌ ‌ఖరారయ్యారు. దేశ ఉపాధ్యక్షురాలిగా కమలా హ్యారిస్‌ ‌కూడా ఖరారయ్యారు. అమెరికా చరిత్రలో 18 సంవత్సరాలు -ఎక్కువ కాలం పనిచేసిన సెనేటర్‌ ఆయన. చరిత్రలో అత్యధికంగా 77,920,048 ఓట్లు సాధించిన ఏకైక అధ్యక్షునిగా 77 సంవత్సరాల వృద్ధ అధ్యక్షుడు ఆయనే.

బైడెన్‌ ‌నేపథ్యం.

జోసెఫ్‌ ‌రాబినెట్‌ ‌బైడెన్‌ ఒక కాథలిక్‌ ‌కుటుంబంలో నలుగురు తోబుట్టువులలో మొదటివాడు. ఒక సోదరి ఇద్దరు సోదరులు ఉన్నారు. బైడెన్‌ ‌పెన్సిల్వేనియాలోని స్క్రాన్టన్‌ ‌డెలావేర్లోని న్యూ కాజిల్‌ ‌కౌంటీలో పెరిగారు. వ్యక్తిగా ఆయన ఒక పేద విద్యార్థి కాని విద్యార్థులలో సహజ నాయకుడిగా ఎన్నికయ్యారు డెలావేర్‌ ‌విశ్వవిద్యాలయంలో న్యాయ విద్యార్థిగా ఉన్న బైడెన్‌ 1966 ఆగస్టు 27 న నీలియా హంటర్‌ ‌నె వివాహమాడారు. 1972 డిసెంబరు 18 న ఎన్నికల తరువాత బైడెన్‌ ‌భార్య నీలియా, ఏడాది వయసున్న కుమార్తె నవోమి ఆటోమొబైల్‌ ‌ప్రమాదంలో మరణించారు. బైడెన్‌ ‌జిల్‌ ‌ను 1977 లో రెండో వివాహం చేసుకున్నారు. వారికి ముగ్గురు పిల్లలు. వారికి ఒక కుమార్తె ఉంది. బైడెన్‌ ‌పెద్ద కుమారుడు బ్యూ డెలావేర్‌ ఇరాక్‌ ‌లో ఆర్మీ జడ్జి అడ్వకేట్‌ ‌గా పనిచేస్తూ. 2015 మే 30 న మెదడు క్యాన్సర్‌ ‌వల్ల 46 సంవత్సరాల వయసులో మరణించాడు. చిన్న కుమారుడు హంటర్‌, ‌వాషింగ్టన్‌ ‌న్యాయవాది లాబీయిస్ట్ అయ్యాడు.1965 లో డెలావేర్‌ ‌విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్‌ ‌డిగ్రీ పొందాడు. 1970 లో న్యూ కాజిల్‌ ‌కౌంటీ కౌన్సిల్‌ ‌కి ఎన్నిక య్యారు. 30 ఏళ్ళ వయసులో పదవిని నిర్వహించడానికి అవసరమైన కనీస వయస్సు. అమెరికా చరిత్రలో బైడెన్‌ ఆరవ-అతి పిన్న వయస్కుడైన సెనేటర్‌ అయ్యారు 31 ఏళ్ళకు ముందే పదవీ బాధ్యతలు స్వీకరించిన 18 మందిలో ఒకరు. బైడెన్‌ ఆరుసార్లు సెనేట్కు ఎన్నికయ్యారు, 2009 యు.ఎస్‌ ‌లో ఉపాధ్యక్ష పదవిని చేపట్టడానికి రాజీనామా చేసారు.

జాతి వివక్షపై కీలక నిర్ణయాలు

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్‌ ‌విజయం సాధించి.. ఈ నెల 20న 46వ అధ్యక్షుడిగా ఆయన బాధ్యతలు స్వీకరించబోతున్న నేపథ్యంలో అమెరికాకు పూర్వ వైభవం తీసుకురావడానికి బైడెన్‌ ఏ ‌నిర్ణయాలు తీసుకోబోతున్నారనే అంశం ప్రస్తుతం చర్చనీయాంశం అయింది. బైడెన్‌ ‌చీఫ్‌ ఆఫ్‌ ‌స్టాఫ్‌ ‌గా బాధ్యతలు చేపట్టబోతున్న రాన్‌ ‌క్లెయిన్‌ అనేక కీలక విషయాలు వెల్లడించారు. బాధ్యతలు స్వీకరించిన తొలి రోజే పారిస్‌ ఒప్పందంలో భాగంగా, అమెరికా చేరిక సంబంధించిన ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్పై బైడెన్‌ ‌సంతకం చేస్తారని రాన్‌ ‌క్లెయిన్‌ ‌పేర్కొన్నారు. అంతే కాకుండా ముస్లిం దేశాలకు రాకపోకలపై విధించిన నిషేధంపై బైడెన్‌ ‌తుది నిర్ణయం తీసుకో నున్నట్టు చెప్పారు. కొవిడ్‌ ‌నిబంధనలను కఠినతరం చేయడం పాటు జాతి వివక్షపై తీసుకునే కఠిన నిర్ణయాలను బైడెన్‌ ‌ప్రకటించే అవకాశం ఉందని వివరించారు. బాధ్యతలు చేపట్టిన రోజే దాదాపు 12 కీలక ఉత్తర్వుల పై బైడెన్‌ ‌సంతకం చేస్తారని పేర్కొన్నారు.

చైనా పట్ల బైడెన్‌ ‌వైఖరి ఏమిటి…

అమెరికా అధ్యక్షునిగా చైనా పట్ల బైడెన్‌ ‌వైఖరి ఎలా ఉంటుందనేది, ఆసక్తి కలిగిస్తున్న విషయం. ట్రంప్‌ ‌పాలనలో చైనా పట్ల అమెరికా కఠినమైన విధానాల అవలంబించినా భారత్‌ ‌కు మాత్రం అనుకూలంగా నిలిచింది. లద్దాఖ్‌ ‌లో భారత్‌, ‌చైనా మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నప్పుడు అమెరికా బహిరంగంగా భారత్‌ ‌కు మద్దతు తెలిపింది. అయితే ఇప్పుడు బైడెన్‌, ‌చైనా పట్ల మృదువుగా వ్యవహరించే అవకాశాలున్నాయని అంటున్నారు. బైడెన్‌ అధ్యక్షతన అమెరికా, చైనాతో వాణిజ్య ఒప్పందాలతో పాటు ఇతర అంశాలలో కూడా కచ్చితంగా కొన్ని రకాల మార్పులు ఉంటాయని అంచనా. ఈ విషయంలో భారత్‌ అ‌ప్రమత్తంగా ఉంటుంది. ‘‘భారత్‌, అమెరికాల మధ్య మూడు ముఖ్యమైన అంశాలు ఉన్నాయి… ఒకటి ఉగ్రవాదం-పాకిస్తాన్‌, ‌రెండోది చైనా, మూడోది ఆర్థిక సంబంధాలు . ఇండో-యూఎస్‌ ‌సంబంధాలపై చైనా ప్రభావం ఉండొచ్చు. ట్రంప్‌ ‌చూపినంత కఠినమైన వైఖరి బైడెన్‌ ‌పాటించకపోవచ్చు. భారత్‌, ‌చైనాల మధ్య ఎల్‌ఏసీ వద్ద ఇంకా ఉద్రిక్తతలు నెలకొని ఉన్నాయి. ఇలాంటి పరిస్థితిల్లో బైడెన్‌ ‌చైనా పట్ల మృదువుగా వ్యవహరిస్తే, దాన్ని భారత్‌ ‌హర్షించక పోవచ్చు. చైనా విషయంలో ట్రంప్‌, ‌బైడెన్ల మధ్య స్వరం, భాష, వ్యవహార పద్ధతులలో తేడా కనిపిస్తోంది. ఇది భారత్‌- అమెరికాల మధ్య సంబంధాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది’’అని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

ఆరుసార్లు సెనేట్‌ ‌పదవి

1972 లో మొదటి ఎన్నిక తరువాత బైడెన్‌ 1978, 1984, 1990, 1996, 2002, 2008 ‌లలో మరో ఆరుసార్లు సెనేట్‌ ‌పదవికి ఎన్నికయ్యారు. రిపబ్లికన్‌ ‌సహోద్యోగి విలియం రోత్‌ ‌రెండేళ్ల సీనియారిటీ కారణంగా బైడెన్‌ ‌జూనియర్‌ ‌సెనేటర్‌ ‌గా 28 సంవత్సరాలు గడిపారు. టామ్‌ ‌కార్పెర్‌ 2000 ‌లో రోత్‌ ‌ను ఓడించిన తరువాత బైడెన్‌ ‌డెలావేర్‌ ‌సీనియర్‌ ‌సెనేటర్‌ అయ్యాడు. 2018 నాటికి యు.ఎస్‌ ‌చరిత్రలో 18 సంవత్సరాల పాటు ఎక్కువ కాలం పనిచేసిన సెనేటర్‌. ‌బైడెన్‌ ఉపాధ్యక్షునిగా రెండుసార్లు పదవీకాలం పూర్తి చేసిన తరువాత బైడెన్‌ ‌పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలో అధ్యాపకునిగా చేరారు. పార్టీ ప్రతిపాదనను అనుసరించే డెమొక్రాటిక్‌ అభ్యర్థుల రంగంలో చేరి 2019 ఏప్రిల్‌ 25 ‌న ఆయన అధ్యక్ష పదవికి 2020 అభ్యర్థిత్వం ప్రకటించారు. సొంత పార్టీ ఎన్నికలో అమెరికా సంయుక్త రాష్ట్రాల పోటీలలో 26 పోటీలలో 18 గెలిచారు. బైడెన్‌ అధ్యక్ష ఎన్నికలకు డెమొక్రాటిక్‌ ‌పార్టీ నామినీ అయ్యారు. అమెరికా అధ్యక్ష్య ఎన్నికలో జో బైడెన్‌ 2020 అధ్యక్షుడిగా డెమోక్రటిక్‌ అభ్యర్థిగా డొనాల్డ్ ‌ట్రంప్ను ఓడించారు. ముస్లింలు అమెరికాలో ప్రవేశించకుండా తాత్కాలికంగా నిషేధించాలన్న ట్రంప్‌ ‌ప్రతిపాదనతో పాటు మెక్సికో సరిహద్దులో గోడను నిర్మించాలన్న ఉద్దేశాన్ని ఇప్పటికీ అమెరికా పౌరులకు గుర్తుచేసారు. అమెరికా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడానికి కారణం డోనాల్డ్ ‌ట్రంప్‌ అని విమర్శించారు.

భారత్‌ ‌సత్సంబందాలు కోనసాగేనా…

ప్రపంచంలో శక్తిమంతమైన దేశానికి అధ్యక్షుడైన తర్వాత విదేశీ వ్యవహారాల పట్ల ఆయన వైఖరి ఎలా ఉంటుంది, ట్రంప్‌ ‌కంటే ఎటువంటి భిన్నమైన విదేశీ విధానాలను పాటిస్తారు అనే అంశాలపై విశ్లేషకులు ఆసక్తి చూపుతున్నారు. భారత్‌ ‌తో ట్రంప్‌ ‌సన్నిహిత సంబంధాలు కొనసాగించినట్లే బైడెన్‌ ‌కూడా కొనసాగిస్తారా అనే విషయంలో అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వాణిజ్యం, హెచ్‌1‌బీ వీసాలు, అమెరికాలో భారతీయులకు ఉద్యోగాలు, రక్షణలో భాగస్వామ్యం… ఇలా ఎన్నో విషయాల్లో బైడెన్‌ ‌విధానాలు ఎలా ఉంటాయనేది కీలకమని విశ్లేషకులు భావిస్తున్నారు.

dr sangani malleswar
డా. సంగని మల్లేశ్వర్‌, ‌జర్నలిజం విభాగాధిపతి,
9866255355, కాకతీయ విశ్వవిద్యాలయం,వరంగల్‌,

Leave a Reply