Take a fresh look at your lifestyle.

రద్దు రాజకీయమా- ప్రజా శ్రేయస్సా? !

‘‘‌నల్ల ధనాన్ని అరికట్టడానికి ఉగ్రవాదులకు నిధులు అందకుండా చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే.పెద్దనోట్ల రద్దుతో ఆర్థిక వ్యవస్థ ఒక్కసారిగా కుదుపుకు లోనయింది.ఆర్‌బిఐ మాజీ గవర్నర్‌ ‌రాజన్‌ ‌ప్రకారం ఎపుడు నగదు రద్దు చేసినా, ఏదో రకంగా నకిలీ నోట్లను సృష్టించడం సులువే,ఒక వేళ నల్లధనాన్ని కరెన్సీ రూపంలో కాకుండా ఇతర రూపాలైన స్థిరాస్తి, బంగారం లేదా ఇతర రూపాల్లో దాచుకుంటే మరింత కష్టంగా మారుతుంది’’

 

దేశంలో ఎక్కడ చూసినా రెండువేల నోట్ల రద్దు గురించే చర్చ.ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా కేంద్ర ప్రభుత్వం ఎవరికీ చెప్పకుండా.. గుట్టుచప్పుడు కాకుండా పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం డీమానిటైజేషన్‌ (‌నోట్ల రద్దు)  నిర్ణయం తీసుకుంది. 2016 నవంబర్‌ 8‌న భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పాత 500 నోట్లు, 1000 నోట్లు చెల్లకుండా పోయాయి. పాత నోట్లను మార్చుకోవడం కోసం  2016 డిసెంబర్‌ 30 ‌వరకూ గడువు ఇచ్చారు.తర్వాత 500 నోటును,  2వేల రూపాయిల నోట్లను ఆర్‌బిఐ విడుదల చేసింది. స్వాతంత్య్రానంతరం నోట్ల రద్దు జరగడం ఇది రెండోసారి. స్వాతంత్య్రానికి పూర్వం కూడా 1946లో నోట్ల రద్దు జరిగింది. 1978లో మొరార్జీ దేశాయి ప్రభుత్వంలో సెంట్రల్‌ ‌బోర్డు ఆఫ్‌ ‌డైరెక్ట్ ‌టాక్సెస్‌ ఇచ్చిన నివేదిక ప్రకారం 500 నోటు, 1000 నోటు, 10వేల నోటును రద్దు చేశారు. అప్పటికి ఆ నోట్లు చాలా తక్కువ కనుక 15 శాతం వరకూ మాత్రమే ప్రభావితం చేశాయి. పెద్ద నోట్ల లావాదేవీల్లో అవకతవకలను నిరోధించడానికి చేసిన పెద్ద నోట్ల రద్దు చట్టం -1978 వల్ల ఎలాంటి లాభం లేకుండా పోయింది. 2015-16 ఆర్ధిక సర్వే ప్రకారం 27 శాతం గ్రామాలు మాత్రమే బ్యాంకింగ్‌ ‌వ్యవస్థను కలిగి ఉన్నాయి. దానిని దృష్టిలో ఉంచుకుని ప్రధాని జన్‌ధన్‌ ‌బ్యాంకు ఖాతాలను ప్రోత్సహించారు.నోట్లను మార్చుకోలేక, ఏటీఎంల నుండి డబ్బు డ్రా చేసుకోలేక ప్రజలు నానా అవస్థలు పడ్డారు. కొన్ని చోట్ల సామాన్యుల ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోయిన నేపథ్యంలో విపక్ష, అధికార పక్ష నేతల మధ్య యుద్దం నడిచింది.నోట్ల రద్దుతో ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి మందగించి జీడీపీ వృద్ధి రేటు 1.5 శాతం పడిపోయింది.నాడు ప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం తప్పు పడుతూ మొత్తం 58 పిటిషన్లు దాఖలు అయ్యాయి.నోట్ల రద్దులో ఎలాంటి లోటుపాట్లు లేవని 4-1 సుప్రీం కోర్టు సమర్థించింది.

పెద్ద నోట్ల రద్దు ప్రకటన వెలువడిన క్షణాన…దేశ ప్రజలు తెల్లబోయారు.. నల్లకుబేరులు గంగవెర్రులెత్తారు…ఆ ప్రభావం నుండి తేరుకోవడానికి ఆరున్నర ఏండ్లు పట్టింది. జనం, అధికారులు, ప్రభుత్వం ఓపికగా ఓ సంస్కరణకు సాయం పట్టారు…అయితే ఆశించిన లక్ష్యం నెరవేరిందా? ఆ నిర్ణయం నవ శకానికి నాందిగా మారిందా? నాశనానికి దారి తీసిందా? విఫల ప్రయోగంగా మిగిలిందా ? సగటుజీవి ప్రశ్నకు సమాధానం చెప్పేదెవరు? నోట్ల రద్దుపై అప్పుడూ, ఇప్పుడూ కేంద్రం చెప్పుతున్నది మాత్రం నల్లధనం, అవినీతిపరుల ఆటకట్టించడానికేనని బుకాయిస్తుంది. ఈ దశలో రెండు వేల నోటును ఉపసంహరించుకుంటున్నట్లు రిజర్వ్ ‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇం‌డియా ప్రకటించింది.23మే నుండి సెప్టెంబర్‌ 30 ‌వరకు ప్రజలు బ్యాంకుల్లో 2వేల నోట్లు మార్చుకోవచ్చని తెల్పింది.ఆర్బీఐ  ఖాతాదారులు తమ అకౌంట్లలో జమచేసుకోవచ్చని చెప్పుకుంటూనే రోజు 20వేలకు మించి మార్చడం కుదరదని ఖరాకండిగా చెప్పింది.రాజకీయ నేతలు, ఆర్థిక నిపుణుల్లో ఒకవర్గం ఇది విఫలప్రయోగం అంటుంటే బీజేపీ మాత్రం కప్పిపుచ్చుకోవడానికి భవిష్యత్‌లో ఇది ఫలితాలను ఇస్తుందని గట్టిగా చెబుతోంది.బ్యాంకుల చుట్టూ, ఎటిఎంలు చుట్టూ పెద్ద పెద్ద క్యూలలో రోజుల తరబడి నిలబడిన జనం నానా అవస్థలు పడిన ఘట్టాలు చాలామంది మరచిపోక ముందే  పిడుగులాంటి వార్త వినాల్సి వచ్చింది.రెండు వేల నోట్ల రద్దు కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థలో వేళ్లూనుకున్న అనేక లోపాలను సరిచేసేందుకు తీసుకున్న సాహసోపేత నిర్ణయం నోట్ల రద్దు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు.దేశంలో ఇప్పటికీ 15 కోట్ల మందికి బ్యాంకు ఖాతాలు లేవు. నిజంగానే 140కోట్ల భారత ప్రజా శ్రేయస్సుకోసమే అయితే 2016లో 2000నోటును  ఎందుకు రుద్దినట్టు? కేంద్రం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలకు భాద్యులెవరు? ఆర్‌బిఐ నివేదిక ప్రకారం దేశంలో 87 శాతం లావాదేవీలు నగదు రూపంలో జరుగు తున్నాయి.

నల్ల ధనాన్ని అరికట్టడానికి ఉగ్రవాదులకు నిధులు అందకుండా చేయడానికి ఈ నిర్ణయం తీసు కున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన సంగతి తెలి• •ందే.పెద్దనోట్ల రద్దుతో ఆర్థిక వ్యవస్థ ఒక్కసారిగా కుదుపుకు లోన యింది.ఆర్‌బిఐ మాజీ గవర్నర్‌ ‌రాజన్‌ ‌ప్రకారం ఎపుడు నగదు రద్దు చేసినా, ఏదో రకంగా నకిలీ నోట్లను సృష్టించడం సులువే,ఒక వేళ నల్లధనాన్ని కరెన్సీ రూపంలో కాకుండా ఇతర రూపాలైన స్థిరాస్తి, బంగారం లేదా ఇతర రూపాల్లో దాచుకుంటే మరింత కష్టంగా మారుతుంది. నిజానికి 2 వేల రూపాయల నోట్ల ముద్రణను 2018-19 నుంచే ఆపేసిన ఆర్బీఐ చలామణిలో వాటి సంఖ్యను గణనీయంగానే తగ్గించింది.కనుక నోట్ల రద్దు కాకుండా ఇతర వ్యవస్థాగత మార్పులతో మేలైన గవర్నెన్స్ ‌పద్ధతుల్లో నల్లధనాన్ని నిర్మూలించాలి.కొత్తగా ప్రవేశపెట్టిన 2వేల నోటును చిల్లరగా మార్చాలంటే కష్టంతో కూడుకున్న పని, దినసరి లావాదేవీలన్నీ 500 కంటే తక్కువ మొత్తంలోనే జరుగుతాయి.గతంలో పాత పెద్ద నోట్ల రద్దు సమయంలో ఎన్ని అక్రమాలు వెలుగుచూశాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ముఖ్యంగా బ్యాంకింగ్‌ ‌రంగ పెద్దల అవినీతిపై అనేకానేక ఆరోపణలు వచ్చాయి.ఈ నేపథ్యంలో ఇప్పుడు కూడా నోట్ల మార్పిడితో రకరకాల ప్రలోభాలు,అవకతవకలకు ఆస్కారం ఉంటుందన్న అనుమానాలు తలెత్తినాయి. చెలామణిలోకి వచ్చిన రెండు వేల రూపాయల నోట్లలో 89శాతం 2017 కంటే ముందే జారీచేశారు.6.73 లక్షల కోట్ల విలువైన రూ.వేల నోట్లు చలామణిలో ఉన్నాయి.మార్చి 31, 2023 నాటికీ  వరకు ఈ విలువ 3.62 లక్షల కోట్లకు పడిపోయింది.పెద్దనోట్ల రద్దు అనేది కేవలం నల్లడబ్బును నియంత్రించడం వంటి అమాయకమైన ఉద్దేశాలతో జరిగిందని అనుకోలేం.వచ్చే ఎన్నికల్లో విపక్షాలను బికారులుగా చేసి రాజకీయంగా లబ్ది పొందాలనే ఉద్ద్యేశంతో బీజేపీ అప్పటి నుండే రద్దుకు కుట్రపన్నిందనే విమర్శ ఉంది.

image.png
డా।। సంగాని మల్లేశ్వర్‌
‌విభాగాధిపతి, జర్నలిజం శాఖ,కాకతీయ విశ్వవిద్యాలయం, వరంగల్‌, 9866255355

Leave a Reply