- అంతర్జాతీయ స్థాయి ఐఎస్వో గుర్తింపు
రాష్ట్రంలో తొలి గ్రామం - అన్నింటిలో ఉన్నత ప్రమాణాలను పాటించిన ఉత్తమ గ్రామంగా ఎంపిక
- ప్రజల భాగస్వామ్యంతో ఏదైనా సాధ్యం..ఇదే స్ఫూర్తిని కొనసాగించాలి : అభినందించిన మంత్రి హారీష్ రావు
ఉన్నత ప్రమాణాలను పాటిస్తున్న…ఉత్తమ గ్రామం ఇరుకోడ్ అని అంతర్జాతీయ ప్రమాణాల ఆర్గనైజేషన్(ఐఎస్వో) గుర్తించింది. ఈ సందర్భంగా సంస్థ సర్టిఫి•కేషన్ ఇస్తూ ఎంపిక అయినట్లు ప్రకటించింది. రాష్ట్రంలో ఐఎస్వోకు ఎంపికయిన తొలి గ్రామంగా ఇరుకోడ్ ఆదర్శంగా నిలిచింది. గ్రామం అన్నింటిలో ఉత్తమమని..ఉన్నత ప్రమాణాలను పాటిస్తున్నదని అంతర్జాతీయ ప్రమాణాల ఆర్గనైజేషన్ గుర్తించింది.
ఇరుకోడ్ గ్రామంలో గ్రామపంచాయతీ పౌర సేవలు, గృహ అనుమతులు, లే ఔట్స్ అనుమతులు, ఆస్తుల మార్పు, సమర్థవంతమైన నీటి నిర్వహణ, రోడ్లు, పారిశుద్ధ్య నిర్వహణ, తడి పొడి చెత్త సేకరణ, మొక్కల పెంపకం, పాఠశాల భవనాల నిర్వహణ, పన్నుల వసూలు, ప్రభుత్వ పథకాలు సక్రమంగా నిర్వహణకు గాను ఉన్నత ప్రమాణాలను పాటిస్తూ గ్రామం ఆదర్శంగా నిలిచింది. అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకుని గ్రామాన్ని గుర్తించి ఐఎస్వో సంస్థ సర్టిఫికెట్ ఇచ్చింది రాష్ట్రంలోనే ఈ విధంగా గుర్తింపు పొందిన తొలి గ్రామంగా ఇరుక్కోడ్ నిలిచింది.
ప్రజల భాగస్వామ్యంతో ఏదైనా సాధ్యం..ఇదే స్ఫూర్తిని కొనసాగించాలి : అభినందించిన మంత్రి హారీష్ రావు
గ్రామ ప్రజల ఐక్యత..ప్రతి పనిలో ప్రజల భాగస్వామ్యం ఉంటే ఏదైనా సాధ్యమని ఇరుకోడ్ గ్రామము నిరూపించిందని మంత్రి హరీష్ రావు అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో గ్రామములో ఉన్నత ప్రమాణాలను పాటిస్తూ.. మంచి పనితీరు కనబరిచిన ఇరుకోడ్ గ్రామము ఐఎస్వో గుర్తింపుతో ఆదర్శంగా నిలిచిందని.. ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని, అన్ని గ్రామాలు ఇరుకోడ్ గ్రామాన్ని స్పూర్తిగా తీసుకోవాలని చెప్పారు. గుర్తింపు రావడంలో భాగస్వామ్యం అయిన ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులను ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు అభినందించారు.