Take a fresh look at your lifestyle.

‌పురోగతిలో నీటిపారుదల రంగం

  • ప్రాజెక్టులను కడుతూనే చెరువుల పునరుద్దరణ
  • ఉమ్మడి ఎపిలో తీవ్రంగా నష్టపోయాం: మంత్రి హరీష్‌రావు

నీళ్లు, నిధులు, నియామకాలు అన్న నినాదంతో పోరాడి సాధించుకున్న తెలంగాణలో.. సీఎం కేసీఆర్‌ ‌నాయకత్వంలో ఐదేండ్లలో సాగునీటి రంగంలో అనేక ప్రగతిని సాధించామని మంత్రి హరీష్‌ ‌రావు అన్నారు. మిషన్‌ ‌కాకతీయ లాంటి బృహత్తర కార్యక్రమంతో రాష్ట్రవ్యాప్తంగా 46 వేల చెరువులను పునరుద్దరించినట్లు చెప్పారు. రాష్ట్రంలో ప్రతి నీటి చుక్కను ఒడిసి పట్టి రైతంగానికి నీరు అంధిచేవిధంగా దశలవారిగా చెక్‌ ‌డ్యాంల నిర్మాణం చేపడుతామని మంత్రి హరీష్‌ ‌రావు చెప్పారు. ప్రాజెక్టులను పూర్తి చేయడం, చిన్ననీటి పారుదల రంగాన్ని బాగు చేయడంతో వ్యవసాయరంగం బాగా పురోగమించిందన్నారు. నీటిపారదుల రంగానికి తెలంగాణ ప్రాధాన్యం ఇస్తోందన్నారు. కాళేశ్వరం లాంటి భారీ ప్రాజెక్టులను కట్టిందన్నారు.

- Advertisement -

ఉమ్మడి ఆంధ్రాలో నిర్లక్ష్యానికి గురయిన తెలంగాణ ఇప్పుడు నీటిపారుదల రంగంలో బాగా పురోగమించిందని అన్నారు. రైతు బంధు మంచి కార్యక్రమమేనని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ ‌రెడ్డి అన్నారు. రైతులకు ఎలాంటి సాయం చేసినా మంచిదేనన్నారు. రైతుబంధు ప్రయోజనాలు ధనవంతులకు కాకుండా నిజమైన పేద రైతులకే దక్కాలన్నారు. వివిధ శాఖల బడ్జెట్‌ ‌పద్దులను మంత్రులు ప్రవేశపెట్టగా.. వీటిపై శనివారం అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా రాజగోపాల్‌ ‌రెడ్డి మాట్లాడుతూ.. అన్నం పెట్టే రైతుకు రైతుబంధు పథకం మంచి కార్యక్రమం. మనలో చాలామంది వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినవాళ్లమే. ప్రభుత్వం ఖర్చు చేసే నిధులు నిజంగా వ్యవసాయం చేసేవాళ్లకు, పేద రైతులకు దక్కాలనేది నా ఉద్దేశం. రైతుబంధు నిధులు నా ఖాతాలో రూ.3లక్షలు జమయ్యాయి. భూస్వాములు, పెద్ద రైతులకు కూడా ప్రభుత్వం డబ్బులిస్తోంది.

నాలాంటి వాళ్లకు రైతుబంధు డబ్బులు అవసరమా? ప్రభుత్వ సొమ్ము ప్రతిపేద రైతుకు అందాలి. రైతుబంధు కింద ఇచ్చే నిధులు రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, ప్రతి పంటకు గిట్టుబాటు ధర వచ్చేలా ఖర్చు చేస్తే వ్యవసాయంచే ప్రతి వ్యక్తికీ లాభం చేకూరుతుంది’ అన్నారు. ఆర్టీసీ సమ్మె వల్ల ఎవరు లాభపడ్డారని రాజగోపాల్‌ ‌రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ సమ్మెతో ప్రజలు, కార్మికులు ఎన్నో ఇబ్బందులు పడ్డారన్నారు. చనిపోయిన కార్మికులను తిరిగితేగలరా?అన్నారు. బెల్ట్‌షాపులు పెట్టడం ద్వారా ప్రభుత్వం ఒక చేత్తో నగదు ఇచ్చి మరో చేత్తో తీసుకుంటోందన్నారు. రాష్ట్రంలో వెంటనే బెల్ట్ ‌షాపులను ఎత్తివేయాలని డిమాండ్‌ ‌చేశారు. మద్యపానానికి బానిసలైన అనేకమంది యువత నాశనమవుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. కరోనా కంటే భయంకరమైన వ్యాధి.. బెల్టుషాపులన్నారు. ప్రజలకు నష్టం జరిగే పనిచేసేందుకు వీల్లేదన్నారు.ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే బెల్ట్ ‌షాపులను తొలగించాలని డిమాండ్‌ ‌చేశారు.

Leave a Reply