Take a fresh look at your lifestyle.

‌ప్రేక్షకులు లేకున్నా ఐపిఎల్‌ ‌నిర్వహణ

బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ ‌గంగూలీ కీలక వ్యాఖ్యలు

ఐపీఎల్‌ ‌నిర్వహణపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ ‌గంగూలీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది జరగాల్సిన ఐపీఎల్‌ ‌టోర్నీని.. అవసరమైతే ఖాళీ స్టేడియాల్లోనూ నిర్వహించే అవకాశం ఉందన్నారు.  ప్రేక్షకులు లేకున్నా పోలీలకు సిద్దంగా ఉన్నామని అన్నారు. కోవిడ్‌19 ‌వల్ల ఇండియన్‌ ‌ప్రీమియర్‌ ‌లీగ్‌ .. ‌నిరవధికంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. కానీ ఆ మెగా టోర్నీని ఈ ఏడాది నిర్వహించేందుకు విశ్వాసంగా ఉన్నట్లు గంగూలీ తెలిపారు. టోర్నీ నిర్వహణకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఐసీసీ బోర్డు టింగ్‌ ‌తర్వాత ఈ అంశంపై బుధవారం రాత్రి అన్ని సంఘాలకు గంగూలీ లేఖ రాశారు. ఈ ఏడాది ఎట్టి పరిస్థితుల్లోనైనా ఐపీఎల్‌ను నిర్వహించే ఆసక్తితో గంగూలీ ఉన్నట్లు ఆ లేఖ ద్వారా తెలుస్తోంది. అభిమానులు, ఫ్రాంచైజీలు, ప్లేయర్లు, బ్రాడ్‌కాస్టర్లు, స్పాన్సర్లు, స్టేక్‌ •ల్డర్లతో ఈ అంశంపై చర్చిస్తున్నట్లు గంగూలీ తెలిపారు. భారత్‌తో పాటు ఇతర దేశాలకు చెందిన క్రికెటర్లు.. ఈ ఏడాది జరగాల్సిన ఐపీఎల్‌లో పాల్గొనేందుకు ఆసక్తిని ప్రదర్శించారని, మేం కూడా ఈ టోర్నీపై ఆశగా ఉన్నామని, భవిష్యత్తు కార్యాచరణనను త్వరలో వెల్లడించనున్నట్లు గంగూలీ తెలిపారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!