Take a fresh look at your lifestyle.

మానసిక ఆరోగ్యంలో పెట్టుబడులు పెరగాలి

మనిషి సంతోషంగా జీవించడానికి, ఆనందంగా గడపడానికి మానసికంగా దృఢత్వాన్ని ఏర్పరుచు కోవడానికి, ప్రపంచ వ్యాప్తంగా మానసిక ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించడానికి వరల్డ్ ‌ఫెడరేషన్‌ ఆఫ్‌ ‌మెంటల్‌ ‌హెల్త్ 1992 ఆక్టోబర్‌ 10, ఏర్పడింది. అందుకే ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం అక్టోబర్‌ 10‌న జరుపుకుంటాం. మానసిక ఆరోగ్యంలో పెట్టుబడుల అవసరంపై చైతన్యం కలిగించడం ఈ ఏడాది ఆరోగ్య దినోత్సవ ప్రధాన ప్రచార లక్ష్యం. ప్రపంచ వ్యాప్తంగా 20% మంది పిల్లలు, యువత  మానసిక రుగ్మతలు లేదా సమస్యలతో బాధ పడుతున్నారు.  23% మందికి మానసిక పదార్ధాల ఉపయోగ విధాన లోపాలతో  వైకల్యం ఏర్పడుతున్నది. ప్రతి సంవత్సరం 8 లక్షల మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరణానికి ఆత్మహత్య రెండవ ప్రధాన కారణ మైంది. మానసిక రుగ్మత, మద్యపానం ప్రపంచవ్యాప్తంగా ఆత్మ హత్యలకు దోహదం చేస్తున్నాయి. ప్రకృతి వైపరీత్యాలు మానసిక ఆరోగ్యం పై ప్రభావాన్ని చూపుతున్నాయి. హెచ్‌ ఐ ‌వి, హృదయ సంబంధ వ్యాధి, మధుమేహం వ్యాధులు మానసిక రుగ్మతలకు  కారణమౌతున్నాయి. మానసిక రుగ్మతలను తగ్గించడానికి  చికిత్సలు ఉన్నప్పటికీ రుగ్మతల పట్ల అవగాహన లేకపోవడం వలన చికిత్స కోసం జనం మొగ్గు చూపడం లేదు. కొన్ని దేశాలలో మాత్రం మానసిక వికలాంగుల హక్కులను పరిరక్షించే విధంగా చట్టాలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మానసిక ఆరోగ్య నిపుణులు,  సైకాలజిస్ట్, ‌సైక్రియాట్రిస్ట్ ‌ల కొరత ఉంది. భవిశ్యత్తు కాలంలో ఇదిమరింత పెరిగే ప్రమాదం ఉంది.

మానసిక ఆరోగ్య సేవలు విస్తరించక పోవడానికి, మానసిక ఆరోగ్యాన్ని ప్రజారోగ్య అజెండాలో చేర్చక పోవడం, మానసిక ఆరోగ్యానికి సరిపడ నిధులు కేటాయించక పోవడం, మానసిక ఆరోగ్యాన్ని కాపాడే మానసిక ఆరోగ్యనిపుణుల కొరత, మానసిక ఆరోగ్య పరిరక్షణకు ఆలోచించే నాయకత్వం లేకపోవడం అందుకు ప్రధాన కారణాలుగా పేర్కొంటున్నారు. మానసిక ఆరోగ్యంలో పెట్టుబడులు: కోరోనా వైరస్‌ ‌వ్యాప్తి వలన ప్రజల దైనందిన జీవితంలో గణనీయ మార్పులు వచ్చాయి. ప్రజల మానసిక ఆరోగ్యపై ప్రభావం పడింది. రకరకాల  పరిస్తితులు, సవాళ్లు ఎదుర్కొంటున్నారు. ఆర్థిక వ్యవస్థపై  భారం పడింది . కార్మికుల కర్షకుల పరిస్థితి దారుణంగా మారింది. విద్యార్థులు పాఠశాలలకు దూరమై ఆన్‌ ‌లైన్‌ ‌తరగతులకు హాజరవు తున్నారు. ఒంటరి తనం జీవనాన్ని అలవరచు కున్నారు. ఈ  అనుభవం బట్టి, భవిష్యత్తులో  మానసిక ఆరోగ్యం అవసరం పెరుగు తున్నది. జాతీయ,  అంతర్జాతీయ స్థాయిలో మానసిక ఆరోగ్య కార్యక్రమాలలో పెట్టుబడులు గతంలో ఉన్నదానికంటే ఇప్పుడు చాలా ప్రాధాన్‌ ‌సంతరించుకొంటుంది. లాక్‌ ‌డౌన్‌ ‌తో  కొత్త మానసిక సమస్యలు తయారయ్యాయి.  ప్రతివారి మానసిక ఆరోగ్య సంరక్షణకు సంబంధిత ఆరోగ్య రంగంలో గతం కంటే ఎక్కువ పెట్టుబడి అవసరం. ప్రపంచ వ్యాప్తంగా 450 మిలియన్ల మంది అనారోగ్యం,  వైకల్యానికి ప్రధాన కారణం మానసిక రుగ్మతయేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ 2001 నివేదిక చెబుతున్నది. అభివృద్ది చెందిన దేశాలలో 50% మంది, అభివృద్ది చెందుతున్న, వెనుక బడిన దేశాలలో 85% మంది చికిత్స లేని మానసిక రుగ్మతలతో బాధ పడుతున్నారని 2012 లో వెల్లడించింది. తాజాగా లాక్డౌన్‌ ‌వలన,  భౌతికంగా ఒంటరితనం వలన గమానసిక ఆరోగ్య సమస్యలు పెరిగినట్లు సర్వేలు నిరూపిస్తున్నాయి. కోరోనా భయం, హోమ్‌ ‌క్వారైంటెన్‌ ‌లో ఉన్న పలువురు మానసిక సమస్యలతో తల్లడిల్లుతున్నారు.

లక్షలాది మంది మానసిక రుగ్మతలతో జీవిస్తున్నప్పటికీ, మానసిక ఆరోగ్య సంరక్షణ పట్ల ప్రభుత్వాల శ్రద్ద ఆంతంత మాత్రంగానే  ఉంది.  మానసిక ఆరోగ్య అవగాహన పెరిగినా, ప్రపంచ వ్యాప్తంగా మానసిక ఆరోగ్య పెట్టుబడులు మాత్రం మార్పు లేకున్నాయి. అందరూ ఇదొక సామాజిక బాధ్యతగా భావించాలి.  ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం కేవలం ఒక రోజు కార్యక్రమం కాదు. మానసిక ఆరోగ్యంలో ఎక్కువ పెట్టుబడులు పెట్టడానికి చర్యలు తీసుకునేలా ప్రభుత్వాలు, దాతలు, స్వచ్ఛంధ సంస్థలు, సమాజ సేవకులు ముందుకు రావాలి.

డా. అట్ల శ్రీనివాస్‌రెడ్డి
రిహాబిలిటేషన్‌ ‌సైకాలజిస్ట్ ‌ఫ్యామిలీ కౌన్సెలర్‌, 9703935321

Leave a Reply