తిరుపతి, జనవరి 21 : తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని డ్రోన్ కెమెరాతో చిత్రీకరించిన ఇన్స్టాగ్రామ్ రీల్ శుక్రవారం సామాజిక మాధ్యమాల్లో వ్యాపించడం కలకలం సృష్టించింది. ఈ అంశంపై టిటిడి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. ఆనంద గోపురంపై చిత్రీకరణలకు అనుమతి లేదని తెలిపారు.
సోషల్ డియాలో వచ్చిన వీడియో విజువల్స్‌పై విచారణ జరుపుతున్నామని తెలిపారు. సోషల్ డియాలో వీడియోను పెట్టిన వ్యక్తిని గుర్తించామని తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన యువకులు ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో అప్ లోడ్ చేసినట్లు గుర్తించామన్నారు. వాస్తవాలను రెండు రోజుల్లో భక్తుల ముందు పెడతామన్నారు. డ్రోన్ చిత్రాలు, దృశ్యాలపై భక్తులు ఆందోళన చెందాల్సిన పని లేదని ఆయన విజ్ఞప్తి చేశారు.